Latest Updates
-
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు!
మీ రాశిని బట్టి మీరు ధరించాల్సిన లక్కీ స్టోన్ ఏది ?
ఈ నవరత్నాలలో ఏది ధరించినా అందులో దాగి వున్న కాశ్మిక్ శాక్తి ఆ మనిషిని అందించబడుతుంది. నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందగలుగుతాడు. బంగారు సూర్యగ్రహ లోహం. అందుకే బంగారంలో ఈ నవరత్నాలను ధరించడం ఒక ఆరోగ్యకర అమర్గమనే నమ్మకం పెరిగింది. నవరత్నాలతో కూడిన నగలు తయారుచేయడం ఒక ప్రత్యేకక కళగా రాజులు ప్రోత్సహించారు. నవరత్నాలు పొదిగిన నగలు చెవులకీ, చేతులకీ మెడలోనూ ధరించేదిగా తయారు చేసేవారు.వీటి అమరిక నవగ్రహాలు. ఆ గ్రహానికి చెందిన రత్నానికి తగినట్టుగా చేసేవారు. ఆ నవగ్రహాలను ధరించుటమంటే ఆ గ్రహదేవతలందరికీ శాంతి చేయించటమే. ఆ దేవతల కరునా కటాక్షాలు శాశ్వతంగా ధరించే వారి మీద ఉంటాయి. నవరత్నాలు ఉన్న నగలు ధరించిన వారికి జీవన విధానం కూడా నిర్దేశించారు. ఎంతో నిష్టాగరిష్టంగా ఉండాలి
చెడు ఆలోచనలు రానివ్వకూడదని విధంగా చెడ్డ పనులు చేయకుండా జీవితం సాగించాలి. లేకుంటే ఆ నవరత్న ఫలితం వికటిస్తుందనే నమ్మకం ఉంది. దీని వలన మనిషి నడవడిక క్రమ పద్ధతిలో ఉంటుంది.నవరత్నాల నగలు తయారీకి ఉపయోగించే అన్ని రాళ్ళు ఒకే సైజులో ఉండాలి. అవి కూడా స్వచ్చమైనవి కావాలి. నాసిరకం రత్నాలు వాడితే సత్ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలను చవిచూడాల్సి ఉంటుంది. మగవారికోసం నవరత్నాలు పొదిగిన ఉంగరాలు తయారుచేస్తుంటారు. పన్నెండు వరుసలలో నవరత్నాలను వాడి 108 రత్నాల ఉంగరాలను తయారుచేసే పద్ధతి దక్షిణాది రాష్ట్రాలలో ఉంది.
నవరత్నాలలో మేలు ఉన్నప్పటికీ వాటిని ధరించటంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు వహించాలంటుంది శాస్త్రం. నవరత్న శాస్త్రాన్ని నమ్మితే ఆ పద్ధతులను పాటించాల్సిందే. నవరత్న ఎంపిక దగ్గర నిపుణులను సంప్రదించాలి. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పద్ధతిలో ధారణకు సిద్ధం చేస్తారు.
12 రాశుల జాతకులు ధరించాల్సిన నవరత్నాల గురించి తెలుసుకోవాలనుందా.. ఐతే ఈక్రింది స్లైడ్ ఫాలో అయిపోవండి
మీ రాశిని బట్టి మీరు ఎంపిక చేసుకోవల్సిన లక్కీ స్టోన్..

మేషం
మేషరాశి జాతకులు పగడాన్ని ధరించాలి. ఈ జాతకులు పగడపు రత్నాన్ని ధరించడం ద్వారా దైవ కటాక్షం లభిస్తుంది. కోపం తగ్గుతుంది. అదృష్టం కలిసొస్తుంది.

వృషభ రాశికారులు..
వజ్రాన్ని ధరించాలి. వజ్రాన్ని ధరించడం ద్వారా సుఖసంతోషాలు, మంచియోగం లభిస్తుంది. ఇంకా వజ్రాధరణతో వృషభ జాతకులకు ప్రత్యేక ఆకర్షణ, తేజస్సు లభిస్తుంది.

మిథునం
జాతిపచ్చను ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈ రత్నాన్ని ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి వుంటుంది. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

కర్కాటక జాతకులు
ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సకలసంపదలు లభిస్తాయి. వాణిజ్యపరంగా, ఆరోగ్యపరమైన సమస్యలుండవు.

సింహం
కెంపును ధరించాలి. రూబీ అనే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా అదృష్టవంతులవుతారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

కన్యారాశి
జాతకులు జాతిపచ్చను ధరించడం మంచిది. దీన్ని ధరించడం ద్వారా వాణిజ్యపరంగా ముందడుగు వేస్తారు. అదృష్టాన్నిస్తుంది. సంకల్పాలు నెరవేరుతాయి.

తులా రాశి
జాతకులు (Diamond) వజ్రాన్ని ధరించడం ద్వారా వాహనాల కొనుగోలు చేస్తారు. రావాల్సిన ఆస్తులు వస్తాయి. తేజస్సు లభిస్తుంది. మంచి యోగం చేకూరుతుంది.

వృశ్చిక
లగ్నకారులు పగడం ధరించాలి. దీన్ని ధరించడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. ఆగ్రహం తగ్గిపోతుంది. అదృష్టం చేకూరుతుంది. సకల సంతోషాలు చేకూరుతాయి.

ధనుస్సు
కనక పుష్య రాగం (Yellow Shappire): ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులు కనకపుష్యరాగాన్ని ధరించాలి. పసుపు రంగులో ఉండే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా సిరిసంపదలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతనిస్తుంది. ఆస్తులు చేకూరుతాయి.

మకర రాశి
నీలం (Blue Shappire): మకర జాతకులు నీల రత్నాన్ని ధరించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. దైవానుగ్రహం లభిస్తుంది.

కుంభం
నీలం (Blue Shappire): కుంభ రాశి జాతకులు కూడా నీల రత్నాన్ని ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దైవానుగ్రహం లభిస్తుంది.

మీనం
కనక పుష్య రాగం (Yellow Shappire) : మీన రాశి జాతకులు ఈ రత్నాన్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంత చేకూరుతుంది. సకలసంపదలు చేకూరుతాయి.



Click it and Unblock the Notifications