Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లీప్ ఇయర్ గురించి స్టన్నింగ్ ఫ్యాక్ట్స్
స్కూలింగ్ లో ఉన్నప్పుడు మనమందరం లీప్ ఇయర్ గురించి తెలుసుకునే ఉంటాం. ఇది నాలుగేళ్లకు ఒకసారి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఫిబ్రవరీ ఒక రోజు ఎక్కువగా వస్తే దాన్ని లీప్ ఇయర్ గా పిలుస్తామని కూడా అందరికీ తెలిసిన విషయమే.
అయితే మన స్కూల్ టీచర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ప్రొఫెసర్స్ గానీ. ఎవరూ చెప్పని మరిన్ని ఆసక్తికర నిజాలు ఈ లీప్ ఇయర్ లో దాగున్నాయి. అవేంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందా.. ? అయితే ఈ ఆర్టికల్ ఖచ్చితంగా చదవాల్సిందే..
ఫిబ్రవరి నెలలో 28 రోజులుంటాయి. అయితే.. లీప్ ఇయర్ లో ఈ నెలలో మరో రోజు ఎక్కువగా ఉంటుంది. అదే ఫిబ్రవరీ 29. ఈ ఏడాది లీప్ ఇయర్. ఎందుకంటే.. ఈ రోజు ఫిబ్రవరి 29 అదే లీప్ డే. ఇలాంటి రోజుతో చాలా దేశాల క్యాలెండర్లు ఉంటాయి. హిందూ క్యాలెండర్, చైనీస్ క్యాలెండర్, జులైన్ క్యాలెండర్, బెంగాలీ క్యాలెండర్, రోమన్ క్యాలెండర్, హెబ్రీయ్ క్యాలెండర్ ఉంటాయి. ఇవే కాకుండా.. మరికొన్ని స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మ్యారేజ్
కొన్ని దేశాల్లో లీప్ ఇయర్ లో పెళ్లిళ్లు చేయరు. ఎందుకంటే.. వాళ్లు లీప్ ఇయర్ ని దురదృష్టంగా భావిస్తారు. అందుకే ఇలాంటి లీప్ ఇయర్ లో పెళ్లి ఆలోచనలు ఉండవు.

బర్త్ డే, డెత్ డే
ఒక వ్యక్తి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎలా అంటారా ? ఫిబ్రవరీ 29న అంటే లీప్ డే పుట్టాడు.. మళ్లీ లీప్ డేనే చనిపోయాడు. 68 ఏళ్లు బ్రతికాడతడు. అతను తస్మానియా గవర్నర్ గా పనిచేశాడట. ఒక వ్యక్తి బర్త్ డే, డెత్ డే ఒకేరోజు కావడమే ఆసక్తికరం అయితే.. లీప్ డే అంటే నాలుగేళ్లకు ఒకసారి వచ్చే రోజు కావడం మరింత ఆసక్తికర విషయమే కదా..

ముసలివాళ్లు
తైవాన్ వంటి దేశాల్లో లీప్ నెలను వయసుపైబడిన తల్లిదండ్రులకు మంచిది కాదని భావిస్తారు. అందుకే పెళ్లైన కూతుళ్లు ఈ నెలలో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. వాళ్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు.

లీప్ డే
1400 మందిలో ఒకరు లీప్ డే రోజు పుడుతున్నారట. అలా పుట్టిన వాళ్లు బర్త్ డేని.. నాలుగేళ్లకు ఒకసారి చేసుకోవాల్సిందే..

రష్యన్స్
లీప్ ఇయర్స్ లో ప్రకృతి వైపరిత్యాలకు ఎక్కువ అవకాశాలుంటాయని రష్యన్స్ చాలా గట్టిగా విశ్వసిస్తారట. అలాగే చెడు వాతావరణం, మరణాలు ఎక్కువగా ఉంటాయని వాళ్లు ఆందోళన చెందుతారు.

బ్యాచిలర్స్ డే
ఐర్లాండ్ వంటి దేశాల్లో ఫిబ్రవరి 29ని బ్యాచిలర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే.. అమ్మాయిలు అబ్బాయిలకు ఈరోజే ప్రపోజ్ చేస్తారట.



Click it and Unblock the Notifications