Latest Updates
-
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే!
అసహజ ప్రదేశాల్లో నిద్రలోకి జారుకున్న వ్యక్తులు
మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యం.దానికి తగినంత నిద్ర లేకపోతే అది అసహజంగా ప్రవర్తిస్తుంది కూడా.కలల లోకంలో విహరించే నిద్రా సమయాన్ని ఇష్టపడనిదెవ్వరు చెప్పండి??మనకి తగినంత నిద్ర లేకపోతే ఎక్కడ ఉన్నాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని కూడా చూడకుండా మన శరీరం నిద్రలోకి జారిపోతుంటుంది.అవును,మనలో చాలా మందికి ఇది అనుభవమయ్యే ఉంటుంది,మాతో ఏకీభవిస్తారు కూడా.
ఈరోజు ఆర్టికిల్‌ల్లో అత్యంత అసహజ ప్రదేశాల్లో ఇలా నిద్రలోకి జారుకున్న వ్యక్తుల గురించి ఉదహరించాము.ఈ సంఘటనలని పరిశీలిస్తే తగినంత నిద్రపోకపోవడం వల్ల తామున్న ప్రదేశాలని కూడా చూసుకోకుండా నిద్రలోకి జారుకున్న వారు కనపడతారు.ఈ సంఘటనలు కొన్ని నవ్వు తెప్పిస్తే కొన్ని భయం కలిగిస్తాయి.
దొంగతనానికొచ్చి నిద్రలోకి జారుకున్న ఒక దొంగ, విమానాశ్రయంలో లగేజీ బెల్ట్ మీద హాయిగా నిద్రపోయిన పొక ప్రయాణీకుడు ఇలా వివిధ రకాల ఉదంతాలున్నాయి.ఆసక్తి కలిగించే ఆయా సంఘటనలని చదవండి.తరువాత ఇలా అసహజ ప్రదేశాల్లో నిద్రలోకి జారుకునే వ్యక్తి మీరే కావచ్చు సుమా, లేవండీ, మేల్కొనండీ..

1.దొంగతనానికొచ్చి నిద్రలోకి జారుకున్న దొంగగారు
ఫ్లోరిడా రాష్ట్రంలోని సరసోటాలో దొంగతనానికొచ్చి అలా కుర్చీలో కునుకులోకి జారుకున్న దొంగని పట్టుకున్నామని పోలీసులు ప్రకటించారు.తిమొతీ బాంట్రేజర్ అనే పేరున్న దొంగ ఒక స్త్రీ ఇంట్లో దొంగతనానికొచ్చి నిద్రపోయాడు.అకస్మాత్తుగా నిద్ర మేల్కొన్న ఆ స్త్రీ లేచి ఈయనని చూసి తన ఇంట్లో ఏమి చేస్తున్నావని అడిగితే క్షమాపణ చెప్పి ఇంట్లో నుండీ బయటకి వెళ్ళిపోయాడు.ఈవిడ వెంటనే పోలీసులకి ఫోను చేసేసరికి దోపిడీ నేరం కింద ఆ దొంగని అరెస్ట్ చేసారు.

2,ఫ్లైట్ కార్గోలొ నిద్రపోయిన బ్యాగేజీ హ్యాండ్లర్
అలస్కా విమానయాన సంస్థకి చెందిన బ్యాగేజ్ హ్యాండ్లర్ ఒకతను విమానంలో ప్రయాణీకుల సామాను ఉంచే కార్గో ఏరియాలో నిద్రపోయాడుట.లేచి చూస్తే ఏముంది,పీడనం అధికంగా ఉండి, వాతావరణం నియంత్రించబడి ఉన్న కార్గోలో ఉన్నాడు.వెంటనే గోడలని దబ దబా బాదడం మొదలెట్టేసరికి విమానాన్ని అత్యవసరంగా కిందకి దించారుట.

3.న్యూస్ చదువుతూ నిద్రలోకి జారుకున్న న్యూస్ రీడర్
డగ్ లుజేడర్ అన్న పేరు గల ఒక న్యూస్ రీడర్ ఒక మంగళవారం రోజు వార్తలు చదువుతూ అలా ప్రత్యక్ష ప్రసారంలోనే నిద్రలోకి జారుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.31కి అతను న్యూస్ చదువుతున్నాడుట, పాపం ఆ రిపోర్టరుకి నిద్ర సరిపోలేదేమో.

4.రేడియేటర్ మీద నిద్రపోయిన విద్యార్ధి
ఒక్కోసారి కొన్ని ప్రదేశాల్లో నిద్రలోకి జారుకుంటే చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది సుమా. 21 ఏళ్ళ విద్యార్ధి ఒకడు చల్లగా ఉన్న రేడియేటరుకి ఆనుకుని మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఒక్కసారిగా ఏదో గుచ్చుతున్న నెప్పి కలిగేసరికి లేచి చూస్తే ఏముంది,ఆన్ చేయబడిన ఈ రేడియేటర్ వల్ల తన చేతిలో సగ భాగం కరిగిపోయింది.ఇక మిగిలిన చేయిని బలవంతంగా చర్మం ఊడిపోయేటట్లు బయటకి లాగాల్సొచ్చిందిట.నిద్ర లేవగానే ఇలాంటి అనుభవం ఎదురవ్వడం నిజంగా చాలా దురదృష్టకరం.

5.బ్యాగేజీ బెల్టు మీద నిద్రపోయిన పర్యాటకుడు
నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.రోం లోని ఫీమూచినో విమానాశ్రయంలో ఒక అనామక ప్రయాటకుడు బ్యాగేజ్ వచ్చే బెల్ట్ మీద నిద్రపోయాడు.ఎక్స్‌రే స్కానర్ అతడిని పసిగట్టే ముందు అతను దాదాపు 160 అడుగులు అలా బెల్ట్ మీద నిద్రపోయే ప్రయాణించాడు.ఎయిర్‌లైన్ వారీ కౌంటర్లో ఎవ్వరూ లేరని చూసి కౌంటర్ దాటి వచ్చి తన బ్యాగుతో సహా ఈ పర్యాటకుడు లగేజీ బెల్ట్ మీద నిద్రపోయాడుట.



Click it and Unblock the Notifications