Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మనుషులు వీటిని కూడా తింటారా ? చూస్తే షాక్ అవుతారు...
మనంమనందరం బతకడానికి ఆహారం తీసుకుంటాం. కానీ.. కొంతమంది వింత మనుషులు మాత్రం.. వింతవింత వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు. వింటుంటేనే ఎంతో అసహ్యంగా ఉంటున్న ఈ పదార్థాలను వాళ్లు ఎలా తీసుకుంటున్నారో. అసలు మనుషులు ఇలాంటివి కూడా తింటారా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాదు కాదు.. అసహ్యించుకుంటారు.
అసలు ఇలాంటి వాటిని తింటారన్న ఊహ కూడా మీరు భరించలేరు. మనం చూస్తేనే అసహ్యించుకునే వాటిని వాళ్లు డైట్ లో చేర్చుకుంటున్నారు. కొంతమందైతే.. అదే ఆహారంగా తినేస్తున్నారు. మనుషులు తింటున్న ఆ భయంకరమైన పదార్థాలేంటో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందా.. అయితే.. వెంటనే డేర్ చేయండి...

యూరిన్
వామ్మో మనమంతా బతకడానికి ఆహారం తీసుకుంటుంటే.. వాళ్లు మాత్రం.. యూరిన్ తీసుకుంటారట. అంతేకాదు.. అది హెల్తీ అని చెబుతున్నారు. ఈ పద్ధతిని కొంతమంది పాటిస్తున్నారు.

మనుషుల బూడిద
మనుషుల బూడిద కూడా తింటారని ఇప్పుడే వింటున్నారు కదూ. నిజమే.. ఈమె భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని బూడిద ఆమె అరచేతిలో పడింది. అతనిపై రెస్పెక్ట్ తో దాన్ని తినింది. ఆ రుచి నచ్చడంతో.. దానికి అడిక్ట్ అయిపోయింది. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు తింటూనే ఉంది.
Image Courtesy

సోఫా లోపల ఉండే పదార్థం
ఫ్లోరిడాకు చెందిన అడేలా అనే యువతి.. సోఫా లోపల ఉండే మెత్తటి పదార్థం తినడానికి తెగ ఇష్టపడతుందట. ఆమె తన జీవితకాలంలో 200 పౌండ్ల సోఫాల పదార్థం తినేసిందట.
Image Courtesy

టాయిలెట్ పేపర్
ఒక మహిళ రోజుకి సగం టాయిలెట్ రోల్ పేపర్ తినేస్తుందట. అది తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటుందని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. ఇంకో విషయం తెలుసా.. ఆమె సినిమా చూస్తూ.. పాప్ కార్న్ కి బదులు టాయిలెట్ పేపర్ తినేస్తోందట. అంతగా అడిక్ట్ అయింది.

మ్యాగ్నేట్స్
పోట్లాండ్ కి చెందిన ఒక పాప.. తీవ్ర పొట్టనొప్పితో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు.. ఆమె బ్రేస్ లైట్ తినిందని గుర్తించారు. అయితే బాల్ షేప్ లో ఉండే 37 మాగ్నెట్స్ తింటే.. అవి లోపల బ్రేస్ లైట్ రూపంలోకి మారాయి.
Image Courtesy

చాక్ పీస్
మామూలుగా స్కూల్ లో చాక్ పీస్ లు, బలపాలు తినడం చూసి ఉంటాం. కానీ.. 22 ఏళ్ల క్రిస్టిన్ అనే మహిళ చాక్ పీస్ తినే అలవాటును తన స్కూలింగ్ లో మొదలుపెట్టింది. ఆ అలవాటు అలాగే కొనసాగుతోంది.

సోప్
ఫ్లోరిడాకి చెందిన 19 ఏళ్ల టెంపెస్ట్ సోపులు తినడానికి తెగ ఇష్టపడుతుందట. ఈ అమ్మాయి రోజుకి కనీసం 5 సోపులైనా తింటుందట. గుండెలో హఠాత్తుగా వచ్చిన మార్పు వల్ల కొంతకాలం తర్వాత.. తినడం మానేసింది.

గ్లాస్
ఓహియోలో ఉండే.. జోష్ గ్లాస్ ఎలా తినాలని బుక్ చదివాడట. అంతే నాలుగేళ్లలో 250 కంటే ఎక్కువ బల్బ్ లు, 100 వైన్ గ్లాసులు తినేశాడు. ఎప్పుడు తిన్నా చాలా టేస్టీగా ఉంటాయని చెబుతున్నాడు జోష్.



Click it and Unblock the Notifications