Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ పేరులో ఏ అక్షరం ఎక్కువసార్లు ఉంటే అదృష్టం ?
చాలా మంది పేరులో ఏముందని భావిస్తారు. కానీ పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెబుతున్నాయి. మీ పేరు మీద ఆధారపడే మీ అదృష్టం, దురదృష్టం ఉంటుందట. మీ పేరు మీ జీవితంపై సానుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రభావం చూపించవచ్చట. కొన్ని పేర్లు అదృష్టం తీసుకొస్తే.. మరికొన్ని పేర్లు కలిసిరావు. మీ పేరు మంచి సంఖ్యను కలిగి ఉంటే.. అదృష్టం, లేకపోతే దురదృష్టమని ఇండియన్ న్యూమరాలజీ వివరిస్తోంది.
చాలామంది పేరు బలాన్ని బట్టి వ్యాపారాలు ప్రారంభిస్తారు. అంటే.. బిజినెస్ కి పేరు పెట్టే ముందు ఇంట్లో ఎవరి పేరుకి బాగా బలం ఉంటే వాళ్ల పేరుతోనే వ్యాపారం ప్రారంభిస్తారు. అలాగే పెళ్లిళ్లు కుదిర్చే ముందు కూడా వధూవరుల పేర్లను సరిచూసి.. ఇద్దరి పేర్లు జాతకం ప్రకారం బలంగా ఉంటేనే వాళ్లకు పెళ్లి చేస్తారు. లేదా కొద్దిపాటి తేడా ఉంటే.. పేర్లలో మార్పులు చేస్తారు. ఇలా ఇండియాలో పేరుకి, పేరులోని అక్షరాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.
కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి పేరు ఏ విధంగానూ కలిసిరాక, ఇబ్బందులు పడుతూ ఉంటే.. న్యూమరాలజిస్ట్ లు పేరులో చిన్ని చిన్ని మార్పులు సూచిస్తారు. అంటే ఒకే అక్షరాన్ని రెండుసార్లు రాసుకోమని చెబుతారు. మరికొన్ని సందర్భాల్లో పేరుకి మరో పేరుని జతచేస్తారు. దీని వల్ల మీ పేరులోని సంఖ్య పెరుగుతుంది. దాని ద్వారా అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. అలాగే ఇంగ్లీసు అక్షరాలను బట్టి కూడా మీ లక్ ఎంతుందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మీ పేరులో ఏ అక్షరం ఎక్కువసార్లు వస్తే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. అసలు మీ పేరు మీకు అదృష్టం తీసుకొస్తుందా లేదా అని చెక్ చేద్దామా..

పేరులోని మొదటి అక్షరం
పూర్వకాలంలో బాగా అలవాటైన పదాలను లేదా వాడుకలో ఉన్న అక్షరాలను మొదటి అక్షరంగా తీసుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం పండితులు జ్యోతిష్యం, న్యూమరాలజీ ప్రకారం మొదటి అక్షరాన్ని సూచిస్తున్నారు.

హిందూ శాస్ర్తం
హిందూశాస్ర్తం ప్రకారం పుట్టిన డేట్, సమయాన్ని లెక్కపెట్టి.. మొదటి అక్షరాన్ని సూచిస్తున్నారు. ఇలా చెప్పిన అక్షరం ద్వారా పేరు పెట్టే కార్యక్రమాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు.

సిక్కిజం
సిక్కులు మొదటి అక్షరాన్ని గురు గ్రాంత్ సాహిబ్ జి స్లోకంలో నుంచి తీసుకుంటారు. ఇందులో నుంచి ఏదో ఒక అక్షరాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు.

ఇస్లాం
ఇస్లాంలలో పేరు చాలా ప్రత్యేకంగా భావిస్తారు. చాలా రకాలు చర్చించి, అంగీకరించిన తర్వాత పుట్టిన బిడ్డకు పేరు పెడతారు. పేరులోని అర్థం నెగటివ్ గా ఉండకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్త పడతారు.

పేరులోని ఇంగ్లీష్ అక్షరాలు
ప్రతి సంప్రదాయం, మతంలో మొదటి అక్షరాన్ని కనిపెట్టడానికి రకరకాల ఆచారాలున్నాయి. అలాగే ఇంగ్లీష్ అక్షరాల ద్వారా కూడా మీ అదృష్టంపై ప్రభావం ఉంటుంది.

ఒకే అక్షరం మళ్లీ మళ్లీ రావడం
పేరులోని ప్రతి అక్షరం విభిన్నమైన కదలికలు కలిగి ఉంటుంది. ఒక అక్షరం ఎన్నిసార్లు మీ పేరులో ఉంది అన్నది కూడా మీ అదృష్టాదృష్టాలపై ప్రభావం చూపుతుంది. ఏ అక్షరం పాజిటివ్ గా, ఏ అక్షరం నెగటివ్ ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

A, I, J, Q, Y
ఈ అక్షరాల్లో ఏదైనా ఒక వ్యక్తి పేరులో రెండుసార్లు వచ్చిందంటే.. వాళ్లు చాలా ధైర్యవంతులు, చాలా శక్తిమంతులు. అలాగే డామినేట్ చేసే స్వభావం కలిగి ఉంటారు. డబ్బు, పవర్ అంటే వీళ్లకు చాలా క్రేజ్ ఉంటుంది.
స్వతంత్రత, ఫ్రీడమ్, ఉన్నత స్థానం కోసం ఆరాటపడుతుంటారు.

B,K,R
ఎవరైనా తమ పేరులో B,K,Rఅనే అక్షరాలు ఒకసారి కంటే.. ఎక్కువసార్లు కలిగి ఉంటే.. వాళ్లు చాలా సున్నిత మనస్తత్వం, ఎమోషనల్, పిరికితనం, కళాత్మక నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే చాలా ఓర్పు కలిగి ఉంటారు.

C, G, L, S
ఒకవేళ C, G, L, S ఈ అక్షరాల ఎవరి పేరులోనైనా పునరావృతం అయి ఉంటే.. వాళ్లు చాలా ఇమాజినేటివ్ పవర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు కూడా. వీళ్లకు మ్యూజిక్, ఆర్ట్, బిజినెస్ వంటి రకరకాల వాటిల్లో టాలెంట్ ఉంటుంది. అలాగే కాస్త స్వార్థం, ఏకాగ్రత తగ్గడం, క్రమశిక్షణ కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి.

U, V, W
ఈ అక్షరాలు మీ పేరులో మళ్లీ మళ్లీ వచ్చి ఉంటే వాళ్లు చాలా టాలెంట్ కలిగి ఉంటారు. వీళ్లలో మానవతాసిద్ధాంతం, బాధ్యత, సహాయ గుణం ఉంటుంది. అలాగే ఔటింగ్స్, ట్రావెల్స్, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి ఉంటుంది.

D, M, T
ఈ అక్షరాలు రెండుసార్లు కలిగిన వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఆర్థికస్థితిగతులు, ఆస్థుల బాధ్యతలను బంధువులకు అప్పగిస్తారు.

O, Z
మీ పేరులో O, Z అక్షరాలు రెండుసార్లు గానీ, అంతకంటే ఎక్కువగా సార్లు ఉన్నాయా ? అయితే మీరు జాగ్రత్తగా ఆలోచించి, పరిశీలించే, అధ్యయనాలు చేసే తత్వం కలిగి ఉంటారు. సమస్యలకు, బంధువులకు దూరంగా ఉంటారు.

P, F
పేరులో P, F అక్షరాలు పదే పదే కనిపించాయి అంటే.. మీరు వ్యాపారంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. మీ పవర్ పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే బిజినెస్ పరంగా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

E, H, N, X
ఎవరి పేరులోనైనా E, H, N, X అక్షరాలు ఒకటికంటే ఎక్కువసార్లు ఉంటే.. వాళ్లు లీగల్, పబ్లిక్ వర్క్స్ లేదా సేల్స్ లో సక్సెస్ అవుతారు. ప్రమోషన్స్ సాధిస్తారు. ఒకవేళ ఈ అక్షరాలు ఏడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పునరావృతం అయితే.. యావరేజ్ గా ఉంటుంది. డ్రింక్స్, ఫుడ్స్, సెక్స్ కి బానిసలవుతారు. సమస్యలు, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా వ్యహరిస్తారు.



Click it and Unblock the Notifications











