Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
అద్దం పగిలితే దురదృష్టానికి..అశుభానికి సంకేతమా..?
మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉన్న వారికి అద్దం పగిలితే చాలా భయమేస్తుంది.అది అశుభసూచకమని వారు భావిస్తారు.అద్దం పగిలితే ఏడు సంవత్సరాల దురదృష్టం వెంటాడుతుందని శాపం ఉంది అని ఒక నమ్మకం. మరి అలాంటి భయంకర శాపం నుండి ఎలా బయట పడాలి??మీరు కనుక ఇలాంటివి నమ్మేవారయితే కనుక ఈ శాపం నుండి ఎలా బయటపడాలని భయం కూడా వేస్తుంది.అద్దం పగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాము.అశుభం, శాపం లాంటివి కాసేపు పక్కన పెట్టి క్రింద మేము ఇచ్చీ టిప్స్ చూడంది.ఎందుకంటే బెటర్ సేఫ్ దాన్ సారీ అన్న సామెత ఉంది కదా.ఇక చదవండి మరి.

1.అద్దం పగిలితే దురదృష్టం అన్న నానుడికి మూలం పూర్వకాలం. అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నదులు, సరస్సులు, చెరువులూలో ప్రతిబింబాన్ని చూసుకునేవారు.ఈ ప్రతిబింబాలు మన ఆత్మల లాగే మనతోనే ఉంటాయి కూడా నమ్మేవారు.ఇలా ప్రతి బింబాలని చూసుకునేటప్పుడు ఏ మాత్రం ఆ ప్రతిబింబం కాస్త అటూ ఇటూ అనిపించినా అశుభమనుకునేవారు.అద్దాలు వచ్చాకా ఇదే నమ్మకం అవి పగిలితే అశుభకరం అని మారింది.అద్దం పొరపాటున కానీ మరే విధం గా పగిలినా అశుభం అని నమ్ముతున్నారు.

2.అద్దం ముక్కలైనప్పుడు మొదట ఆ ముక్కలని జాగ్రత్తగా చీపురు ఉపయోగించి తీసి చాటలోకి ఎత్తండి. తీసేటప్పుడు మీ చెయ్యికి గాయం అవ్వకుండా చూసుకోండి.గాకు ముక్క ప్రమాదకరం అని తెలుసుకదా.చాటలోకి తీసుకున్న గాజు ముక్కలని అలా పారేయ్యకూడదు. ఆ ముక్కలని మీరు చేసే ఏదైనా క్రాఫ్టులో ఉపయోగించండి లేదా మెత్తని పొడిగా చేసి చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు చెత్త కూప్పలో పడెయ్యండి.

3.అద్దం పగిలినప్పుడు అశుభం జరగకూడదనుకుంటే భుజాలమీదుగా ఉప్పు విసిరి పారెయ్యాలి అంటారు.చాలా సంస్కృతుల్లో ఉప్పుని ఒక మంగళప్రద వస్తువుగా వాడతారు.మీరు కనుక అద్దాన్ని పగలగొడితే కాస్త ఉప్పు తీసుకుని కుడి చేత్తో ఎడమ భుజం మీదుగా వెయ్యాలి. గుర్తుంచుకోండి రివర్స్‌లో అంటే ఎడమ చేత్తో కుడి భుజం మీదుగా వేస్తే మరింత దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే.అద్దం పగిలింది దురదృష్టం అని మీరు ఇంకా చింతిస్తున్నట్లయితే హాయిగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే ఆలోచలనన్నీ పోయి మనసు కుదుటపడుతుంది.

4.చంద్రుడి ప్రభావం కొన్ని అంశాలలో చాలా ఉంటుంది అందుకే మీరు కనుక అద్దం పగలకొట్టినట్లయితే పగిలిన అద్దం ముక్కల్లోంచి ఒక దానిని తీసుకుని దానిలో చద్రుడిని చూడండి.అద్దం పగిలిన తరువాత వచ్చే మొదటి పౌర్ణమి రోజే ఇది చెయ్యాలి.పగిలిన అద్దం ముక్కలని జాగ్రత్తగా దాచి వాటిల్లో చంద్రుడిని చూడటం మంచిదనీ ఇది దురదృష్టాన్ని తగ్గిస్తుందనీ నమ్ముతారు. ఒక సారి ప్రయత్నిస్తే సరి.

5.దురదృష్టాన్ని తగ్గించడంలో తాయెత్తుల కంటే మించినదేముంది??ఇవి ధరిస్తే అద్దం పగలడం లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి.విలువైన రాళ్ళు, నాలుగు ఆకులున్న క్లోవర్,గుర్రపు నాడా ఇలాంటి వాటిని ధరిస్తే దురదృష్టం దరి చేరదని ఒక నమ్మకం.మరి మీకు నచ్చినదానిని ఎన్నుకుని ధరించండి.మీకు సూటయ్యే రాళ్ళేమిటో తెలుసుకోవాలంటే వన్‌హౌటూ డాట్ కాం లో చూడండి.

6.అద్దం పగలగొట్టడం చాలా సులభం కానీ అది మీకు, మీ స్నేహితులకి, కుటుంబానికీ దురదృష్టాన్ని తెస్తుంది.పాజిటివ్ ఆలోచనలతో ఉంటే ఎటువంటి చెడు సంఘటనలూ జరగవు.నెగెటివ్ ఆలోచనల వల్ల ప్రతికూల అంశాలే ఎదురవుతాయి.శాపాలూ వగైరా మీరు నమ్మమంటే అది మీ ఇష్టం మరి. వన్‌హౌటూ డాట్ కాం లో మీ ఆలోచనలు, చర్యల ద్వారా పాజిటివ్ శక్తిని ఆకర్షించడానికి ఏమి చెయ్యాలో వివరించబడింది.
అద్దం పగిలితే ఏమి చెయ్యాలి లాంటివి లాదా ఇలాంటి ఇతర విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా వెబ్‌సైట్లో కల్చర్ అండ్ సొసైటీ సెక్షన్ దర్శించండి.



Click it and Unblock the Notifications