Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలు మీ కలలో కలలో కనిపిస్తే దేనికి సంకేతం...!
కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడ
కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడా మన పెదాల మీద చిరునవ్వును పూయిస్తాయి.
కలలో పిల్లలు కనిపించడానికి అర్థం ఏదైనా ఉందా? ఉంది. అదేమిటంటే...

కలలో... చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే...మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం. కలలో పిల్లలు కనిపించడం అనేది, మీలో మీకు కనిపించని శక్తులు...మిమ్మల్ని పలకరించడం కూడా.

'ఫలానా పని నేను చేయలేను' అని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఓటమికి సిద్ధపడతారు కొందరు. ్ఞ్ఞ్ఞ్ఞ్ఞనిజానికి, ప్రయత్నిస్తే తేలికగా విజయం సాధించే సామర్థ్యాలు వారిలో ఉంటాయి.
''నువ్వు చేయగలవు. ఆ శక్తి నీలో ఉంది'' అని సన్నిహితులు చెప్పినా పెద్దగా పట్టించుకోరు.అలా అని మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండరు.

''నేను...లేనిపోని భయాలను ఊహించుకుంటున్నాను'' అని మనసులో మథనపడుతున్నప్పుడు... ఈ ఆలోచనే కలగా వస్తుంది. ఆ కలలో పిల్లలు కనిపించడం, మనలోని సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లాంటిది.
పిల్లలు కలలో కనిపించడం అనేది... ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది.

'నేను అలా కాదు. ఇలా ఉండాలనుకుంటున్నాను' అని ఒక నిర్ణయానికి బలంగా వచ్చినప్పుడు, ఆ నిర్ణయం పిల్లల నవ్వుల రూపంలో కలలో ప్రతిఫలిస్తుంది.



Click it and Unblock the Notifications