Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మీ ఇంట్లో పదే పదే బల్లి కనిపిస్తే.. దేనికి సంకేతం..?
బల్లులు ఇంట్లో ఉండటం, బల్లి ఇంట్లో తిరగడం వంటి లక్షణాలన్నీ కొన్ని ఆశ్చర్యకర సంకేతాలను ఇస్తాయి. బల్లులు అరిచినప్పుడు, రెండు బల్లులు పోట్లాడినప్పుడు, బల్లులు పదే పదే తిరిగినప్పుడు ఇచ్చే సందేశం, సంకేతం ?
మన ఇంట్లో బల్లి కనిపించిందంటే.. చాలా అసహ్యంగా, ఇబ్బందిగా ఫీలవుతాం. బల్లులు ఇంట్లో ఉండటాన్ని, తిరగడాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ.. బల్లులు ఇంట్లో ఉండటం, బల్లి ఇంట్లో తిరగడం వంటి లక్షణాలన్నీ కొన్ని ఆశ్చర్యకర సంకేతాలను ఇస్తాయి.
బల్లులకు ముందుగా భవిష్యత్ ని అంచనావేసే సత్తా, మున్ముందు ఏం జరగబోతుందని సూచించే తెలివి ఉంటుందట. మనం అంటే.. మనుషులు కూడా అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహిస్తాయట.

బల్లిలు కూడా ఇతర జంతువుల లాగే.. మెస్సంర్స్ లా వ్యవమరిస్తాయి. ఏదైనా విపత్తు జరగబోతుందనే విషయాన్ని జంతువులు.. వాటికున్న సెన్సింగ్ పవర్స్ అవి ముందుగానే పసికట్టేస్తాయి. అలాగే బల్లులు కూడా.. కొన్ని సందర్భాల్లో కమ్యునికేట్ అవుతాయి.
బల్లులు అరిచినప్పుడు, రెండు బల్లులు పోట్లాడినప్పుడు, బల్లులు పదే పదే తిరిగినప్పుడు ఇచ్చే సందేశం, సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..

రెండు బల్లులు
ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకేచోట చేరి గొడవ పడుతున్నాయి అంటే.. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారని సంకేతం.

గృహప్రవేశం సమయంలో
గృహప్రవేశం సమయంలో.. చనిపోయిన బల్లి కనిపించింది అంటే.. ఆ ఇంట్లో ఉండబోయేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిక.

బల్లి శబ్ధం
పగటిపూట బల్లి శబ్ధాన్ని విన్నారు అంటే.. అది చెడు సంకేతం కాదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

పొట్టపై బల్లి
ఆడవాళ్ల పొట్టపై బల్లి పడింది అంటే.. త్వరలోనే గర్భం పొందుతారని సంకేతమని.. జమైకాన్ లెజెండ్ ప్రకారం తెలుస్తోంది.

పరిష్కరించలేరని
ఒకవేళ మీరు సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమైనప్పుడు.. బల్లిని చూశారంటే.. మిమ్మల్ని మీరు.. ఆ సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టాలని సంకేతం.

సరిపడా నిద్ర
ఒకవేళ మీరు వెళ్తున్న దారిలో బల్లి అడ్డం వచ్చిందంటే.. మీరు సరిపడా నిద్రపొందడం లేదని సూచిస్తుంది.

మోకాలిపై
బల్లి మోకాలిపై పడింది అంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని సంకేతం.

తలపై
ఒకవేళ బల్లి తలపై లేదా కుడి చేతిపై పడిందంటే.. మీ ప్రొఫెషన్ లో గుడ్ లక్ పొందినట్లు సంకేతం.

బ్యాడ్ లక్
హిందుశాస్త్రం ప్రకారం బల్లి.. పాదం లేదా కలిపై పడితే.. బ్యాడ్ లక్ కి సంకేతం.

ముప్పు
బల్లులు అరుస్తూ తిరగడం గమనించారంటే.. మీకున్న పనిచేయగల శక్తి ముప్పులో పడుతుందని సంకేతం.



Click it and Unblock the Notifications
