Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
అరచేతిలో M అక్షరం కనిపిస్తే అదృష్టమా ? దురదృష్టమా ?
మీ అరచేతిని బాగా గమనించండి. చేతిలోని గీతలను గమనిస్తే.. ఎక్కడైనా.. ఎమ్ అనే అక్షరం రూపుదిద్దుకున్నట్టు మీకు అనిపిస్తోందా ? మీ చేతిలో M అక్షరం ఫామ్ అయ్యిందా ? అయితే ఇది దేనికి సంకేతం ?
మీ అరచేతిని బాగా గమనించండి. చేతిలోని గీతలను గమనిస్తే.. ఎక్కడైనా.. ఎమ్ అనే అక్షరం రూపుదిద్దుకున్నట్టు మీకు అనిపిస్తోందా ? మీ చేతిలో M అక్షరం ఫామ్ అయ్యిందా ? అయితే ఇది దేనికి సంకేతం ? ఎమ్ అక్షరం అరచేతిలో ఉంటే అదృష్టమా ? లేకపోతే దురదృష్టానికి సంకేతమా ?

పామిస్టరీ అనేది మన పూర్వీకుల నుంచి ఉన్న ఒక ఆర్ట్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పామిస్టరీ అనేది.. మన భవిష్యత్ ని అంచనా వేసే ఒక పద్ధతి. అరచేయిని బాగా నిశితంగా పరిశీలించి.. ఆ వ్యక్తి భవిష్యత్ ని, పర్సనాలిటీని అంచనా వేస్తారు.
సాధారణంగా పామిస్టరీని ప్రధాన గీతలైన హార్ట్ లైన్, లైఫ్ లైన్, హెడ్ లైన్ ని బట్టి అంచనా వేస్తారు. ఈ మూడు లైన్లు ఏర్పడిన దాన్ని బట్టి.. ఆ వ్యక్తి ఆరోగ్యం, ప్రేమ, తలరాతను వివరిస్తారు. అయితే.. ఈ మూడు లైన్ల ఆధారంగా చేతిలో M అక్షరం ఏర్పడితే.. ? ఏమవుతుందో తెలుసుకుందాం..

మూడు లైన్లు
హెడ్, హార్ట్, లైఫ్ లైన్లు ఒకదాని మధ్యలో ఒకటి ఏర్పడి ఉంటాయి. లేదా ఒకదాన్ని ఒకటి ఆనుకుని లేదా.. ఏదో రకంగా కలుపుతూ ఉంటాయి. ఇలా ఏర్పడినప్పుడు.. M అనే అక్షరం మీ చేతి మధ్యలో కనిపిస్తుంది.

M అక్షరం
ఒకవేళ మీ చేతిలో M అక్షరం ఏర్పడితే.. మీకు మంచి భవిష్యత్ ఉందని, జీవితాంతం అదృష్టం మీవెంటే ఉంటుందని సంకేతం. సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్తారు.

ఎలా అయినా
మూడు ప్రధాన లైన్ల ద్వారా అంటే.. ఏలా ఏర్పడినా.. M అక్షరం కనిపిస్తే చాలు.. అదృష్టం మీకు ఉన్నట్టే.

లైఫ్ లైన్
లైఫ్ లైన్ బొటనవేలు నుంచి మణికట్టువైపుగా వాలి ఉంటుంది. మీ లైఫ్ లైన్ డబుల్ ఉండవచ్చు, విరిగినట్టు ఉండవచ్చు లేదా సన్నటి గీతలు మధ్యలో అడ్డుగా ఏర్పడి ఉండవచ్చు. ఈ లైన్ ఆరోగ్యం, ఆయుష్షుని తెలుపుతుంది.

హెడ్ లైన్
అరచేతికి మధ్యలో ఏర్పడి ఉంటుంది ఈ లైన్. ఈ స్ట్రెయిట్ గా లేదా కొద్దిగా వంపుగా కనిపించి ఉండవచ్చు. ఇది లైఫ్ లైన్ నుంచి బొటనవేలుకి, చూపుడు వేలుకి మధ్యలో మొదలై ఉంటుంది. ఈ లైన్ మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, మీ దృఢ నిశ్చయాన్ని తెలుపుతుంది.

ఫేట్ లైన్
చాలా సన్నగా ఉండే ఈ మరో గీతను ఫేట్ లైన్ అంటారు. ఈ లైన్ చాలామందికి ఉండవచు. దీనివల్ల.. M అనే అక్షరం కనిపించదు. మధ్యవేలు కిందవైపు హెడ్ లైన్ నుంచి ఇది పైకి వెళ్తున్నట్టు ఏర్పడి ఉంటుంది. ఏదైనా విషయంపై కంట్రోల్ లేకపోతే.. అది జీవితంపై ప్రభావం చూపుతుంది.

లవ్ లైన్
రిలేషన్ షిప్స్, ఫ్యామిలీని తెలుపుతుంది లవ్ లైన్. ఇది చూపుడు వేలు, మధ్యవేలు మధ్యలో ఏర్పడుతుంది. అలాగే.. చిటికెన వేలు వరకు వంపుగా కిందకు వస్తుంది.

నాలుగు లైన్లు
ఈ నాలుగు లైన్ల ఆధారంగా.. M అక్షరం ఏర్పడతే.. మీరు సమాజంలో పవర్, సంపద కలిగి ఉంటారు.

సక్సెస్
ఇలా ఎమ్ అక్షరం కనింపించే వాళ్లు.. జీవితంలో అదృష్టం పొందుతారు. చాలా స్ట్రాంగ్ క్రమశిక్షణ ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ. అలాగే.. కెరీర్ లో సక్సెస్ అవుతారు.



Click it and Unblock the Notifications