Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మీ రాశి మీ అంతరాత్మ గురించి ఏం చెబుతోంది ?
ఎదుటివాళ్లతో మాట్లాడితే.. వాళ్ల గురించి ఓ అంచనాకి వస్తాం. ఎదుటివ్యక్తితో దగ్గర సంబంధం ఉంటే.. వాళ్ల ఆలోచనలు కూడా తెలుసుకోవచ్చు. వాళ్ల వ్యక్తిత్వం, మనస్తత్వం, స్వభావం అన్నీ ఐడియా ఉంటుంది. కానీ.. కొన్ని సందర్భాల్లో ఎదుటివ్యక్తితో దగ్గరి రిలేషన్ ఉంటుంది.. కానీ వాళ్ల ఆలోచనలను అంచనా వేయలేకపోతాం. వాళ్ల మెంటాలిటీ అంతుచిక్కకుండా పోతుంది.
ఎంత స్నేహంగా ఉన్నా కూడా కొందరి నేచర్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. అయితే రాశిని బట్టి వాళ్ల మనసులోని ఆలోచనలు పసిగట్టవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలాంటి సందర్భంలో ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది..

ఏ యే విషయాలకు వాళ్లు ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది తెలుసుకోవచ్చట. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలే మిమ్మల్ని తికమకపెట్టేస్తుంటాయి. అయితే.. మీ రాశిని బట్టి.. మీ మనసుని, మీ మనసులో మెదిలే ఆలోచనలను అంచనా వేయవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోవాల్సిందే.

మేషరాశి
మేషరాశి వాళ్లు తమ ప్రపంచాన్ని తామే క్రియేట్ చేసుకునే సత్తా కలిగి ఉంటారు. వీళ్లు అనుకున్నది సాధించేవరకు పట్టువిడవని మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాగైనా బతికేయగలుగుతారు. ఎక్కడైనా అడ్జస్ట్ అవగలుగుతారు. అహంకారం, ఆధిపత్యం చెలాయించే గుణాలు కొంత ఉంటాయి. ఈ రాశి వాళ్లు ఎదుటి వాళ్లు చెప్పే విషయాలు గ్రహించడం నేర్చుకోవాలి.

వృషభ రాశి
వృషభరాశి వాళ్లు చాలా మొండిపట్టుదల కలిగి ఉంటారు. అయితే వాళ్లకు నచ్చినట్టు చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. విధేయత, నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.

మిధునం
ఈ రాశి వాళ్ల ఆలోచనలు గుర్తించడం చాలా కష్టం. ప్రజాకర్షణ కలిగి ఉంటారు. వీళ్లు చాలా వరకు మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

కర్కాటకం
కర్కాటక రాశి వాళ్లు చాలా మొహమాటస్తులు. ఇతరులపై ఆధారపడి ఉంటారు. మీ వ్యక్తిత్వాన్ని ఎక్కువగా దాచుకోకుండా.. బయటపడటం మంచిది.

సింహ రాశి
సింహరాశి వాళ్లు అందరి అటెన్షన్ ని కోరుకుంటారు. అలాగే.. ఏదైనా డైరెక్ట్ గా చెప్పేస్తారు. వీళ్ల కాస్త గడుసైన వాళ్లు.. అలాగే కాస్త చెడు స్వభావం కలిగి ఉంటారు. తమ గురించి తమకు గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు.

కన్యా రాశి
వీళ్లు చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. మీకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు చాలా ఈజీగా, తెలివిగా తప్పించుకోగలుగుతారు. చాలా ఎక్కువ లాజికల్ గా ఉంటే.. ఇతరుల నుంచి సానుభూతి కోల్పోయే ఛాన్స్ ఉంది కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
తులారాశి వాళ్లు ప్రేమతో దేన్నైనా బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ల సంతోషాన్ని వాళ్లు క్రియేట్ చేసుకుంటారు. కానీ.. అది ఎక్కువకాలం ఉండదని భావిస్తుంటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్లు చాలా మిస్టీరియస్ బిహేవియర్ కలిగి ఉంటారు. ఎక్కువసేపు వీళ్లతో మాట్లాడినా.. వీళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని.

ధనుస్సు రాశి
వీళ్లు నిప్పులాంటి వాళ్లు. కొన్నిసార్లు చాలా స్ర్టాంగ్ గా ఉంటారు. అడ్వెంచర్స్ ని ఇష్టపడతారు. వీళ్ల ఆలోచనలను ఎవరైతే.. నమ్ముతారో, అనుసరిస్తారో, ఇష్టపడతారో.. అలాంటి వాళ్లనే ఎక్కువగా ఇష్టపడతారు. తన చుట్టూ ఉండాలని కోరుకుంటారు.

మకర రాశి
మకరరాశి వాళ్లు చాలా స్ర్టాంగ్ గా పనిచేయగలుగుతారు. తరచుగా మకరరాశి వాళ్ల తమ ఆలోచనలను నిరాకరిస్తారు. అయితే మీ ఉద్యోగానికి తగ్గట్టు ఆలోచనలు ఉండటం చాలా అవసరం.

కుంభ రాశి
కుంభరాశి వాళ్ల ఫీలింగ్స్ చాలా లాజిక్ గా ఉంటాయి. అయితే వీళ్లు బయటకు వెళ్లాలి.. రకరకాల కొత్త సంప్రదాయాలు, ఐడియాలపై అవగాహన కల్పించుకోవాలి. మీ మైండ్ ని వివిధ రకాల పద్ధతులలో పదునుపెట్టాలి.

మీన రాశి
మీనరాశి వాళ్ల మనస్తత్వం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్లు తరచుగా ఆలోచనలు మారుతూ ఉంటాయి. వీళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే చాలా కేరింగ్ గా ఉంటారు.



Click it and Unblock the Notifications