Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కలలో డబ్బులు కనబడితే అదృష్టమా..?దరదృష్టమా..?
కొందరికి అదే పనిగా డబ్బు కలలోకి వస్తుంటుంది. లాటరీ ఏదో గెలుచుకున్నట్లు... ఒక్కసారిగా ధనవంతుడై పోయినట్లు, భూమిని తవ్వుతుంటే కట్టలు, కట్టలుగా డబ్బు వస్తున్నట్లు... ఇలాంటి విచిత్రమైన కలలు కూడా వస్తుంటాయి. దీని అర్థం...డబ్బు మీద విపరీతమైన వ్యామోహం ఉన్నట్లు కాదు. ఒక విధంగా చెప్పాలంటే, కలలో కనిపించే 'డబ్బు' అసలు డబ్బు కానే కాదు.
మరి ఏమిటి?
విజయం. ఆత్మవిశ్వాసం. విలువలు... వీటిని డబ్బు ప్రతిబింబిస్తుంది. మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అది విజయానికి దారి చూపుతుంది. ఇక్కడ 'ఆత్మవిశ్వాసం' అనేది విలువైన పాత్రను పోషిస్తుంది. ఆ విలువ 'డబ్బు' రూపంలోనో, 'బంగారం' రూపంలోను ప్రతిఫలిస్తుంది.హృదయానికి సంబంధించిన రకరకాల అనుభూతులు కూడా డబ్బు రూపంలో కలలోకి వస్తాయి. ఉదా: ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇప్పుడు ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఈ 'ప్రేమ' మాత్రమే. ఆ విలువ 'డబ్బు'గా కలలో దర్శనమిస్తుంది.
డబ్బుకు సంబంధించి మరికొన్ని కలలు...
బ్రీఫ్‌కేస్‌లో డబ్బును భద్రంగా తీసుకువెళుతుంటే, దొంగలు దాడి చేసి దోచుకెళతారు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరో జేబు కొట్టేస్తారు...ఇలాంటి కలలు కూడా వస్తుంటాయి. డబ్బును కోల్పోవడం అనేది లక్ష్యానికి దూరం కావడాన్ని, ఆత్మీయులు దూరం కావడాన్ని, నిత్యజీవితంలోని అశాంతిని సూచిస్తుంది. మానసికంగా బలహీనంగా ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. 'నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది' అని కుమిలిపోతున్నప్పుడు కూడా డబ్బు దొంగిలించబడినట్లు కలలు వస్తుంటాయి.
డబ్బు మీద వచ్చే కలలను బట్టి కొన్ని వాస్తవాలను ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

డబ్బు సొంతం చేసుకున్నట్లు లేదా గెలుచుకున్నట్లు
డబ్బు సొంతం చేసుకున్నట్లు లేదా గెలుచుకున్నట్లు కల వచ్చిందంటే మీరు కొత్త బిజినెస్ ప్రారంభించబోతారని లేదా జీవితంలో విజయం సాధిస్తారని సంకేతం. ఇటువంటి కలవచ్చినప్పుడు మనలో నమ్మకాన్ని పెంచుతుంది. ఇటువంటి కల గ్యారెంటీ ఇవ్వకపోయినా, రాబోవు జీవిత కాలంలో ఏదో మంచి జరుగుతుందన్న శుభ సూచకంను సూచిస్తుంది. కాబట్టి, మనల్ని మన మీద మనం నమ్మకం కలిగి ఉండటం మంచిది.

డబ్బు కలలో కనిపిస్తే ,
డబ్బు కలలో కనిపిస్తే , అదేదో ఉచితంగానో లేదా లాటరీ ద్వారానో గెలుచుకున్నట్లు ఫీలైపోకూడదు. ఎందుకంటే ఇటువంటి డబ్బు లైంగికత్వంతో పొందవచ్చు. ఒక వ్యక్తిని నుండి పొందవచ్చు లేదా వ్యక్తుల సమూహం నుండి పొందవచ్చు.

డబ్బు దొంగతనం చేసినట్లు కల వస్తే,
డబ్బు దొంగతనం చేసినట్లు కల వస్తే, అది ప్రమాదకర పరిస్థిని సూచిస్తుంది,. కాబట్టి మీరు చేసే ప్రతి పని మీద జాగ్రత్త కలిగి ఉండాలి. లేదంటే ప్రమాదకర స్థితికి దారితీస్తుంది.

మీకు తెలిసిన వ్యక్తులకు లేదా ఇతరులకు డబ్బు ఇస్తున్నట్టు కల వస్తే,
మీకు తెలిసిన వ్యక్తులకు లేదా ఇతరులకు డబ్బు ఇస్తున్నట్టు కల వస్తే, ఖచ్చితంగా మీరు రిస్క్ లో పడబోతున్నారని తెలుపుతుంది. భవిష్యత్తులో మీరు ఏదో ప్రమాదంలో పడబోతున్నారాని, అసౌకర్య పరిస్థితులు ఎదుర్కుంటారని, కష్టాలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది.

కలలో డబ్బు కోల్పోతున్నట్లు, అశాంతికి గురౌతున్నట్లు కలవస్తే,
కలలో డబ్బు కోల్పోతున్నట్లు, అశాంతికి గురౌతున్నట్లు కలవస్తే, ప్రస్తుతం కష్ట కాలంతో జీవించాల్సి వస్తుంది. భవిష్యత్తులో అసంత్రుప్తితో చేతకాని వారిలా , బలహీనులుగా ప్రతిబింబిస్తుంది. అంటే దీనికి అర్ధం మీరు ప్రస్తుత పరిస్థితులను బట్టి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులను చేసుకోవాలని సూచిస్తున్నది . ఇటువంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా ఇప్పుడే మేల్కొని కొత్తగా ఏదైనా పనులు లేదా బిజినెస్ లు మొదలు పెట్టడం మంచిది.

మీకు బంగారు బహుమతిగా తీసుకుంటున్నట్లు కల కంటే
మీకు బంగారు బహుమతిగా తీసుకుంటున్నట్లు కల కంటే అది శుభ సూచకం. అంటే , మీరు సంపన్నులుగా మారుబోతున్నట్లు సూచిస్తుంది. ఆర్థికంగా స్థిరపడుతారని సూచిస్తుంది. మీ జీవితంలో అన్ని సవ్వంగా జరగుతుంటే, ఇటువంటి మంచి సంఘటనలు కలల రూపంలో కనబడుతాయి .

మీరు డబ్బు లెక్కపెడుతున్నట్లు కల కంటే
మీరు డబ్బు లెక్కపెడుతున్నట్లు , అకౌంట్ లో బ్యాలెన్స్ లెకున్నట్లు కల కంటే, జాగ్రత్తగా ఉండాలి. ఇలా కల వస్తే భవిష్యత్తులో మీరు ఆర్థకపరంగా కష్టాలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. కాబట్టి, భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండాలంటే ఇప్పటి నుండి డబ్బు సేవ్ చేయడం మంచిది.

కలలో డబ్బు మాత్రమే కనిపించిందంటే
కలలో డబ్బు మాత్రమే కనిపించిందంటే మీరు డబ్బు సేవ్ చేయడం లేదని అర్థం, ఇంకా మీరు కోరుకున్న జీవితానికి పూర్తి విరుద్దంగా జీవిస్తున్నట్లు అర్ధం. అంటే ప్రస్తుతం మీరు ఖర్చులు తగ్గించుకోవాలి. డబ్బును తక్కువగా ఉపయోగించాలి, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవాలి.

చివరగా ఒక్క మాట:
ఈసారి డబ్బు కలలో కనిపించినా లేదా డబ్బు దొంగిలించబడినట్లు కల వచ్చినా...మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. కొత్త విషయాలు తెలియవచ్చు. ప్రయత్నించి చూడండి!



Click it and Unblock the Notifications











