Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనస్థత్వం ఎలాంటిదో రాశిని బట్టి ముందే తెలుసుకోండి.!
మనం చేసుకోబోయే అమ్మాయిది ఏ రాశో తెలిస్తే ఇక్కడ ఓ సారి చెక్ చేసుకోండి. ముందుగానే వారి మైండ్ సెట్ కు తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. మీ వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేస్కోండి.
పెళ్లిల్ల సీజన్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఒంటిగా జీవితాన్ని నడిపించిన వారు.ఇక నుండి జంటగా అడుగులు వేయడానికి రెడీ అయిపోతున్నారు. మనకందిరికీ తెలుసు పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయిల జాతకాలను చూస్తారు.
జాతకాల్లో కాస్త తేడా అనిపిస్తే శాంతి పూజ చేయడమో లేక వధువు లేక వరుడి పేరు మార్చడమో చేస్తారు. అదిగో అలాంటిదే ఇది...... మనం చేసుకోబోయే అమ్మాయిది ఏ రాశో తెలిస్తే ఇక్కడ ఓ సారి చెక్ చేసుకోండి.
ముందుగానే వారి మైండ్ సెట్ కు తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. మీ వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేస్కోండి.

మేషరాశి:
ఈ రాశి కలిగిన వారు తమ చుట్టూ ఉన్న విషయాల గురించి మంచి అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీ ఉంటుంది. ఎప్పుడూ తన భర్త, పిల్లలే లోకంగా ఉంటుంది. ఇంటి అవసరాలు, ఆర్ధికంగా ఎలా ఉన్నాం? మన జీవితం ఇంకా బాగుండాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ తన భర్తకు తోడుగా ఉంటుంది, ఆర్ధిక విషయాలలో భర్తకు సలహాలు,సూచనలు ఇస్తుంది.

వృషభ రాశి:
ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ రాశి ఉన్న మహిళ కోరుకుంటుంది. భర్తతో, పిల్లలతో కలిసి ఉండటం, వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత.

మిథున రాశి:
పెళ్లికాక ముందు అల్లరిగా ఉన్నా, పెళ్లి తర్వాత మాత్రం బాధ్యతగా ఉంటుంది. ప్రతి విషయం భర్త మీదే ఆధార పడి ఉంటుంది. అలాగే తన మైండ్ సెట్ కు సరిపోయేవాడు భర్తగా రావాలని కోరుకుంటుంది.

కర్కాటక రాశి:
సున్నితమైన మనస్కురాలు మరియు ఆదర్శవంతమైన భార్యగా ఉంటుంది. తన భర్తను అర్థం చేసుకుంటూనే తనను సపోర్ట్ చేయాలని కోరుకుంటుంది.పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది.భర్తను, పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. భర్త నమ్మాల్సిన నమ్మకస్తురాలు.

సింహరాశి:
ఈ రాశి కలిగిన వారు అందంతో పాటు నమ్మకస్తులు. ఒక ఆదర్శమైన భార్యగా సమాజంతో అనిపించుకుంటుంది. ప్రతి విషయానికి సమయం, సందర్భం ఆలోచిస్తుంది. ఇంటిపనులను చురుకుగా చేస్తుంది.

కన్యరాశి:
సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన మహిళ. ఏదైనా విషయంలో సీరియస్ అవాలనుకున్నా కంట్రోల్ గా ఉంటుంది. తన భర్త బాధ్యత కలిగిన వ్యక్తి కావాలని కోరుకుంటుంది.

తులరాశి:
ఈ రాశి ఉన్నవారు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఇంటిపని, వంటపని చేయడమంటే చాలా ఇష్టం. ఏ పనిచేసినా ఆమెను పొగుడుతూనే ఉంటారు. సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకోవడంతో పాటు తన భర్త తనని ముద్దు చేస్తూ, గారాబంగా ఆడించాలని ఆశపడుతుంది.

వృచ్చిక రాశి:
పెళ్ళే ఒక బాద్యతగా, గౌరవమని అనుకుంటుంది ఈ రాశిగల మహిళ. అయితే తనని ఎక్కువగా ప్రేమించే వారంటే చాలా ఇష్టంగా చూసుకుంటుంది. ఫ్యామిలీకే ఎక్కువ వాల్యూనిస్తుంది.అయితే తన భర్త తనకోరికలు తీర్చడంలో విఫలం చెందితే అతడికి దూరం కావడానికి ఏమాత్రం ఆలోచించదు.

ధనుస్సు రాశి:
చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. తనను చేసుకోబోయేవాడు మాంచి హుమర్ టచ్ ఉన్నవాడు కావాలని, ఎప్పుడు నవ్విస్తూ ఉండాలని, అలాగే తన భర్తకు అండగా ఉండాలనుకుంటుంది.

మకరరాశి:
తన సంసారంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. తన కుటుంబాన్ని, భర్తను జాగ్రత్తగా చూసుకుంటూ, తనపై అపారమైన నమ్మకం ఉండేలా భర్తకు దగ్గరగా ఉంటుంది. అయితే తన భావోద్వేగాలలను ఎలా తెలపాలో మాత్రం తెలియదు. ఆర్భాటాలకు దూరంగా ఉండే సింపుల్ అండ్ కూల్ పర్సన్.

కుంభ రాశి:
ఈ రాశి ఉన్నవారు స్నేహ పూర్వకంగా మరియు చాలా సింపుల్ గా ఉంటారు. తను కోరుకున్న క్వాలిటీస్ వారు దొరికేంతవరకు పెళ్లి చేసుకోదు. నిజాయితీ కలిగిన మహిళ. వంటలు సరిగా చేయలేదు.ఏదైనా సరే మొహం మీదే చెబుతుంది. బోరింగ్ లైఫ్ అంటే పరమచిరాకు. సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం.

మీనము రాశి:
తన భర్త ధైర్య సాహసాలు కలిగిన వాడు ఉండాలని,తనను జాగ్రత్తగా చూసుకోవాలని ఈ రాశి ఉన్న మహిళ కోరుకుంటుంది. ఎలాంటి కష్టమైనా ధైర్యంగా పోరాడుతుంది. పెళ్లిని బాద్యతగా ఫీలవుతుంది. ఆల్ ఈజ్ వెల్ అని నమ్మేతత్త్వం.



Click it and Unblock the Notifications