Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఏ రాశి వాళ్లు ఎలాంటి తప్పులు, పాపాలు చేసే అవకాశం ఉంటుంది ??
మనందరం తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, అలాగే మనకు తెలిసీ, తెలియక పాపాలు కూడా చేస్తుంటాం. కానీ వాటిని బయటపెట్టడానికి చాలా ఇబ్బందిపడతాం. అంటే మనం చేసిన తప్పుని చాలా సందర్భాల్లో.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం లేదా, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. మనలో చాలామందికి చాలా కోపం, చాలామందికి అత్యాశ ఉంటుంది.
మీ రాశి ప్రకారం మీరు ఎంచుకోవాల్సిన కెరీర్ ఏంటి ?
మనం చేసే కొన్ని తప్పులు మన జీవితంలో భాగం అయి ఉంటాయి. లేదా.. మన వ్యక్తిత్వంలో భాగమై ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చేస్తున్నది తప్పు అని ఎదుటివాళ్లు చెప్పే వరకు మనం గుర్తించలేకపోతాం. అప్పుడు మనం చేస్తున్న తప్పు, పాపాన్ని గుర్తించి మనం తెలుసుకుంటాం.
మీ రాశి ప్రకారం మీరు ఏ వయసులో సక్సెస్ అవుతారు ?
ప్రతి రాశి వెనక ఒక చీకటి కోణం ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ లో ఉంచుకోవాలి. అంతేకానీ.. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి.. ఏ రాశి వాళ్లు ఎలాంటి తప్పులు, పాపాలు చేసే అవకాశం ఉందో తెలుసుకుంటే.. వాటిని చేయకుండా.. ముందు జాగ్రత్త తీసుకోవడం సాధ్యమవుతుంది.

మేష రాశి
మేషరాశి వాళ్లు చేసే అత్యంత పెద్ద తప్పు హత్య. ! వినడానికే భయకంరంగా ఉన్నప్పటికీ.. ఇది వాస్తవం. మీరు కోపంగా ఉన్నప్పుడు.. ఆ కోపం నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతారు.

కోపమే శత్రువు
మేష రాశి వాళ్లకు కోపమే శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం.

మీన రాశి
మీన రాశి వాళ్లు చాలా బద్ధకస్తులు. పగటి కలలు కనే అలవాటు ఉంటుంది. చాలా వరకు వీళ్లు తమ ప్రపంచంలో మునిగిపోయి ఉంటారు. చాలా కేర్ లెస్ గా ఉంటారు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది. వీళ్లు చివరి నిమిషం వరకు ఎలాంటి ప్లాన్స్ చేసుకోరు.

కుంభ రాశి
కుంభ రాశి వాళ్లు.. తప్పుడు ప్రవక్తలు. ఎదుటివాళ్ల ఆలోచనలన్నీ తప్పు అని, వీళ్ల ఆలోచనలు, వీళ్ల అభిప్రాయాలే సరైనవని భావిస్తారు. ఎదుటివాళ్ల గురించి ఏమాత్రం ఆలోచించరు. వీళ్లు సంస్కారం లేని వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు.

మకర రాశి
దురాశ మీకున్న పెద్ద పాపం. డబ్బు సంపాదించడం, పవర్ ని మీ చేతుల్లోకి తీసుకోవడం అనేదే మీరు కోరుకునేది. అంతకుమించి వేరే ఏమీ అవసరం లేదన్నట్టు ప్రవర్తిస్తారు. డబ్బు సంపాదనలో పడిపోయి.. వ్యక్తిగత సంబంధాలను కూడా త్యాగం చేస్తారు. ఇదే మీరు చేసే అతిపెద్ద తప్పు.

దురాశ
అలాగే మకర రాశి వాళ్లు.. తాము ఉన్నత స్థానానికి రావడానికి, తమ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఇతరులను అణిచేయడానికి కూడా వెనకాడరు. ఇది కర్కాటక రాశి వాళ్లు చేసే అతి పెద్ద పాపం అని చెప్పాలి.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లను తిండిపోతులని చెప్పవచ్చు. మీరు మీ కోర్కెలు తీర్చుకోవడానికి, మీకోసం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. జీవితంలో కేవలం లగ్జరీ వస్తువులకు మాత్రమే డబ్బు ఖర్చు చేసి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. దీనివల్ల మీ జీవితాన్ని రిస్క్ లో పెట్టుకుంటారు.

డబ్బు, పవర్
మీరు అన్ హెల్తీగా ఆహారాలను తీసుకుంటూ, అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ.. భవిష్యత్ గురించి ఆలోచించరు. ఇలాంటి అలవాటు వల్ల మీరు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి
ధనస్సు రాశివాళ్లు చేసే అత్యంతదారుణమైన పాపం వ్యభిచారం. అటెన్షన్ ని ఇష్టపడతారు. మీరు దారితప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. చాలా జాగ్రత్తగా, అలర్ట్ గా ఉంటడం చాలా అవసరం.

పట్టుదల
పట్టుదల అనేది మీకు రావడం చాలా కష్టం. ఊరికే తిరిగే అలవాటు అంటే.. ఏ పనిలేకండా.. సంచరించడమే అలవాటుగా ఉంటుంది. మీరు చేసే పనులకు గుర్తింపు కోరుకుంటారు, కానీ జీవితంలో సెటిల్ అవడాన్ని ఇష్టపడరు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లు చేసే తప్పు కామం. మీరు లైంగిక చర్యను ఇష్టపడతారు. కానీ కొన్ని సార్లు.. దీన్ని భరించడం మీ భాగస్వామికి భారంగా మారుతుంది. దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది.

తులా రాశి
తులారాశి వాళ్లకు గర్వం ఎక్కువ. అన్ని రాశుల వాళ్ల కంటే.. తులారాశి వాళ్లు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. దీనివల్ల చాలా గర్వంగా ఫీలవుతారు. వేరే విషయాలకంటే.. అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

కన్యా రాశి
కన్యారాశి వాళ్లు చాలా ఈర్ష్య, అసూయ కలిగి ఉంటారు. అలాగే.. భాగస్వామిలను అస్సలు నమ్మే అలవాటు ఉండదు. దీనివల్ల వీళ్ల రిలేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి.

సింహ రాశి
సింహ రాశి వాళ్లకు ఒళ్లంతా అహంకారం ఉంటుంది. వాళ్ల గౌరవాన్ని కాపాడుకోవడానికి వాళ్లు ఎంత లోతుకైనా పోతారు. ఎక్కడా తలవంచే ప్రసక్తే ఉండదు.

దురహంకారం
సింహరాశి వాళ్లు దురహంకారంగా కూడా ఉండవచ్చు. వాళ్లపై మాత్రమే వాళ్లకు ప్రేమ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులు వేలెత్తి చూపడాన్ని ఇష్టపడరు. వాళ్లకంటూ.. ఓ గుర్తింపు కావాలని కోరుకుంటారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లు అతి ప్రేమను చూపిస్తారు. వీళ్లు చూపించే ప్రేమ, ఆప్యాయత ఎదుటివాళ్లకు ఊపిరాడకుండా చేస్తుంది.

మిధున రాశి
మిధున రాశి వాళ్లు కొన్ని సార్లు నిజాయితీ లేకుండా ప్రవర్తిస్తారు. తప్పుడు సమాచారం అందించడం వల్ల ఎదురయ్యే సమస్యలు గురించి పట్టించుకోకుండా.. ఇతరులకు తప్పు సమాచారాన్ని అందిస్తారు. అపద్ధం చెప్పడం మిధున రాశి వాళ్లకు పెద్ద సమస్య కాదు.

రెండు వైపులా
వీళ్లు రెండు రకాలుగా వ్యవహరిస్తారు. చాలా తక్కువ మంచిది.. వీళ్ల అసలు రూపం తెలుస్తుంది. వాళ్లు చేసే తప్పులను చాలా జాగ్రత్తగా దాచుకోగలుగుతారు. మిధునరాశి వాళ్ల నిజాయితీ గురించి కనీసం స్నేహితులు కూడా గుర్తించలేకపోతారు.



Click it and Unblock the Notifications