Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రాశిని బట్టి మీరు మీ బ్రదర్ లేదా సిస్టర్ తో ఎంత ప్రేమగా ఉంటారు ?
మీరు మీ చెల్లిని లేదా తమ్ముడిని లేదా అన్నయ్యను లేదా అక్కను చాలా ప్రేమగా చూసుకుంటారా ? వాళ్లతో ఎంత సేపు గడిపినా సమయం తెలియడం లేదా ? ఇద్దరూ గొడవ పడుతూనే.. ప్రేమను పంచుకుంటారా ? అయితే.. మీలో దాగున్న అన్నా చెల్లెల్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధం ఎలాంటిదో ఇప్పుడే తెలుసుకోండి.
ఫుడ్ విషయంలో, ఆటల విషయంలో, చదువు విషయంలో, బట్టల విషయంలో.. ఇలా అన్నింటిలోనూ.. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లు.. పోట్లాడుకుంటూ, గెంతుతూ అల్లరి చేసిన సందర్భాలు ఎంత సంతోషాన్నియో కదూ..! నిజమే.. ఎంత పెద్దవాళ్లు అయినా.. అన్నాచెల్లెలు, అక్కాతమ్ముల అనుబంధం చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఈ అనుబంధాన్ని రాఖీ పండుగ మరింత దగ్గర చేస్తుంది.
మనం పెరిగిపెద్దవాళ్లు అయ్యేటప్పుడు.. అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముల్లు.. ఒకరికొకరు చాలా విషయాలు నేర్చుకుంటారు. కొన్ని ఓర్పుగా దగ్గరుండి నేర్పిస్తారు. అయితే మీ రాశిని బట్టి మీరు ఎలాంటి బ్రదర్ లేదా సిస్టరో తెలుసుకోవచ్చు. అంటే మీ బ్రదర్ లేదా సిస్టర్ పై మీరు ఎలా ప్రేమను పంచుతారు, వాళ్ల పట్ల ఆత్మీయ అనురాగాలు ఎలా చూపిస్తారో తెలుసుకోండి..

మేషరాశి
మేషరాశికి చెందిన సిస్టర్స్, బ్రదర్స్ ఎంత దూరం ఉన్నా.. మీరు ఎల్లప్పుడూ.. మీ సిస్టర్ లేదా బ్రదర్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లకు ఎలాంటి సహాయం చేయడానికైనా రెడీగా ఉంటారు. వెంటనే హెల్ప్ చేస్తారు. అది అర్థరాత్రి అయినా కూడా.. వాళ్లకోసం ఏమైనా చేస్తారు.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లు తమ బ్రదర్స్, సిస్టర్స్ ని ఆరాధిస్తారు. వాళ్ల కోసం మీరు చాలా కేర్ తీసుకుంటారు. కానీ.. వాళ్లకు చెప్పరు.

మిధున రాశి
మిధున రాశి వాళ్లు.. వాళ్ల బ్రదర్స్, సిస్టర్స్ కి దూరంగా చాలా కాలం ఉండాల్సి వస్తుంది. కానీ.. వాళ్ల గురించి ఎక్కడ ఉన్నా.. ఎప్పటికప్పుడు వాళ్ల బాగోగుల గురించి అడుగుతూ ఉంటారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లు వాళ్ల ఫ్యామిలీని అమితంగా ప్రేమిస్తారు. అలాగే.. మీరు రెగ్యులర్ గా మీ బ్రదర్స్, సిస్టర్స్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

సింహరాశి
మీరు మీ బ్రదర్స్, సిస్టర్స్ పట్ల చాలా ఉదారంగా ఉంటారు. వాళ్లపై ఎల్లప్పుడూ.. నమ్మకంగా ఉంటారు.

కన్యారాశి
మీరు సిబ్లింగ్ ఓరియెంటెడ్ గా ఉండరు. మీరు మీ సొంత ప్రపంచంలో ఉండటానికే ఇష్టపడతారు. మీ బ్రదర్స్, సిస్లర్స్ తరచుగా మీ గురించి అడుగుతూ ఉంటారు. మీ ప్రవర్తన గురించి తెలుసుకుంటారు.

తులారాశి
మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ పై మీరు చాలా ఎటాచ్డ్ గా ఉంటారు. వాళ్లతో బయటకువెళ్లడానికి, వాళ్లు మీ ఇంట్లో ఉండటాన్ని చాలా ఇష్టపడతారు.

వృశ్చిక రాశి
మీ బ్రదర్ లేదా సిస్టర్ ని మీరు ఆరాధిస్తుంటారు. కానీ.. నటిస్తున్నట్టు ఉంటుంది. మీరిద్దరూ.. ఒకేమాటపై ఉండలేరు.

ధనస్సు రాశి
బ్రదర్స్, సిస్టర్స్ కి హెల్ప్ చేయడానికి మీరు చాలా ఇష్టపడతారు. వాళ్లకు మీరు చాలా అవసరం. అలాగే.. ఫ్యామిలీ మీల్స్ మీతో షేర్ చేసుకోవడానికి వాళ్లు ఇష్టపడతారు. కానీ.. పబ్లిక్ లో చెండాలంగా ప్రవర్తిస్తే.. మీకు ఏమాత్రం నచ్చదు. అలాంటప్పుడు వాళ్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

మకర రాశి
మీరు చాలా నమ్మకంగా ఉంటారు. ఫ్యామిలీ ఔటింగ్స్ కి వెళ్తారు. అంతకుమించి.. మీరు స్వతహాగా, ఒక్కరే ఉండటానికి ఇష్టపడతారు. కాస్త దూరంగా ఉండటమే మంచిది అనుకుంటారు.

కుంభ రాశి
మీరు మీ సిబ్లింగ్స్ తో నిమగ్నమయ్యే అలవాటు ఉండదు. కానీ.. వాళ్లను అభినందిస్తారు.

మీన రాశి
మీనరాశి వాళ్లు.. తమ బ్రదర్స్, సిస్టర్స్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్లను చూడాలని, వాళ్తో మాట్లాడాలని కోరుకుంటారు.



Click it and Unblock the Notifications