Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మీ రాశి ప్రకారం మీలో నలుగురికి నచ్చే క్వాలిటీ ఏంటి ?
ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలా ఉంటుంది. జీవితంలో చాలా మలుపులు, చాలా మిస్టరీలు, ఇష్టాలు, అయిష్టాలు రకరకాలు ఉంటాయి. కొంతమందికి నలుగురితో కలిసిపోయే తత్వం ఉంటుంది. మరికొందరు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. కొందరు ఫన్నీగా ఉంటారు. కొందరు సీరియస్ గా ఉంటారు. ఎవరి జీవితం వాళ్లది.. వాళ్లకు నచ్చినట్టు అనుభవిస్తారు.

అయితే ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధమైన గుణాలుంటాయి. కొంతమందిలో క్వాలిటీస్ అందరికీ నచ్చుతాయి. కొంతమంది ఎలా ఉన్నా నచ్చరు. అయితే నలుగురూ ఇష్టపడే క్వాలిస్ చాలా అరుదుగా, కొంతమందికే ఉంటాయి. కొన్ని అలవాట్లు, అభిరుచులు, గుణాలు, ప్రవర్తన ఎదుటివాళ్లలో మనపై ఇష్టం కలిగేలా చేస్తాయి. మరి మీలో నలుగురూ ఇష్టపడే క్వాలిటీ ఏంటో తెలుసుకోవాలనుందా ? మీలో ఎదుటివారిని ఎట్రాక్ట్ చేసే లక్షణం ఏంటో మీ రాశిని బట్టి తెలుసుకోవచ్చు. మరి అదేంటో చూద్దామా..

మేష రాశి
మేషరాశి వాళ్లు ఎప్పుడు అడ్వెంచర్ కోసం ఎదురుచూస్తుంటారు. మీలో ఉండే పాజిటివ్ యాటిట్యూట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. అలాగే మిమ్మల్ని ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండేలా చేస్తుంది. మీ మాటలు, కథలతో.. ఎవరినైనా ఎంటర్ టైన్ చేసే సత్తా మీలో ప్రత్యేకమైనది.

వృషభరాశి
వృషభరాశి వాళ్లు చాలా నిజాయితీపరులు. ఏ పని చేసినా.. చాలా నిజాయితీగా చేస్తారు. లక్ష్యాలు, లక్ష్యాలు సాధించాలనే పట్టుదల మీలో ప్రత్యేకమైన క్వాలిటీ.

మిథునరాశి
మిథున రాశి వాళ్లు ఎక్కడైనా అడ్వజ్ట్ అవగలుగుతారు. పరిస్థితులను బట్టి.. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే తత్వం మీలో చాలా ప్రత్యేకమైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే గుణం ప్రతి ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.

కర్కాటకరాశి
మీది చాలా లవింగ్ అండ్ కేరింగ్ నేచర్. నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపించే విషయం.. సానుభూతి. ఎదుటి వాళ్ల కష్టాలను, ఇబ్బందులను దగ్గర ఉండి మరీ పరిష్కరిస్తారు. అవసరమైన సహాయం చేస్తారు.

సింహరాశి
కాన్ఫిడెన్స్ తో ప్రతి ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తారు. మీ మనసులో ఉన్నమాట చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడరు. ఇది మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా చూపించే లక్షణం.

కన్యారాశి
మీలో మెమరీ పవర్ చాలా ఎక్కువ. ప్రతి ఒక్కటీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఏ విషయాన్నీ అంత తేలికగా మరిచిపోరు. మీకు పనికొచ్చేలా ఈ క్వాలిటీని ఎలా ఉపయోగించాలో మీకు బాగా తెలుసు. అలాగే మీది ఫ్రెండ్లీ నేచర్. కాబట్టి.. ఎలాంటి సమాచారం కావాలన్నా.. తేలికగా రాబట్టగలరు.

తులారాశి
తులారాశి వాళ్లు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అలాగే ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. మీరు ఎక్కడ ఉంటే.. అక్కడ ప్రేమ పంచుతారు. ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు. ఎక్కడికెళ్లినా.. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టగలరు. సంతృప్తిపరచగలరు. అలాగే నిజం, వాస్తవాన్ని ఇష్టపడతారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లు చాలెంజ్ కోసం ఎదురుచూస్తారు. ఇదే మీలో ప్రత్యేకమైన క్వాలిటీ. ఎదుటివాళ్లు ఒక విషయాన్ని కష్టంగా భావిస్తే.. మీరు అవకాశాంగా భావిస్తారు. దాన్ని సాధించాలనే పట్టుదల మీలో కనిపిస్తుంది. ఎలాంటి టాస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు.

ధనూరాశి
మీ లక్ష్యాలు సాధించాలనే తపన మీలో చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలని మీ మైండ్ లో వచ్చినా.. అది చివరి దశకు వచ్చే వరకు దానిపై ఫోకస్ పెట్టరు. ఎలాంటి పనినైనా ఒక్కసారి ట్రై చేయాలి అనుకుంటారు. ఈ తత్వమే మీలో ఉన్న ప్రత్యేకత.

మకరరాశి
మకరరాశి వాళ్ల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వీళ్లు ఇతరుల ప్రాబ్లమ్స్ ని భుజానికేసుకుంటారు. వాటిని వీళ్ల ప్రాబ్లమ్స్ గానే భావించి పరిష్కరిస్తారు. ఇలాంటి స్వభావం మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తుంది. అయితే ఈ స్వభావాన్ని ఎవరూ మెచ్చుకోరు.. కానీ మంచి పనిగా భావిస్తారు.

కుంభరాశి
విషయాలను చాలా సింపుల్ గా తీసుకోవడం కుంభరాశి వాళ్లకు అలవాటు. ఎదుటివాళ్లు చెప్పిన విషయాన్ని వింటారు, వాళ్ల జడ్జ్ మెంట్ ని ఫాలో అవుతారు. వాళ్లు నీ మాటలు విన్నా వినకపోయినా.. వాళ్లను మీరు అనుసరిస్తారు.

మీనరాశి
మీరు నమ్మదగినవాళ్లు. ఇదే మీలో చాలా ప్రత్యేకమైన విషయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ సలహా కోసం చూస్తారు. ఎందుకంటే.. మీరు తప్పు సలహా ఇవ్వరని ఎదుటివాళ్లు నమ్ముతారు. ఇదే మీలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం.



Click it and Unblock the Notifications