For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017 మీ లైఫ్ సంతోషాలమయమా ? సమస్యల సుడిగుండమా ?

By Swathi
|

2016 సంవత్సరం ఆఖరికి వచ్చేసింది. ఈ ఏడాది చాలా ఒడిదుడులను, సమస్యలు, సంతోషాలను ఎదుర్కొన్నాం. చెడు, మంచి రెండింటినీ.. మన లైఫ్ లో చూశాం. అయితే.. రాబోతున్న కొత్త సంవత్సరం 2017 మనకు ఎలా ఉండబోతోంది ? 2017లో మనం సక్సెస్ అవుతామా ? ఫెయిల్యూర్ అవుతామా అనేది చూద్దాం.

2017లో గ్రహాల పొజిషన్స్ లో చాలా మార్పులు కనిపించబోతున్నాయి. పాజిటివ్ గా, నెగటివ్ గా రెండు రకాలుగా.. మీ నక్షత్రాలపై ప్రభావం చూపబోతున్నాయి. ఒక దాని స్థానాన్ని మరొకటి మార్చుకుంటున్నాయి.

2017లో రెండో సగం అన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారబోతోంది. మొదటి సగంతో పోల్చితే.. రెండో సగం ఎక్కువ సక్సెస్ ని, సంతోషాలను అందించబోతోంది. గురువారాల్లో ఉపవాసం ఉండే వాళ్లకు.. రానున్న కొత్త ఏడాది.. ఎక్కువ ఫలితాలను అందిస్తుంది. అలాగే 2017 మన లైఫ్ లో ఎలాంటి మార్పులు, సక్సెస్ లు తీసుకొస్తోందో చూద్దాం..

ఖర్చులు

ఖర్చులు

2017లో మీ ఖర్చులు ఆకాశాన్ని తాకుతాయి. మీ ఆరోగ్యంపై కూడా కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి.. 2017లో ఖర్చులు పెరగకుండా, ఆరోగ్యంపై దుష్ర్పభావం పడకుండా ఉండాలంటే.. ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి.

ఆర్థిక పరిస్థితులు

ఆర్థిక పరిస్థితులు

కొత్త ఏడాది ఎక్కువ ఖర్చులు ఉండటం వల్ల.. మీ ఆర్థిక పరిస్థితులు కూడా.. కాస్త ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి డబ్బుని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. డబ్బు విషయంలోనే కాకుండా కొత్త ఏడాది మీ తల్లిదండ్రులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఆందోళన

ఆందోళన

2017లో ఆందోళన, ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉంటాయి. మీ వర్క్ లో, ఫ్యామిలీ లైఫ్ లో కాస్త టెన్షన్ ఫీలవుతారు.

పరిష్కారం

పరిష్కారం

కొత్త ఏడాదిలో ఇబ్బందిపెట్టే ఆందోళన, టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవడానికి శనివారం నల్ల కుక్కకు చపాతి తినిపించాలి. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. కాస్త ఆలోచించాలి. దీనివల్ల మిమ్మల్ని మీరు సమస్యలో పడేసుకోకుండా జాగ్రత్తపడవచ్చు.

సమస్యలు

సమస్యలు

న్యూ ఇయర్ మొదలైన మొదట్లో కాస్త సమస్యలు ఇబ్బందిపెట్టినా.. తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. 2017 ముగిసేవరకు కాస్త ప్రశాంతంగా, టెన్షన్ ఫ్రీగా ఉంటారు. సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటారు.

శని

శని

సమస్యలను తేలికగా, త్వరగా పరిష్కరించుకోవాలి అంటే.. శని దేవుడిని పూజించాలి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రతిరోజూ స్మరించుకోవాలి. అలాగే ప్రతి శనివారం శని ఆలయాన్ని దర్శించుకోవాలి.

 వర్క్ ప్లేస్

వర్క్ ప్లేస్

మీ సహోద్యోగులతో సరైన కమ్యునికేషన్, కో ఆర్డినేషన్ ఉంటే.. అంతా సజావుగానే ఉంటుంది. ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వర్క్ లో సక్సెస్

వర్క్ లో సక్సెస్

వర్క్ లో, ఉద్యోగం, వ్యాపారాల్లో విజయం సాధించాలంటే.. మట్టి దీపాన్ని పేదవాళ్లకు శనివారం దానం చేయాలి. అలాగే మీ ఇంటి ముఖ ద్వారం దగ్గర కూడా.. దీపం వెలిగించవచ్చు.

ఏడాది చివర్లో

ఏడాది చివర్లో

ఈ ఏడాది మొత్తం సంతోషంగా, విజయవంతంగా సాగిపోవాలంటే.. ప్రతి రోజూ విష్ణు సహస్రనామం చదవాలి.

మంత్రం

మంత్రం

ప్రతి రోజూ ఓం రే రహ్వే నమః అనే మంత్రి స్మరించడంలో వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ప్రతి శనివారం శని దేవుడిని పూజించాలి.

ఇబ్బందులు

ఇబ్బందులు

మానసిక ఒత్తిడి లేదా అనారోగ్యం లేదా డబ్బు కోల్పోవడం వల్ల.. ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. అయితే.. వాటిని ప్రశాంతంగా, ఓర్పుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే.. వాటి నుంచి తేలికగా బయటపడతారు.

శని దేవుడు

శని దేవుడు

2017లో చాలా రాశులలో శని ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి శని దేవుడిని పూజించాలి. ప్రతి శనివారం ఆవనూనెను సమర్పించాలి.

శనిప్రభావం

శనిప్రభావం

కొత్త ఏడాది ఏడున్నర ఏళ్ల శని ప్రభావం కూడా.. చాలా రాశులపై ఉండబోతోంది. ఇలా శనిప్రభావం ఉండకూడదంటే.. శని దేవుడిని పూజించాల్సిన అవసరం ఉంది.

భాగస్వామి

భాగస్వామి

మీ భాగస్వామి మీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ప్రతి రోజూ ఓం శనైశ్వరాయ నమః అని మంత్రం చదవాలి. అలాగే మీ భాగస్వామిపై నమ్మకం, అర్థం చేసుకోవడం వంటి లక్షణాలు చూపించినప్పుడే.. మీ వైవాహిక బంధం సంతోషంగా ఉంటుంది.

విధి

విధి

రాబోయే ఏడాది మీ జీవితంలో విధి కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ దేవుడిని పూజించాలి. అప్పుడు మంచి కర్మను పొందుతారు.

ఒత్తిడితో కూడిన ఉద్యోగం

ఒత్తిడితో కూడిన ఉద్యోగం

ఈ ఏడాది మీ ఉద్యోగం మీకు చాలా సమస్యలు తీసుకొస్తుంది. ఉద్యోగాలు లేనివాళ్లు, ఉద్యోగం వెతుకున్నేవాళ్లకు ఏడాది చివర్లో కలిసొస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఓర్పుతో ఉండాలి.

English summary

What will the upcoming year bring you?

What will the upcoming year bring you? 2017 is considered to be a huge year since it will see a lot of planetary changes taking place that can both positively and negatively hamper your stars.