For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద కళ్లు అమ్మాయిలకు అదృష్టమైతే.. చిన్నకళ్లు దురదృష్టమా ?

By Swathi
|

కలవల్లాంటి కళ్లు.. దొండపండు లాంటి పెదాలు.. చటుక్కున గిల్లాలనిపించే బుగ్గలు.. చిలకలాంటి ముక్కు.. ఇలా అమ్మాయిల అందాన్ని రకరకాలు పొగిడేస్తుంటారు. ప్రేమలో ఉన్న అబ్బాయిలు, యంగ్ బ్లడ్ యూత్, కాస్త క్రియేటివిటీ ఉన్న కుర్రాళ్లు, సినీ కవులు అందానికి చిహ్నంగా అమ్మాయిలనే భావిస్తారు. అమ్మాయి ముఖంలోని ప్రతి పార్టూ.. ప్రత్యేకమే.

READ MORE: మ‌గ‌వాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీత‌లుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ?? READ MORE: మ‌గ‌వాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీత‌లుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ??

మరి అమ్మాయిల అందానికి చిహ్నంగా భావించే పెదాలు, బుగ్గలు ఏ రూపంలో, ఏరంగులో ఉండే అదృష్టం, దురదృష్టం. తెలుసుకోవాలనుందా ? ఎలాంటి రూపురేఖలున్న అమ్మాయిలు అందరి మనుసు గెలుచుకోగలుగుతారు. ఎలాంటి హావభావాలు కలిగిన అమ్మాయి భర్తను ప్రేమగా చూసుకుంటే.. ఎలాంటి అమ్మాయి కుటుంబానికి గౌరవం ఇస్తుందనే విషయంపై అధ్యయనాలు ఆసక్తికర విషయాలు చెబుతున్నాయి. అమ్మాయిల ముఖం ఫ్రెష్ గా, కాంతినీలుతుంటే.. అదృష్టమని, నిర్జీవంగా ఉంటే.. చీట్ చేస్తారట. మరి మీ భాగస్వామి లేదా మీ గాల్ ఫ్రెండ్ ఫేస్.. ఎలాంటి విషయాలు వెల్లడిస్తుందో తెలుసుకోండి.

ఫేస్

ఫేస్

అమ్మాయి ముఖం గుండ్రంగా, స్మూత్ గా, రెడ్డిష్ గా, ఫ్రెష్ అండ్ గ్లామరస్ గా ఉంటే.. ఆమె అదృష్టవంతురాలు. ఆమె గౌరవించబడుతుంది. అలాగే మంచి పాలనాధికారి అవుతుంది. కాన్ఫిడెన్స్ తో ఎలాంటి పరిస్థితినైనా కంట్రోల్ చేయగలుగుతుంది. ముఖం తల్లిదండ్రుల లాగా ఉంటే.. ఆమెది అదృష్టం. నిర్జీవంగా ముఖం కలిగి ఉన్న అమ్మాయిలు నీతులు చెబుతుంది. ప్రతి విషయంపైనా ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. షైనింగ్ ఫేస్ ఉన్న అమ్మాయిలు చాలా చురుగ్గా ఉంటారు.. అయితే చీట్ చేసే తత్వం కలిగి ఉండవచ్చు.

బుగ్గలు

బుగ్గలు

రెడ్, బ్లడ్ కలర్ లో ఉండే బుగ్గలు కలిగిన అమ్మాయిలు అందరికీ నచ్చుతారు. గుండ్రంగా, ఎర్రగా బుగ్గలు కలిగి ఉన్న అమ్మాయిలు మంచి ఆరోగ్యం, అందం కలిగి ఉంటుంది. మాట్లాడినప్పుడ, నవ్వినప్పుడు బుగ్గలపై సొట్ట పడితే.. అమ్మాయిలకు మంచిది కాదు. కేవలం నవ్వినప్పుడు మాత్రమే సొట్టపడితే.. ఆమె భర్తకు మంచిది.

పెదాలు

పెదాలు

పెదాలు చక్కటి రూపంలో, సన్నగా, స్మూత్ గా, హెయిర్ లేకుండా ఉంటే.. రెండు పెదాలు ఒకే సైజులో మంచి ఆకారంలో ఉండే.. ఆమెను తన భర్త అమితంగా ప్రేమిస్తాడు. సన్నటి పెదాలు కలిగిన అమ్మాయి మాట్లాడటానికి ఇష్టపడుతుంది. ఒకవేళ పెదాలు చాలా పెద్దగా ఉంటే.. ఆమెకు వివాహేతర సంబంధం కలిగి ఉంటుంది. కింది పెదవి సన్నగా, పొడవుగా, డ్రైగా ఉంటే.. అనారోగ్యానికి సంకేతం.

ముక్కు

ముక్కు

మహిళల ముక్కు చిలుక ముక్కులా ఉంటే.. మంచి స్వభావం కలిగి ఉంటుంది. తన కుటుంబ శ్రేయస్సు కోరుకుంటుంది. స్ట్రెయిట్ గా, సాధారణ పొడవు ఉన్న ముక్కు కలిగి ఉన్న మహిళ చాలా అందంగా ఉంటుంది. చిన్న ముక్కు ఉండే మహిళ కన్నింగ్, వివాహేతర సంబంధాలు కలిగి ఉండే అవకాశముంది. ముక్కు ముందు భాగం లావుగా ఉండే.. ఆమె ప్రేమ, జాలి కలిగి ఉంటుంది. ముక్కపై హెయిర్ ఉంటే... అన్ లక్కీకి సంకేతం.

చెవులు

చెవులు

పొడవాటి చెవులు కలిగిన అమ్మాయిలు చాలా అదృష్టవంతురాలు. సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తారు. చెవులు సన్నగా ఉండి.. సరైన సైజ్ లేకపోతే.. ఆమె అన్ లక్కీ అని సంకేతం.

పళ్లు

పళ్లు

టీత్ బాగా ముత్యాల్లీ తెల్లగా మెరిసిపోతూ, 32 రెండు పళ్లూ ఒకే సైజులో ఉంటే.. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. ఒకవేళ పళ్లు పెద్దగా, వంగర్లుగా ఉంటే ఆమె దురదృష్టవంతురాలు. ఒకవేళ పై వరుసలో కంటే కింది వరుసలో ఎక్కువ పళ్లు ఉంటే.. చాలా లక్కీ. పళ్ల మధ్యలో గ్యాప్ ఉంటే.. దురదృష్టానికి సంకేతం.

గడ్డం

గడ్డం

సాఫ్ అండ్ స్మూత్ గడ్డం కలిగి ఉంటే ఆ అమ్మాయి లక్కీ పర్సన్. ఒకవేళ గడ్డం పెద్దగా, లావుగా, గుండ్రంగా ఉంటే.. ఆమె చాలా కోపం కలిగి ఉంటుంది. జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాయిస్

వాయిస్

స్వీట్ వాయిస్ కలిగిన అమ్మాయిలకు అది గాడ్ గిఫ్ట్. ఎందుకంటే.. వాళ్లు చాలా ఎట్రాక్టివ్ గా, ప్రేమగా, మంచి స్వభావం కలిగి ఉంటారు. రఫ్, గరుకు వాయిస్ కలిగిన అమ్మాయిలు కన్నింగ్ గా ఉంటారు. వివాహేతర సంబంధాలు కలిగి ఉండే అవకాశముంది. మగవాళ్లలాంటి వాయిస్ ఉన్న అమ్మాయిలు దురదృష్టవంతులు. మాట్లాడేటప్పుడు కళ్లు కదిలించే అమ్మాయిలు మగవాళ్ల కంపెనీని ఎంజాయ్ చేస్తారు.

నాలుక

నాలుక

ఎరుపు రంగులో నాలుక ఉన్న అమ్మాయిలు అదృష్టవంతులు. నాలుక నల్లగా ఉంటే.. స్వార్థం, కోపం ఎక్కువగా ఉంటాయి. నాలుక కలర్ తెల్లగా ఉంటే.. ఆమె చక్కటి ఆరోగ్యాన్ని మెయింటెయిన్ చేయదు. చాలా పొడవైన నాలుక కలిగిన మహిళలు.. దురదృష్టవంతులు.

కళ్లు

కళ్లు

కళ్లు పెద్దగా ఉండే అమ్మాయిలు చాలా అదృష్టవంతురాలు. అలాగే డామినేటింగ్ నేచర్ కలిగి ఉంటుంది. సమాజంలో గౌరవించబడతారు. కళ్లు చిన్నగా, డల్ గా ఉంటే.. వాళ్లు దురదృష్టవంతులు. జీవింతో పైకి రాలేరు. కళ్లు పెద్దగా ఉండటమే కాకుండా.. పొడవుగా ఉంటే.. ఆ అమ్మాయి మంచి అభిరుచి కలిగి ఉంటుంది. సొసైటీలో చాలా పాపులర్ అవుతుంది.

ఐబ్రోస్

ఐబ్రోస్

విల్లులా అమ్మాయిల ఐబ్రోస్ లా, నల్లగా ఉంటే.. అందంగానే కాదు.. చాలా అదృష్టవంతురాలు. అలాగే.. స్ట్రాంగ్ క్యారెక్టర్ కలిగి ఉంటుంది. కనుబొమ్మల వెంట్రుకలు తక్కువగా ఉంటే.. బ్యాడ్ లక్ కి సంకేతం. రెండు ఐబ్రోస్ కలిసి పోయి ఉంటే.. వితంతువులకు సంకేతం.

Desktop Bottom Promotion