For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఇతరులతో చర్చించకూడని విషయాలు !!

ఒక గొప్ప వ్యక్తి.. తన జీవితంలో కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోకూడదని.. చాణక్యుడు చాలా వివరణాత్మకంగా చెబుతున్నారు. మీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ, ఎవరితోనూ.. ఈ విషయాలను చర్చించకూడదు.

By Swathi
|

పూర్వ కాలం నుంచి చాణక్యనీతి ఫాలో అవుతూ వస్తున్నాం. అతన్ని జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వ్యక్తిగా భావిస్తాం. ఆర్థిక సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా చాణక్యుడి దగ్గర సమాధానం ఉంటుంది.

చాణక్యుడిని కౌటిల్యుడు లేదా విష్ణు గుప్తుడు అని కూడా పిలుస్తారు. ఇవాళ చాణక్యుడి నియమాలను కొన్నింటిని మీతో పంచుకోబోతున్నాం. ఇతని ఆలోచనలు, చెప్పే విషయాలు.. ప్రస్తుత రోజుల్లో కూడా మనుషుల జీవితంలో చాలా ఉపయోగపడతాయి.

never discuss with others

ఒక గొప్ప వ్యక్తి.. తన జీవితంలో కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోకూడదని.. చాణక్యుడు చాలా వివరణాత్మకంగా చెబుతున్నారు. మీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ, ఎవరితోనూ.. ఈ విషయాలను చర్చించకూడదని సూచిస్తున్నారు. మరి ఇతరులతో చర్చించకూడని విషయాలేంటో చూద్దాం..

డబ్బు కోల్పోవడం

డబ్బు కోల్పోవడం

ఆర్థిక పరిస్థితుల గురించి ఇతరులతో చర్చించకూడని చాణక్యుడు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు డబ్బు కోల్పోతున్నారు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే.. దాన్ని మీ మనసులోనే దాచుకోండి. ఇతరులతో పంచుకోకండి.

MOST READ:మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు..!!MOST READ:మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు..!!

ఎవరూ సహాయపడరు

ఎవరూ సహాయపడరు

డబ్బు సమస్య ఉందని ఇతరులతో పంచుకున్నా.. వాళ్లు మీకు సహాయపడరు. ఒకవేళ వాళ్లు మీకు సహాయపడినా.. అది నకిలీదే అయి ఉంటుంది.

పేదవాళ్లకు గౌరవం లేదు

పేదవాళ్లకు గౌరవం లేదు

చాణక్యుడి ప్రకారం.. పేదరికంలో ఉండేవాళ్లకు సమాజంలో.. గౌరవం ఉండదు. కాబట్టి.. తన ఆస్తులు, ఆర్థిక పరిస్థితుల గురించి వాళ్ల మనసులోనే దాచుకోవాలి.

వ్యక్తిగత సమస్యలు

వ్యక్తిగత సమస్యలు

చాణక్యుడి ప్రకారం.. హ్యాపీ లైఫ్ పొందాలంటే.. తన వ్యక్తిగత విషయాలను, సమస్యలను ఎప్పుడూ తనలోనే దాచుకోవాలి. ఇతరులతో పంచుకోకూడదు.

ఎగతాళి చేస్తారు

ఎగతాళి చేస్తారు

తమ వ్యక్తిగత సమస్యలను ఇతరులతో పంచుకుంటే.. వాళ్లు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మిమ్మల్ని మరింత కిందకి తొక్కేస్తారు. మీ వెనకకు వెళ్లి నవ్వుతారు.

మీ భాగస్వామి వ్యక్తిత్వం

మీ భాగస్వామి వ్యక్తిత్వం

ఒక వ్యక్తి తన భార్య వ్యక్తిత్వం గురించి ఎట్టిపరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదు. ఇలా తన భార్య వ్యక్తిత్వాన్ని రహస్యంగా ఉంచే మగవాళ్లు గొప్పవాళ్లవుతారని.. చాణక్యుడు వివరించాడు.

MOST READ:అన్నంలో విషం కలిపితే కూడా తెలిసిపోతుంది, అరటి ఆకులో భోజనంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు MOST READ:అన్నంలో విషం కలిపితే కూడా తెలిసిపోతుంది, అరటి ఆకులో భోజనంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

భయంకరమైన పరిణామాలు

భయంకరమైన పరిణామాలు

ఇలా తన భార్య వ్యక్తిత్వం గురించి ఇతరులతో పంచుకోవడం వల్ల.. తర్వాత భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పేదవాడు అని అవమానించిన విషయం

పేదవాడు అని అవమానించిన విషయం

ఒకవేళ మీరు ఎప్పుడైనా.. పేదవాడని.. ఇతరుల వల్ల అవమానానికి గురై ఉంటే.. సమాజంలో మీపై నిర్లక్ష్యం ఉంటే.. ఆ విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు వివరిస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి విషయాలు ఇతరులకు చెబితే.. వాళ్లు నవ్వుకుని ఎంజాయ్ చేస్తారు.

ఆత్మగౌరవం, అహంకారం

ఆత్మగౌరవం, అహంకారం

ఇలాంటి విషయాలు ఇతరులతో పంచుకుంటే.. మీ ఆత్మగౌరవం, మీ అహాన్ని దెబ్బతీస్తాయి. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు.

కాబట్టి.. ఈ నాలుగు విషయాలను ఇతరులతో ఎట్టిపరిస్థితుల్లో పంచుకోకండి. అలర్ట్ గా ఉండండి.

English summary

What you should not discuss with Others ?

What you should not discuss with Others ? Below are the four pointers Chanakya thought you should not discuss with anyone if you want to lead a happy life.
Desktop Bottom Promotion