Latest Updates
-
మండు వేసవిలో మనసును చల్లబరిచే మధురై స్పెషల్ జిగర్తండ..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఉదయాన్నే ఖాళీ కడుపుతో..చిన్న అల్లం ముక్క నమిలితే ఏమవుతుందో తెలుసా? -
నోటికి రుచి,పొట్టకు హాయి..మిగిలిపోయిన అన్నంతో 10 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా రైస్! -
వారపు రాశి ఫలాలు [29 మార్చి నుండి 04 ఏప్రిల్]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! -
ఈరోజు రాశి ఫలాలు (29.03.26): ఆదివారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! -
సమ్మర్ స్పెషల్..ఎలాంటి కృత్రిమ రంగులు లేని స్వచ్ఛమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ..టేస్ట్ కేక! -
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే! -
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్!
మీరు పుట్టిన నెలను బట్టి పర్సనాలిటీ తెలుసుకునే ఛాన్స్.. !
బర్త్ డే.. ! పుట్టిన రోజు అంటే అందరికీ ప్రత్యేకమే. ఆ రోజుని చాలా సరదాగా, తమకు నచ్చిన విధంగా, ఇష్టమైనవాళ్లతో గడపాలని భావిస్తారు. రోజంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా.. హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే.. వాళ్ల మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో పుట్టిన నెలను బట్టి వాళ్ల పర్సనాలిటీ తెలుసుకోవచ్చని చెబుతోంది.
ఏ వారం పుట్టిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుంది ?
జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల్లో మీరు ఏ నెలలో పుట్టారు ? అనే విషయం తెలిస్తే చాలు.. వారి ప్రవర్తనా విధానం ఎలా ఉంటుందో కనిపెట్టవచ్చు. మీ పర్సనాలిటీ మ్యాచ్ అయిందో లేదో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందా ? అయితే మీ వ్యక్తిత్వంతోపాటు.. మీరు ఇష్టపడే స్నేహితుల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసే ఛాన్స్ మీ చేతుల్లో ఉంది. ఈ ఆసక్తికర విషయం తెలుసుకుని.. మీ ఫ్రెండ్స్ ముందు.. జ్యోతిష్యులైపోండి..

జనవరి
మీరు జనవరిలో పుట్టినవాళ్లు అయితే.. మీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మీరు కన్న కలల్ని నిజం చేసుకుంటారు. అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది. అలాగే ఎక్కడైనా జయించగలుగుతారు.

ఫిబ్రవరి
ఫిబ్రవరిలో పుట్టినవాళ్లు సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ విషయానికైనా తొందరగా బాధపడతారు. అయితే వీళ్లకు కోపం కూడా ఎక్కువే. ఎదుటివాళ్ల గురించి ఆలోచించకుండా.. వెంటనే వాళ్లపై కోపం చూపిస్తారు.

మార్చి
మార్చిలో పుట్టిన వాళ్లు చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఎందుకంటే.. వీళ్లకు భావోద్వేగాలు ఎక్కువ. ఆ ఫీలింగ్స్ ఎదుటివారిలో ఆలోచింపజేస్తాయి.

ఏప్రిల్
ఏప్రిల్ లో పుట్టినవాళ్లు.. కలుపుగోలుగా ఉంటారు. వీళ్లు ఒంటరిగా కంటే.. ఇతరులతో కలిసి పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరులపై నమ్మకం ఎక్కువ. అలాగే వీళ్లు చాలా సెన్సిటివ్ మైండెడ్.

మే
మేలో పుట్టినవాళ్లు. ఎదుటివాళ్లను త్వరగా నమ్ముతారు. వీళ్లు తొందరగా ఎట్రాక్ట్ అవుతారు. అలాగే అందరిపై ఒకేరకంగా ప్రేమను చూపిస్తారు.

జూన్
జూన్ లో పుట్టినవాళ్లకు స్నేహితులు ఎక్కవ అని చెప్పవచ్చు. వీళ్లు కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతారు. స్నేహితులతో చాలా హ్యాపీగా, జాలీగా గడుపుతారు. అయితే ఆకర్షణీయంగా ఎవరైనా కనిపిస్తే చాలు ఇట్టే ఎట్రాక్ట్ అయిపోతారు.

జూలై
జూలైలో పుట్టినవాళ్లు చాలా అహంకార స్వభావం కలిగి ఉంటారు. ఖ్యాతి పొందడానికి తాపత్రయపడతారు. అలాగే తొందరగా భావోద్వేగానికి లోనవుతారు. ఈ స్వభావం అనూహ్య మార్పులకు కారణమవుతుంది.

ఆగస్ట్
ఆగస్ట్ లో పుట్టినవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక అనుమానం, ఆలోచనలు కలిగి ఉంటారు. సరదాగా గడపడాన్ని ఇష్టపడతారు. రహస్యాలు తెలుసుకోవడం ఆసక్తికరం. వీళ్లు మ్యూజిక్ లవర్స్ కూడా. మరో విషయం ఏంటంటే.. వీళ్లు పగటి కలలు ఎక్కువగా కంటూ ఉంటారు. తొందరగా బాధపడతారు. నమ్మినవాళ్లు మోసం చేస్తే.. వాళ్లను అసహ్యించుకుంటారు.

సెప్టెంబర్
సెప్టెంబర్ లో పుట్టినవాళ్లు చాలా మంచివాళ్లని చెప్పవచ్చు. వీళ్లు చాలా తెలివైన వాళ్లు. అలాగే స్నేహితుల సమస్యను తెలుసుకుని తీర్చడం, వారిని ఓదార్చడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. భయం అంటే తెలియదు వీళ్లకు. ప్రేమ ఎక్కువ. తన అనుకున్న వాళ్లని చాలా కేరింగ్ గా, ప్రేమగా చూసుకుంటారు.

అక్టోబర్
అక్టోబర్ లో పుట్టిన వాళ్లు చాటింగ్ అంటే ఇష్టపడతారు. అపద్దం చెబుతారు.. కానీ నటించే స్వభావం ఉండదు. స్నేహితులను తొందరగా బాధపెట్టినా మళ్లీ వెంటనే కలిసిపోతారు. వీళ్లు చాలా స్మార్ట్ గా, ఆకర్షనీయంగా, హాట్ అండ్ సెక్సీగా ఉంటారు.

నవంబర్
నవంబర్ లో పుట్టినవాళ్లను నమ్మవచ్చు. వీళ్లకు విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. ఎందుకంటే.. సీక్రెట్స్ అస్సలు రివీల్ చేయరు. స్వతంత్రంగా ఉంటారు.

డిసెంబర్
డిసెంబర్ లో పుట్టినవాళ్లు ఎట్రాక్టివ్ గా ఉంటారు. ఉదారమైన మనసు వీళ్లది. దేశభక్తి ఎక్కువ. అలాగే విశ్వాసమూ ఎక్కువే. ప్రతి విషయంలో పోటీ పడతారు. వీళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. డిసెంబర్ లో పుట్టినవాళ్లు ఉన్నతంగా ఉంటారు.



Click it and Unblock the Notifications











