అరచేతిలో ‘‘నక్షత్రం’ మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది??

జ్యోతిష్యం లో సాముద్రిక శాస్త్రం కూడా ఒక భాగం. దీనిలొ మనిషి యొక్క అవయవాలపొందికను, తీరును బట్టి అతని జీవితాన్ని చదవవచ్చు. దీనిలో హస్త సాముద్రికం ఒక విశిష్ట విద్య. వేళ్ళ అమరిక మనిషి మనస్తత్వాన్నితెలియచేస్తుంది. హస్త రేఖలు ఇంకా అనేక జీవిత వివరాలను తెలియ చేస్తాయి. జ్యోతిష్యం కంటే ఇది నేర్చుకోవటం తేలిక. కారణం ఏమంటే,దీనిలో విశ్లేషణలు ఉండవు.

చైనీయుల హస్త సాముద్రికం మరింత సులభం. చైనావారి హస్త పటనంను బట్టి, చేతులు, పాదాల మరియు తలలో కొన్ని లక్షణాలను చూసి అతని పూర్తి జాతకాన్ని చెప్పేస్తారు. ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క చేతులను చూసి ఉద్యోగంలో, ప్రేమ మరియు జీవితంలో ఆ వ్యక్తి ఎలా ఉండబోతారన్న విషయాన్ని తెలియజేస్తుంటారు. పామిస్ట్రీ (హస్త సాముద్రికం) ఒక పురాతన జ్యోతిష్యశాస్త్రం. అనేక వైవిధ్యమైన సంస్కృతుల వారు హస్త సాముద్రికంను వాడుతున్నారు. పామిస్ట్రీని బట్టి ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటిని, అతని లక్షణాలను, గమ్యాన్ని చెప్పేస్తుంటారు. పామిస్ట్రీలో శంఖాలు, చక్రాలు, భాగాలు, చదరాలు, మరియు ఫిషెస్ అన్న విషయాలు వినే ఉంటారు. ఇవి మాత్రమే కాదు, అరచేతిలో వీటితో పాటు స్టార్స్ కూడా ఉన్నాయి. ఈ స్టార్స్ ఒక్కో వ్యక్తి చేతిలో ఒక్కోప్రదేశంలో ఉంటాయి. అరచేతిలో స్టార్స్ ఉండే ప్రదేశాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క విషయాలను తెలుసుకోవచ్చు. అదేలాగంటే..

బృహస్పతి స్థావరం వద్ద అంటే చూపుడు వేలు క్రింది బాగంలో నక్షత్రం ఉంటే

బృహస్పతి స్థావరం వద్ద అంటే చూపుడు వేలు క్రింది బాగంలో నక్షత్రం ఉంటే

ఎడమ చేతి చూపుడు వేలు క్రింది బాగంలో నక్షత్రం కనిపించడినప్పుడు వారు ధనవంతులుగా మరియు స్ట్రాంగ్ రిలేషన్ షిప్ లకిగి ఉంటారని సూచిస్తుంది . వారు వారి చుట్టూ సోషియల్ నెట్ వర్కింగ్ ను ఏర్పరుచుకుంటారు. స్నేహితులు మరియు తెలిసిన వారుతో ఎప్పుడూ సంతోషంగా గడుపుతారు . వక్తి గొప్పగా ఎదగడానికి మంచి వ్యక్తులతో స్నేహ సంబందాలు కలుపుకుంటారు చేతి ఇలాంటి స్టార్ లక్షణం ఉన్నప్పుడు, మీరు మొదలు పెట్టిన జీవితం కంటే ముగింపు చాలా అందంగా ముగుస్తుంది. వృద్ధాప్యంలో ఆనందంగా గడుపుతారు.

బృహస్పతి స్థావరం మీద స్టార్ (నక్షత్రం) కనిపించినప్పుడు

బృహస్పతి స్థావరం మీద స్టార్ (నక్షత్రం) కనిపించినప్పుడు

చూపుడు వేలి క్రింది భాగంలో స్టార్ కనిపించన వ్యక్తులు గైరవ మర్యాధలు కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబంలో మరియు బయట హుందాగా ఉంటారు. సామాజిక శక్తిని పొందడానికి డబ్బు సంపాదించడలో నిమగ్నమవుతాడు. ఇలాంటి నక్షతం ఉన్నవారు, మని సున్నితంగా ఉంటారు, ఓపిక ఎక్కువగా ఉంటుంది.

 బృహస్పతి స్థావరం లో

బృహస్పతి స్థావరం లో "క్రాస్" తో పాటు స్టార్ కనిపించినప్పుడు

స్టార్ క్రాస్ లైన్ కు దగ్గరగా కనిపించినప్పుడు ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. మంచి గా కీర్తింపబడుతారు. తెలివైన వారిగా ఉంటారు. ప్రదేశంలో నక్షత్రం కలవారు ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో ఉంటారు. వారిలో ఆధ్యాత్మికశక్తి ఆ వ్యక్తి యొక్క కోరికలను నెరవేర్చే విధంగా ఉంటాయి.జీవిత విషయానికి వస్తే ఉద్యోగపరంగా మరియు కెరీర్ పరంగా బాగుంటుంది. జీవితంలో అన్ని విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటో అందమైన జీవితాన్ని పొందుతారు.

బుధుడు స్థానంలో (చిటికిన వేలు క్రింది భాగంలో)నక్షత్రం ఉంటే:

బుధుడు స్థానంలో (చిటికిన వేలు క్రింది భాగంలో)నక్షత్రం ఉంటే:

చిటికిన వేళు క్రింది భాగం బుధుడు స్థానం. ఈ ప్రదేశంలో స్టార్స్ ఉంటే ఆ వ్యక్తి లో ఒక బాధితుడు లక్షణాలను సూచిస్తుంది. అటువంటి లక్షణాలు చేతిలో కనిపించినప్పుడు ఇతరులను, అపరిచితులను, అతిగా నమ్మకుండా ఉండాలి. మీ స్నేహితులు మిమ్మల్ని అట్రాక్ట్ చేయవచ్చు. కానీ మీ ద్వారా వారు వేరే ఏదో ఆశిస్తున్నారన్న విషయం గుర్గించాలి. అయితే మీకున్న నిజమైన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకునే విషయాలు ఏది నిజమైనది, ఏది వదులుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉంటారు. అరతి చేతిలో టీ ఆకారపు నక్షత్రాలు కనిపించినప్పుడు, ఇతరులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మార్స్ (బొటన వేలు) పక్క భాగంలో

మార్స్ (బొటన వేలు) పక్క భాగంలో "నక్షత్ర" చిహ్నం ఉంటే

ఇది వ్యక్తి యొక్క చెడు లక్షణాలను సూచిస్తుంది . జీవితంలో సవాళ్ళను మరియు అండకులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ నక్షత్ర చిహ్నం ఉన్నవారు. జీవితంలో ఎంత విలవైనది కోరుకుంటే అంత కష్ట పడాల్సి వస్తుంది. మీ లక్ష్యాన్ని ఎంత చేరాలన్నా, కష్టాలు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి. కాబట్టి, ఈ ప్లేస్ లో నక్షత్రం చిహ్నం ఉన్నవారు. ఉన్నవాటితో సంతృప్తి పడాలి లేదంటే జీవితం మొత్తం అంసంతృప్తిగా ఉంటుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల ఒకరకమైన ప్రయోజనం కనిపిస్తుంది

వీనస్ (బొటన వేలు) క్రింది భాగంలో

వీనస్ (బొటన వేలు) క్రింది భాగంలో "నక్షత్ర" చిహ్నం కనిపిస్తే

పురుషులకు - స్త్రీల వల్ల, స్త్రీలకు పురుషుల వల్ల దురదృష్టం సూచిస్తుంది. మీరు ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల ప్రేమలో దురదృష్టవంతులుగా మిగిలిపోతారు, వీరు ఎప్పటికీ సంతృప్తి చెందరు. ప్రేమలో నమ్మకం లేనప్పుడు, మీకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి, కోపాన్ని నియంత్రించుకుని, సహనంగా ఉండటం వల్ల పెద్దగా ఓటమి పాలు కాకుండా ఉంటారు.

లైఫ్ లైన్ కు మద్యలో స్టార్ కనిపిస్తే:

లైఫ్ లైన్ కు మద్యలో స్టార్ కనిపిస్తే:

స్టార్ చిహ్నం లైఫ్ లైన్ కు మద్యలో కనిపిస్తే ఆ వ్యక్తి మద్యవయస్సులో ఉన్నప్పుడు 40 ఏళ్లలో ఏదో విపత్తు జరుగుతుందని సూచిస్తుంది . కాబట్టి, వీరు ఆరోగ్యం గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి . అలాగే మీరు మీ జీవితంలో ఇష్టపడే వారున్నా, లేదా వారితో కలిసి జీవిస్తున్నా వారితో మరి కాస్త ఎక్కవ సమయం గడపడానికి ప్రయత్నించండి. జీవితం ప్రారంభంలో మరియు తర్వాతి దశలో సంతోషంగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలుండవు . మద్యవయస్సులో జీవితం సంతోషంగా ముగించినప్పుడు, ఓల్డ్ ఏజ్ కు మరింత సంతోషంగా ముగుస్తుంది.

. నక్షత్ర చిహ్నం ఉంగరపు వేలు క్రింది ఉంటే

. నక్షత్ర చిహ్నం ఉంగరపు వేలు క్రింది ఉంటే

సంఘంలో గొప్ప గుర్గింపు, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. అదృష్ట వంతులుగా సూచిస్తుంది.ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీల్ మంచి సక్సెస్ ఫుల్ జీవితాన్ని పొందుతారు. ఒక ఫేమస్ సెలబ్రెటీలా పేరుప్రతిష్టలు పొందుతారు. మంచి గుర్తింపు ఉంటుంది. వృత్తిపరంగా ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదగ గలరు . మీలో ఉండే శక్తి సార్థ్యాలతో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వ్యక్తిగతంగా బాగా పాపుర్ అవుతారు. మంచి వాక్ చాతుర్యం కలిగి ఉంటారు. పబ్లిక్ లో ఇతరులను మీ మాటల్లో నమ్మకం, వాక్ చాతుర్యంతోటే ఆకర్షితులవుతారు. మీరు ఎవ్వరిని ఇష్టపడకపోయినా, మిమ్మల్ని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. మీ శక్తి సామర్థ్యం మీద ఎంత నమ్మకం కలిగి ఉంటారో అంత కంటే ఎక్కువ ఫలితాలను పొందుతారు.

 నక్షత్ర చిహ్నం మెర్యురి లైన్(చిటికిన వేలికి)కి చివరగా ఉంటే:

నక్షత్ర చిహ్నం మెర్యురి లైన్(చిటికిన వేలికి)కి చివరగా ఉంటే:

ఆరోగ్యం పరంగా ఆందోళన కలగవచ్చు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన ఏదో కావచ్చు. మీ వ్యక్తిత్వం అంత స్ట్రాంగ్ ఉండదు. మీరు సైలెంట్ గా ఉండటం వల్ల కొంత వరకూ ప్రయోజనం పొందుతారు. ఇతరులను చూసినప్పుడు వారిలాగా జీవించాలి, వారిలాగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు . కానీ అది జరగదు. అది మీలో మరింత నిరుత్సాహాన్ని నింపుతుంది. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని తప్పు దోవ పట్టిస్తారు ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులకు దూరంగా ఉండాలి. అలాంటివారు మీకెప్పుడు సమస్యలను తెచ్చిపెడుతుంటారు. వారిలో మీరు కలవకపోవడం వల్ల మీఅంతట మీరు స్వతహాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని పైకొస్తారు. జీవితంలో సక్సెస్ అవుతారు.

మెర్యురి లైన్(చిటికిన వేలకు క్రింది లైన్ ) మీద స్టార్ ఉంటే?

మెర్యురి లైన్(చిటికిన వేలకు క్రింది లైన్ ) మీద స్టార్ ఉంటే?

ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందలు మరియు దివాలా తీసే లక్షణాలను సూచిస్తుంది. ఇలాంటి వారు, వేరే విధంగా డబ్బును సేవ్ చేయడం మంచిది లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మంచిది. మీరు సంపాదించే సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు . కాబట్టి, యావరేజ్ పర్సన్ కంటే ఎక్కువగా సంపాదించాలి. లేదంటే మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందలేరు. మీకు వ్యతరికే స్వభావం, ఆస్తి అంతస్తుల విషయంలో బాగుండే వారిని వివాహం చేసుకుంటారు. జూదలక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇవి ఎప్పుడూ చేయడం జీవితంలో మంచిది కాదు.

Desktop Bottom Promotion