For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనరల్ నాలెడ్జ్: టాబ్లెట్ల మధ్య గ్యాప్ వదులుతూ ప్యాక్ చేస్తారు ఎందుకనీ!!???

|

ఏదైనా కొద్దిగా అనారోగ్యం క‌లిగినా చాలు, వెంట‌నే మందుల షాపుకు ప‌రిగెత్తుకుని వెళ్లి టాబ్లెట్స్ , టానిక్కో కొన‌డం, మింగ‌డం మ‌న‌కు ప‌రిపాటే. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌లుగుతాయోన‌ని కూడా ఆలోచించం. అప్పటిక‌ప్పుడు స‌మ‌స్య త‌గ్గితే చాల‌నుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం మందుల‌ను మింగ‌డం వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాదు లెండి. కానీ విష‌యం టాబ్లెట్స్ కు సంబంధించిందే. తెలుసుకోద‌గిన‌ది.

టాబ్లెట్స్ కొన్నప్పుడు వాటిని మీరు ఎప్పుడైనా స‌రిగ్గా గ‌మ‌నించారా..? ఇంత‌కీ అందులో గ‌మ‌నించ‌ద‌గింది ఏముంది..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే ఉంది. నిజంగానే ఓసారి చూడండి. చూశారా..? అవును, టాబ్లెట్స్ ప్యాక్‌లో ఒక్కో ఖాళీలో నింప‌బ‌డి ఉన్నాయి. వాటి మ‌ధ్య కొంత ఖాళీ ప్రదేశం కూడా ఉంది. అంటారా..! అవునుండీ, అదే... దాని గురించే మేం చెప్పేది. అయితే టాబ్లెట్స్ అన్నీ ప‌క్క ప‌క్కనే కాకుండా కొంత గ్యాప్ ఇచ్చి ఎందుకు ప్యాక్ చేశారో తెలుసా..? తెలీదు క‌దా..! కానీ... దానికీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేమిటంటే...

Why Are There Empty Spaces In Medical Tablets?

రీజన్ 1: సాధార‌ణంగా కొన్ని టాబ్లెట్స్ సీసాల్లో ప్యాక్ చేస్తారు. వాటి సంగ‌తి ప‌క్కన పెడితే కొన్నింటిని మాత్రం బ్లిస్టర్ ప్యాక్‌ల‌లో ఇస్తారు. కాగా టాబ్లెట్స్ ను ప్యాక్ చేసేట‌ప్పుడు వాటిని ప‌క్క ప‌క్కనే కాకుండా కొంత గ్యాప్ ఇస్తూ ప్యాక్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే టాబ్లెట్స్ మ‌ధ్య కెమిక‌ల్ రియాక్షన్ ఏమీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని.

Why Are There Empty Spaces In Medical Tablets?

రీజన్ 2: అవును, మీరు విన్నది క‌రెక్టే. ప‌క్క ప‌క్కనే ఉంటే ఆ టాబ్లెట్ ను ఒక‌దానితో ఒక‌టి ర‌సాయ‌నికంగా చ‌ర్య జ‌రిపి ఫ‌లితంగా అవి మ‌న‌కు ప‌నికి రాకుండా పోతాయి. దీనికి తోడు టాబ్లెట్స్ ను ట్రాన్స్ పోర్ట్ చేసేటప్పుడు అవి ప‌గ‌ల‌కుండా ఉండ‌డం కోసం కూడా వాటిని ఆ విధంగా ప్యాక్ చేస్తారు.

రీజన్ 3: అయితే కొన్ని సంద‌ర్భాల్లో పేషెంట్లు మొత్తం షీట్‌ను కొనుగోలు చేయ‌రు. ఒక‌టి, రెండు టాబ్లెట్లు మాత్రమే కొంటారు. దీంతో ఆ సంద‌ర్భాల్లో టాబ్లెట్స్ ను సుల‌భంగా క‌ట్ చేయ‌డం కోసం, వాటి వెనుక టాబ్లెట్ ప్రింట్ మ్యాట‌ర్‌ను వినియోగ‌దారునికి తెలియ‌జేయ‌డం కోసం కూడా అలా టాబ్లెట్స్ మ‌ధ్యలో గ్యాప్‌ల‌ను పెడ‌తారు.

Why Are There Empty Spaces In Medical Tablets?

రీజన్ 4: కాగా కొన్ని ప్యాక్‌ల‌లో కేవ‌లం ఒకే టాబ్లెట్ఉంటుంది. అయినా దాని చుట్టూ కూడా కొన్ని చిన్న చిన్న ఖాళీల‌ను పెడుతూ ప్యాకింగ్ చేస్తారు. ఇలా చేసేది కూడా పైన చెప్పిన కార‌ణాల వ‌ల్లే. ఇప్పుడు తెలిసిందా, టాబ్లెట్ల మ‌ధ్య గ్యాప్ వ‌దులుతూ ప్యాకింగ్ ఎందుకు చేస్తారో!

English summary

Why Are There Empty Spaces In Medical Tablets?

Whenever we see a strip of medicine, we think, "Why are they fooling us with an empty space". Initially when you would have noticed it, you would have thought that the company must have forgotten to fill the medicine, but that is not the actual reason for the empty space.
Story first published: Saturday, July 30, 2016, 11:25 [IST]
Desktop Bottom Promotion