For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలంబ్రాలుగా బియ్యం కాకుండా గోధుములు పోసుకునే వింత ఆచారం..

|

వివాహంలో ఈ తలంబ్రాల ఘట్టం చాలా ఆహ్లాదకరమైనటువంటిది. వివాహ సమయంలో మిగతా అన్ని కార్యక్రమాలలో కంటే వధూవరులిద్దరూ ఆచార సంప్రదాయల పద్దతుల ఆచరణలో నిమగ్నమై ఉంటారు. మిగతా వారమందరమూ ప్రేక్షకులలాగా చూస్తూ బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాని వయసుతో సంబంధం లేకుండా ఈ తలంబ్రాల ఘట్టాన్ని మటుకు వధూవరులతో పాటు మిగతా వారు కూడా ఆనందిస్తారు.

తెలుగులో ఈ అక్షింతలను తలంబ్రాలు అంటారు. 'అక్షత' అనగా క్షతము లేనిది. అంటే, వెన్ను విరగనటువంటి బియ్యము అని అర్ధము. తలంబ్రాల ఘట్టం అత్యద్భుతం. మనకు ఎన్నో రకాల దినుసులు ఉండగా ఈ బియ్యాన్నే వాడటానికి కారణం, చంద్రుడు మనః కారకుడు, చంద్రుడు త్వరగా ఆవాహన అయ్యేది బియ్యంలోకి. మరి దంపతుల మధ్య అనురాగము పెల్లుబుకాలి అంటే మనస్సు కదా ప్రధానం. అందుకే బియ్యాన్ని వాడుతాము. వీటిని కపిలవాచన మంత్రాలు అంటారు.

ఈ తలంబ్రాలు పోసుకొనేటప్పుడు వధూవరులు ఇద్దరూ కూడా వారి అభ్యున్నతికి కారణమైన వాటిని ఎన్నింటినో కోరుకుంటారు. కాబట్టి, బ్రహ్మస్థానంలో కూర్చుని ఉన్న బ్రహ్మగారు ఆ మంత్రాలను స్వయంగా వధూవరుల చేత ఒకసారి చెప్పించాలి. ఎందుకంటే, అవి వారి అభ్యున్నతికి కారణం కాబట్టి. వరుడు, వధువు తలపై తలంబ్రాలు పోస్తూ ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధన ధాన్యాలు, పాడిపంటలు, సంవ్రుద్దిగా పెరగాలని కోరుకుంటారు. మన జీవనానికి ఆధార భూతమైన ధాన్యంలో మనం నిత్యసంపద కలవారమై తులతూగుతూ ఉండాలి, అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం కొనసాగుతుంది. శాంతిరస్తు - పుష్టిరస్తు, తుష్టిరస్తు అని మంత్రాలు సాగుతాయి. వీటినే కపిలవాచన మంత్రాలని అంటారు.

వరుడు మొదటగా వధువు చేతిని దర్భతో తుడిచి, ఎండుకొబ్బరి చిప్పలతో దోసిలితో రెండు మార్లు బియ్యాన్ని పోసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. దాన్ని పోసిన తరువాత, వధువు కూడా ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెబుతుంది. మొత్తం మీద వారు తలంబ్రాలు పోసుకునేటప్పుడు, అనేక దానములు చేయుదురు గాక! పుణ్యము వర్ధిల్లును గాక! శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి కలుగును గాక! విఘ్నములు తొలగును గాక ! సత్కర్మలు వృద్ధి పొందును గాక ! గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల, సోముని వల్ల మన దాంపత్యము సవ్యముగా జరుగును గాక ! శాంతి కలుగుగాక! అని చెబుతాడు. ఎంత ఉదాత్తమైన అర్ధాలు నిమిడీక్రుతమై ఉన్నాయి చూడండి.

వధువరులు తలంబ్రాలు పోసుకోవడానికి కొన్ని ఖచ్చితమైన రీజన్స్ ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం..

రీజన్ # 1 :

రీజన్ # 1 :

ఈ సంప్రదాయంను రోమ్ లో ప్రారంభమైనది. ఈ ట్రెడిషన్ కు సంకేతం జీవితంలో సుఖ సంతోషాలతో పాటు, జీవనధారానికి అవసరమైన ధనం, ధాన్యం పొందాలని కోరుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు.

రీజన్ # 2 :

రీజన్ # 2 :

మొదటగా వరుడు "సమాజశ్రేయస్సు కుటుంబవృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని" దోసిలి ఎత్తి తలంబ్రాలు పోస్తాడు. అందుకు వధువు తలవంచి అంగీకరిస్తూ" వధువు "ఆ సంతానజీవన గమనానికి అవసరమైన పాడిపంటలను సమృద్ధిగా అందించమంటూ" తనవంతుగా తలంబ్రాలు పోస్తుంది.

రీజన్ # 2 :

రీజన్ # 2 :

తలంబ్రాలను ప్రపంచంలో వివిధ దేశాల్లో ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మోరాకోలో ఫిగ్స్, ఎండు ద్రాక్ష వంటి తియ్యని, పుల్లని పండ్లతో తలంబ్రాలు పోసుకుంటారు. అక్కడి ఆఛారం ప్రకారం అలా పోసుకోవడం వల్ల నవ దంపతులు ఫ్రూట్ ఫుల్ గా కలిసిమెలసి, ఉంటారని వారి నమ్మకం.

రీజన్ # 4 :

రీజన్ # 4 :

మన ఇండియన్ సంప్రదాయంలో పసుపు కలిపిన బియ్యంను (అక్షతలను)తలంబ్రాలుగా పోసుకోవడం అనాది కాలం నుండి వస్తున్న సంప్రదాయం. ప్రధమంగా నాలుగు సార్లు వారిపై ఒకరు పోసుకొని, ఆ పై పోటీ పడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు. ఆ సమయాన మంత్రాలకు అర్ధం, సంతానము, వృద్ది చెందాలని మగవాడు, ధనధాన్యాలు వృద్ది చెందాలని వధువు....ఇలా సమస్త సంపదలూ, సుఖాలూ కావాలని ఇరువురు భగవంతున్ని కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశ్యము.

రీజన్ # 5 :

రీజన్ # 5 :

ఫ్రాన్స్ : ఫ్రాన్స్ లో కూడా ఇలాంటి సంప్రదాయమే అనుసరిస్తారు, అయితే బియ్యంకు బదులుగా గోధుమలను వధువరులు పోసుకుంటారు.

రీజన్ # 6 :

రీజన్ # 6 :

తలంబ్రాలకు బదులుగా: ప్రపంచం మొత్తంలో ఒక్కో దేశంలోని వారు ఒక్క సంప్రదాయ పద్దతులను అనుసరిస్తే వారి కల్చర్ కు తగ్గిన విధంగా ఫాలో అవుతాంటరు . తలంబ్రాలు ఏవి పోసుకున్నా, అవి నవ వధువు, వరుడుకు సుఖ సంతోషాలు అందివ్వడానికే అని అర్ధం. అయితే కొన్ని దేశాల్లో అక్షింతల స్థానంలో సన్ ఫ్లవర్ సీడ్స్, లేదా బర్డ్ సీడ్స్ వంటివి పోసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే పెళ్ళైదన దంపతుల మీద గుడ్లు కూడా విసురుకుంటారు. ఇవే కాదు, మరెన్నో మనకు తెలియని వింత ఆఛారాలు కూడా ఉన్నాయి...

English summary

Why Do People Throw Rice In Weddings?

Marriages are all about following various customs and rituals and finding about some of the rituals being practiced can make us wonder as to why are they even followed. One such ritual people throwing rice grains on newlyweds.
Story first published: Wednesday, October 5, 2016, 16:14 [IST]
Desktop Bottom Promotion