Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
స్మాల్ స్ర్కీన్ పై ఎట్రాక్ట్ చేస్తున్న మనీ ప్రోగ్రామ్స్
బుల్లితెర అందరికీ.. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ఎంటర్ టైన్ మెంట్. ప్రతి ఒక్కరూ రిలాక్షేషన్ కోరుకునే వేదిక బుల్లితెర. ఉద్యోగులు ఆఫీసుల నుంచి వచ్చి సాయంత్రం తీరిగ్గా ఇంట్లో కూర్చుని టీవీ ముందు ఎంజాయ్ చేసేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కట్టుగా ఎంజాయ్ చేయడానికి ఎదో అద్భుత అవకాశం.
READ MORE: పబ్లిక్ లో ముద్దులతో రెచ్చిపోయిన సెలబ్రిటీలు
టీవీల ద్వారా ప్రపంచంలో జరగుతున్న విషయాలే కాదు.. డ్రామాలు, కాంపిటీషన్స్, ఎంటర్ టైన్ మెంట్ షోస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేయవచ్చు. డబ్బుతో పనిలేకుండా.. ఖర్చు లేకుండా ఆరాంగా ఇంట్లో హ్యాపీగా కావాల్సిన ఛానల్ పెట్టుకుని మస్తుగా ఎంజాయ్ చేసే ఫెసిలిటీ కల్పించింది బుల్లితెర. ఇందులో మహిళలకు చాలా ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. సీరియల్స్, వంటల ప్రోగ్రామ్స్, లేడీస్ ఓరియెంటెడ్ షోస్ లలో బాగా నిమగ్నమయ్యే అవకాశం దొరికింది.

అయితే బుల్లితెర ఒకప్పుడు న్యూస్, సీరియల్స్, సినిమాలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఏ ఛానల్ లో చూసినా.. ఏ సమయంలో చూసినా.. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్ సందడి ఎక్కువైపోయింది. కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ.. ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి టీవీ ఛానల్స్. ఎంటర్ టైన్మెంట్ తోపాటు.. తమ ఛానల్ పై క్రేజ్ పెంచడానికే అన్ని ఛానల్స్ తహతహలాడుతున్నాయి.
READ MORE:ఫ్యాషన్ ముసుగులో అమ్మాయిలకు హెల్త్ ప్రాబ్లమ్స్
ఆడియన్స్ ని ఆకర్షించే పనిలో భాగంగా.. మనీ మానియా మోగిస్తున్నాయి టీవీ ఛానల్స్. ఒకటా రెండా.. లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటీ డబ్బుతో ముడిపడి ఉన్న ప్రోగ్రామ్సే కావడం విశేషం. ఆడియన్స్ కి దగ్గరవడానికి, ఆడియన్స్ తో రిలేషన్ బలపరుచుకోవడానికి ఇదో చక్కటి మార్గంగా మారింది. అందుకే ఏ ప్రోగ్రామ్ చూసినా.. మనీ ఛాలెంజ్ వినిపిస్తోంది. సరదాగా.. ఆడుతూ.. పాడుతూ.. లక్షలు సంపాదించేయచ్చు అన్న అద్భుతమైన ఫీలింగ్ ఆడియన్స్ లో క్రియేట్ చేస్తున్నాయి.

అసలు డబ్బుతో ఎందుకు ప్రోగ్రామ్స్ ముడి పడి ఉంటున్నాయంటే.. ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యేది డబ్బులకే. డబ్బు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది సాధారణమైనది. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు మనమూ భాగం కావాలంటే.. చేతిలో డబ్బులు తప్పనిసరి. అందుకే.. ఆ మైండ్ సెట్ ని క్యాష్ చేసుకుంటున్నాయి ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్.
కొన్ని మనీ ప్రోగ్రామ్స్ నాలెడ్జ్ తో పొంతన పెడుతున్నా.. చాలా ప్రోగ్రామ్స్ కేవలం ఎంటర్ టైన్మెంట్ తోనే సరిపెడుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో నాలెడ్జ్ ఉంటేనే.. డబ్బులు మీ సొంతమవుతాయి. కానీ.. క్యాష్, భూమ్ భూమ్, అలీతో జాలీగా వంటి ప్రోగ్రామ్స్ లో వచ్చే నాలెడ్జ్ ఏమీ ఉండదు. కేవలం సినిమాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జబర్ధస్త్, డీ జూనియర్స్, సూపర్ సింగర్ వంటి ప్రోగ్రామ్స్ లో టాలెంట్ ని బట్టి ప్రైజ్ మనీ ఇస్తారు. బుల్లితెర ప్రోగ్రామ్స్ డబ్బుతోనే నడుస్తున్నా.. ఆడియన్స్ ని మాత్రం బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రేక్షకుల మనసు లాగడానికి ఇదో దారిలో మారడంతో.. అన్ని ఛానల్స్.. అన్ని ప్రోగ్రామ్స్ ఈ మార్గానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications











