Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మంగళవారం లోన్ కానీ, అప్పు కానీ తీసుకుంటే ఏమవుతుంది ?
సాధారణంగా మంగళవారం, శుక్రవారం అప్పు ఇవ్వకూడదు, లక్ష్మీదేవిని ఇతరులకు ఇవ్వకూడదు అని చెబుతుంటారు. అయితే.. మన చేతుల నుంచి ఇతరులకు ఇవ్వడమే కాదు.. మనం కూడా అప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తోంది జ్యోతిష్య శాస్త్రం. అంతేకాదు.. లోను కూడా మంగళవారం ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు అంటోంది జ్యోతిష్య శాస్త్రం. ఎందుకు ?
మంగళవారాన్ని కుజుడు పాలిస్తాడు. కుజుడిని భూమాత పుత్రుడిగా హిందూమతం, భారతీయ జ్యోతిష్య శాస్త్రం చెబుతాయి. భూమి సైజుతో పోల్చితే.. కుజ గ్రహం పరిమాణం సగం ఉంటుందట. కాబట్టి ఈ గ్రహం ప్రభావం భూమి మీద ఉండే మనుషులపై చాలా బలంగా, గొప్పగా ఉంటుందని వేద శాస్త్రం చెబుతుంది.

కుజు గ్రహం స్వభావం చాలా ముతకగా ఉంటుంది. అంటే సున్నితతత్వం కలిగి ఉండదు. గొడవలు, రివెంజ్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. చాలావరకు కుజు గ్రహాన్ని ఎవిల్ గా భావిస్తారు. చాలా క్రూరమైన తత్వం కలిగించడానికి కారణమవుతుందని భావిస్తారు. అయితే ఈ గ్రహానికి చెందిన వాళ్లకు స్ట్రాంగ్ సెక్స్ డ్రైవ్ కలిగి ఉంటారట.
మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వకూడదు? కారణం ఏమిటి?
మంగళవారం ఎందుకు లోను తీసుకోకూడదు ?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారాన్ని కుజుడు పాలిస్తాడు. కాబట్టి.. మంగళవారం అప్పు తీసుకోవడం ఏమాత్రం పవిత్రమైనది కాదు. మంగళవారం అప్పు గానీ, లోన్ కానీ తీసుకోవడం వల్ల దాన్ని తీర్చడానికి ఎక్కువ రోజులు, సంవత్సరాలు పడతాయని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. మంగళవారం ఎట్టిపరిస్థితుల్లో అప్పుగానీ, లోను కానీ తీసుకోవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం.

మార్స్ ని తృప్తి పరచాలంటే ?
కుజు గ్రహ ప్రభావంతో ఇబ్బందిపడేవాళ్లు.. చాలా అలర్ట్ గా ఉండాలి. కుజుడి ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం, అనవసర గొడవలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి.. అలాంటి వాళ్లు రాగిని దానం చేయడం వల్ల మార్స్ లేదా కుజ గ్రహాన్ని తృప్తి పరచడమే కాకుండా.. అదృష్టం తీసుకొస్తుంది.



Click it and Unblock the Notifications