Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఆడవాళ్ల పాదంలో రేఖలు.. భర్త తలరాతను డిసైడ్ చేస్తాయా ?
మహిళల పాదాలు భర్త జీవితం, భవిష్యత్, సంతోషం, కష్టాలకు ప్రతీకలా ? అవును అంటున్నాయి శాస్త్రాలు. మహిళల పాదాల రూపురేఖలు, కాలివేళ్ల ఆకారాలు, కాలివేళ్ల పొడవు.. భర్త తలరాతను డిసైడ్ చేస్తాయట.
మహిళల పాదాలు భర్త జీవితం, భవిష్యత్, సంతోషం, కష్టాలకు ప్రతీకలా ? అవును అంటున్నాయి శాస్త్రాలు. మహిళల పాదాల రూపురేఖలు, కాలివేళ్ల ఆకారాలు, కాలివేళ్ల పొడవు.. భర్త తలరాతను డిసైడ్ చేస్తాయట. మహిళల పాదం, మగవాళ్ల జీవితాన్ని నిర్ణయించడం ఏంటి అనుకుంటున్నారా ? నిజమే.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాళ్ల పాదాలలో మార్పులు.. మగవాళ్ల లైఫ్ ని వివరిస్తాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

శాస్త్రాలు, వేదాలు, పురాణాలు ప్రతి విషయాన్ని.. చాలా తెలివిగా, తేలికగా వివరించాయి. విశ్వం నుంచి, మన కాలి వేళ్ల వరకు.. ప్రతి ఒక్క విషయాన్ని చాలా కూలంకషంగా.. పురాణాలు, శాస్త్రాలు వివరిస్తాయి. సాధారణంగా చేతి వేళ్లు, అరచేయి, కళ్లు, ముక్కు.. ఇలా రకరకాల భాగాల రూపురేఖలను బట్టి.. ఆ వ్యక్తి పర్సనాలిటీని అంచనా వేయడం గురించి విన్నాం. అయితే.. మహిళల పాదం, కాలి వేళ్లు, ఆకారాన్ని బట్టి.. తమ జీవిత భాగస్వామి తలరాతను తెలుసుకోవచ్చట.
మన పాదాలు మన గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్ కి సంబంధించిన విషయాలను దాచుకుని ఉంటాయి. పాదాలు మన కర్మతో అనుసంధానమై.. మన వ్యక్తిత్వాన్ని, మనలో దాగున్న అభిరుచులు, అభిప్రాయాలను చాలా ఆసక్తికరంగా వివరిస్తాయి.
మనుషుల చేతులు, కాళ్లు.. ఐదువేళ్లను కలిగి ఉంటాయి. బొటనవేలుని అంగష్టా, చూపుడువేలుని టార్జాని, మధ్య వేలుని మధ్యమ, ఉంగరపు వేలుని అనామికా, చివరివేలుని కనిష్థికా అని పిలుస్తారు. పురాణ గ్రంథాలను బట్టి.. ఏ ఒక్క మగవాడు.. మహిళ లేకుండా పరిపూర్ణమైన జీవితం పొందలేరని వివరిస్తాయి. అలాగే మగవాళ్లు లేకుండా ఆడవాళ్ల జీవితం పరిపూర్ణం కాదని చెబుతోంది. అందుకే.. మహిళల పాదాలు.. మగవాళ్ల భవిష్యత్ ని వివరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి మీ భాగస్వామి పాదం.. మీ భవిష్యత్ ని ఎలా విరిస్తోందో తెలుసుకోండి..

మహిళల పాదాలు
మహిళల పాదాల్లో శుభకరమైన, అశుభకరమైన సంకేతాలు ఉంటాయి. అవి.. వాళ్ల భాగస్వామి తలరాతను, వ్యక్తిత్వాన్ని, సమస్యలను వివరిస్తాయి.

పాదం
ఏ మహిళ పాదం అడుగుభాగంలో చక్రం లేదా ధ్వజం లేదా స్వస్తిక్ గుర్తు ఉంటుందో.. వాళ్లు.. తమ భర్తను రాజుని చేస్తారు. అతను తన జీవితంలో రాజభోగాలను అనుభవిస్తాడు.

కాలి వేళ్లు
అన్ని వేళ్లకంటే.. రెండో వేలు పెద్దగా కలిగిన మహిళ పెళ్లికి ముందే.. అపవిత్రమై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పెళ్లి తర్వాత తన భర్త ప్రశాంతతకు ఆటంకం కలిగిస్తుంది. చాలామంది రెండోవేలు పొడవుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదని, వాళ్లు చాలా డామినేటింగ్ గా ఉంటారని నమ్ముతారు.

లైన్
చివరి వేలు కింద నుంచి.. పెద్ద వేలు వైపు గీత ఏర్పడి వెళ్తూ ఉంటే.. తన భర్తపట్ల కాస్త అశుభకరమైనదని సంకేతం. తన భర్త జీవితంలో అంత తేలికగా.. విజయం, సంతోషం పొందలేకపోతాడు.

సంకేతాలు
మహిళ పాదంలో కమలం లేదా చక్రం వంటి గుర్తులను కలిగి ఉంటే.. తన భర్త సంతోషం, సంపద, రాజకీయ గుర్తింపు, ఐశ్వర్యం పొందగలుగుతాడు. అయితే.. వాళ్లిద్దరూ కలిసి ఉన్నంతవరకే.. వీటన్నింటినీ కలిగి ఉంటారు.

నేలపై మోపడం
నడిచేటప్పుడు.. చివరి రెండువేళ్లు.. నేలను తాకకపోతే.. ఆమె త్వరగా వితంతువుగా మారుతుందని సంకేతం. అలాగే ఆమె ద్రోహం చేస్తుందని కూడా సంకేతం.

మధ్య వేలు
ఒకవేళ కాలి మధ్య వేలు బొటనవేలు, చూపుడు వేలు కంటే.. పొడవుగా కనిపిస్తే.. ఆ మహిళ తన భర్తపట్ల దురదృష్టకరమైనది కావచ్చు. భర్త బాధలకు, సంతోషం కోల్పోవడానికి కారణమవుతుంది.

మధ్య, నాలుగోవేలు
కాలి మూడో వేలు, నాలుగోవేలు.. ఒకే పొడవు ఉంటే.. భర్త ఆర్థికంగా దెబ్బతినడానికి కారణమవుతుంది. అలాగే.. కుటుంబ సభ్యులతో తన భర్త గొడవపడానికి ఆమె కారణమయ్యే అవకాశాలుంటాయి.

కాలి మడమ
మహిళ కాలి మడమ గుండ్రంగా, సాఫ్ట్ గా, అందంగా ఉంటే.. గ్లామరస్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఒకవేళ మడమ చాలా హార్డ్ గా, పగిలి ఉంటే.. జీవితంలో కష్టాలు తప్పవు.

కాలివేళ్ల మధ్య గ్యాప్
ఇతర వేళ్ల మధ్యలో గ్యాప్ కంటే.. బొటనవేలు, చూపుడు వేలు మధ్య గ్యాప్ సన్నగా ఉంటే.. జీవితం కష్టాలతో నిండి ఉంటుందని సంకేతం. ఒకవేళ బొటనవేలు కంటే.. చూపుడు వేలు పొడవుగా ఉంటే.. జీవితంలో క్రమంతప్పిన ప్రేమ పొందాల్సి వస్తుంది.

పాదంపై గీతలు
ఒకవేళ మహిళల పాదం అడుగుభాగంలో గీతలు రెడ్ కలర్ లో, బాగా క్లియర్ కనిపిస్తూ ఉంటే.. ఎలాంటి క్రాస్ లు, డైవర్షన్స్ లేకుంటే.. మీ జీవితం చాలా స్మూత్ గా, సాఫీగా సాగిపోతుంది. కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఆమె తన భర్త, కుటుంబంపై చాలా ప్రేమగా, భక్తిగా ఉంటుంది.

బొటనవేలు
కాలి వేళ్లు అన్నింటిలోకి మహిళల బొటనవేలు పొడవుగా ఉంటే.. వాళ్లు చాలా తెలివైన వాళ్లట. అలాగే సృజనాత్మకంగా ఉంటారట. ఎలాంటి సమస్యకైనా.. చాలా తేలికగా పరిష్కారించుకోగలుగుతారు.

చిన్నగా ఉంటే
కాలి బొటనవేలు చిన్నగా ఉండే అమ్మాయిలు.. ఏ పనైనా, ఎన్ని పనులైనా చాలా తేలికగా చేయగలుగుతారట. చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు. మీ ఆకర్షణతో.. మీ ఐడియాస్ ని ఎవరైనా అంగీకరించేలా చేస్తారు.



Click it and Unblock the Notifications