Latest Updates
-
యూట్యూబ్ వీడియో చూసి గర్భిణీ ప్రసవం, ఆపై మృతి.. సొంత చికిత్సలతో ఎంత ప్రమాదమో తెలుసా.! -
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.! -
ఇంట్లో శాంతి, ఐక్యత పెరగాలంటే పూర్వీకులు పాటించిన ఆచారాలు -
నెయ్యి ఘుమఘుమలతో స్పెషల్ రొయ్యల వేపుడు.. గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్.! -
కొత్తగా పెళ్లయిందా.. ఆ ఐదేళ్లు తప్పనిసరిగా కలిసే జీవించాలి.. లేదంటే.! -
కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వివరాలివే.! -
పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫూల్ మఖానాతో హెల్తీ దోశ.. లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా లాగించేస్తారు.! -
ఎముకల బలానికి, రక్తహీనతకి చెక్ పెట్టే హెల్తీ చాక్లెట్ లడ్డూ..రోజుకొకటి తింటే డాక్టర్ తో పనే ఉండదు! -
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.!
ప్రపంచంలోనే భూమ్మీద ఉన్న అత్యంత భయంకరమైన ప్రదేశాలు
కొన్ని సందర్భాల్లో ఏవైనా దయ్యాల కథలు, సినిమాలు చూసినప్పుడు లేదా భయంకరమైన, వణుకుపుట్టించే కథలు విన్నప్పుడు మనం చాలా భయాందోళనకు గురవుతూ ఉంటాం. ఈ కథలు మన కళ్లలో మెదులుతూ.. ఉండే అలాంటి కథల వల్ల కొన్నిసార్లు నిద్రకూపట్టదు.
అయితే ఈ భూమ్మీద అత్యంత భయంకరమైన ప్రదేశాల గురించి ఎప్పుడైనా విన్నారా ? ఆ ప్రాంతాలు నిజంగా.. ఎంత ధైర్యవంతులకైనా వణుకుపుట్టించేస్తాయి. ఈ ప్రాంతాల వెనక ఉన్న చరిత్ర ఎవరినైనా బెంబేలెత్తిస్తాయి. మరి అలాంటి ప్రాంతాల గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉందా ?
ఆ ప్రాంతాల పేర్లే.. భయంకరంగా ఉంటాయి. మరి ఆ ప్రదేశాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర లేదు కదూ. ఇంకెందుకు ఆలస్యం ఈ భూమ్మీద ఉన్న అత్యంత భయంకరమైన ఆ ప్రాంతాల గురించి ఓ లుక్కేయండి. స్కేరీ ప్లేసెస్ గురించి ఎవరికైనా స్టోరీస్ కూడా చెప్పి భయపెట్టవచ్చు సుమా.. !!

ఇస్లా డి లాస్ మునెకాస్
ఈ ప్రాంతం భూమ్మీద ఉన్న ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనది. ఈ ప్రదేశాన్ని ఐలాండ్స్ ఆఫ్ డాల్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అన్ని రకాల, అన్ని సైజుల బొమ్మలను చూడవచ్చు. అది కూడా చెట్టుకి, కిటికీలకు వేలాడదీసి ఉంటాయి. అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయమేమిటంటే.. రాత్రయిందంటే చాలు ఈ బొమ్మలు మారిపోతాయి. అంతేకాదు.. గట్టిగా అరుస్తూ రకరకాల శబ్ధం చేస్తాయట. వినడానికే భయంకరంగా ఉంది కదూ.

డెడ్ మ్యాన్స్ ఐలాండ్
కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న ఐలాండ్ ఇది. ఈ ఐలాండ్ ని 1888 నుంచి 1892 వరకు స్మశానంగా ఉపయోగించారు. అయితే ఈ ఐలాండ్ దగ్గరగా పనిచేసే కెనడియన్ నేవీ, పోలీసులకు అప్పుడప్పుడు గట్టిగా అరుపులు వినిపిస్తాయట. అస్థిపంజరాలు, మగవాళ్ల అరుపులు వినిపిస్తాయట.

ఒకినావా ఐలాండ్
సౌత్ జపాన్ లో ఉంది ఒకినావా ఐలాండ్. ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చంపారు. అందుకే అక్కడ రక్తం ఏరులై పారించి. ఆ ప్రాంతం ఇప్పటికీ భయంకరమైన ఆర్థనాదాలతో వణుకుపుట్టిస్తోంది.

అల్కట్రాజ్ ఐలాండ్
శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంది ఈ ఆల్కట్రాజ్ ఐలాండ్. ఈ ప్రాంతం ప్రపంచంలో ఫేమస్ జైలుకి ప్రత్యేకం. అయితే ఈ జైలుకి తలుపులు ఉండవని చెబుతారు. అలాగే ఒక వ్యక్తి మండుతున్న కళ్లతో.. అందరినీ భయపెడతాడని చెబుతుంటారు. అందుకే ఈ ప్రాంతం అత్యంత భయంకరమైన ప్రాంతాల్లో ఒక్కటైంది.

ఐస్ ల్ ఆఫ్ వైట్
సౌత్ కోస్ట్ ఇంగ్లాండ్ లో ఉంది ఈ ఐలాండ్. భూమి మీద ఉన్న అత్యంత భయంకరమైన ప్రాంతంగా దీన్ని చెబుతారు. ఐలాండ్ లో చాలా హోటల్స్, హాస్పిటల్స్, ఆఫీసులు ఉన్నారు. ఈ ఐలాండ్ లో అన్నీ ఉన్నాయి.

కొర్రిగిడోర్ ఐలాండ్
ఫిలిప్పియన్స్ లోని మనీలా బే ఎంట్రెన్స్ లో ఉంది. రెండో ప్రపంచ యుద్దం సమయంలో ఇక్కడ 3 వేలకు పైగా ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారట. అత్యంత ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంగా చరిత్ర ఉంది ఈ ఐలాండ్ కి.

నార్ఫ్లోక్ ఐలాండ్
ఫసిపిక్ మహాసముద్రం దగ్గర ఉన్న చిన్న ఐలాండ్ ఇది. ఈ ప్రాంతాన్ని హెల్త్ ఆఫ్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. అంటే భూలోక నరకం. ఇక్కడ ఖైదీలు నరకయాతన అనుభవించారు. హత్య చేయబడ్డారు. అంతేకాదు రేప్ కూడా చేశారట. నగ్నంగా వాళ్లు చనిపోయేలా చిత్రహింసలు పెట్టారు. ఇంత భయంకరమైన ఈ ప్రదేశం చూసే ధైర్యముందా మీకు.. ? ఖచ్చితంగా భయమేస్తుంది కదూ..



Click it and Unblock the Notifications