Latest Updates
-
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.!
అక్కడికి మనుషులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు ? ఎందుకు ?
ప్రపంచంలో ఏ వింత జరిగినా.. ముందుగా ఎట్రాక్ట్ అయ్యేది మనుషులే. కానీ.. అది మనుషులకే అర్హత లేని ప్రదేశం ? అంటే ఆశ్చర్యమే కదా ? మనుషులు అక్కడికి వెళ్లడానికి అర్హత లేదు. వాళ్లకు ప్రవేశం కూడా లేదు. అదేంటని ముక్కున వేలేసుకుంటున్నారా ? నిజమే అవి టూరిస్ట్ స్పాట్సే.. కానీ.. మనుషులు వెళ్లడానికి వీలు లేదు.. ఎందుకు ?
కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన, అలవాట్లు ఎలా ఉంటాయి ?
టూరిస్ట్ స్పాట్స్ అంటే.. మనుషులకు ఎంట్రీ ఉంటుంది. వాటిని చూసి.. ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రదేశాల గురించి తెలుసుకుంటారు. కానీ ఈ 8 ప్రాంతాలను మాత్రం మనుషులు వెళ్లకుండా బ్యాన్ చేశారు. ఆ ప్లేస్ లు ఉన్నాయని.. అలాంటి ప్రాంతాలకు వెళ్లడానికి మనుషులకు ప్రవేశం లేదని ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ ప్లేస్ లు ఏంటో ఇప్పుడు చూసేద్దామా..

నార్త్ సెంటినల్ ఐలాండ్:
ఇది అండమాన్ దీవుల్లో ఒకటి. బంగాళాఖాతానికి 28 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ఇంతవరకు మనుషులు వెళ్లలేదు. వెళ్లే అవకాశం కూడా లేదు. ఈ ప్రాంతానికి మనుషులు వెళ్లడానికి వీలు లేదు.

నార్త్ సెంటినల్ ఐలాండ్:
1975 లో నేషనల్ జియోగ్రహిక్ ఫిల్మ్ డైరెక్టర్ షూటింగ్ చేయాలని ప్రయత్నించాడు. కానీ 1996లో ప్రభుత్వం వాళ్లతో కాంటాక్ట్ కాకూడదని తిరస్కరించింది.

లాస్ కాక్స్ కేవ్స్:
సౌత్ ఫ్రాన్స్ లో ఉంది ఈ లాస్ కాక్స్ కేవ్స్. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ దాదాపు 20 వేల సంవత్సరాల క్రితం వేసినవని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పెయింటింగ్స్ అన్నీ జంతువులవే.

లాస్ కాక్స్ కేవ్స్:
ఈ ప్రాంతాన్ని 1940 సెప్టెంబర్ 12న మార్షెల్ రావిడట్ అనే 18 ఏళ్ల వ్యక్తి కనుగొన్నాడు. అయితే కొన్నేళ్ల తర్వాత 1948లో పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ గా మార్చేశారు. కానీ.. తర్వాత అక్కడ ఆ గుహల్లో డ్యామేజ్ కనిపించడంతో.. 1963లో మళ్లీ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి అక్కడికి ఎవరికీ ప్రవేశం లేకుండా నిషేధించారు.

మెట్రో 2:
మాస్కోలో ఉన్న మెట్రో సిస్టమ్ ఇది. జోసెఫ్ స్టాలిన్ స్థాపించిన ఈ మెట్రో పేరు D6. క్రెమ్లిన్ నుంచి ఎఫ్ఎస్ బి హెడ్ క్వార్టర్స్ వరకు కలిపే ఈ మెట్రోలో 30 వేల మంది ప్రజలకు అకామిడేషన్ కల్పించవచ్చు.

ఐష్ గ్రాండ్ ష్రైన్:
జపాన్ లో అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం ఐష్ గ్రాండ్. పూర్వం 4 బీసీ నుంచి ఈ పుణ్యక్షేత్రం ఉంది. అయితే ఇక్కడ ఏ ఒక్క మనిషిని చూడకపోవడమే..రికార్డ్.

ఐష్ గ్రాండ్ ష్రైన్:
కాకపోతే జపనీస్ ఇంపీరియల్ ఫ్యామిలీకి చెందిన ప్రీస్ట్స్ మాత్రమే ఈ పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించడానికి అర్హత ఉంది.

ఈస్టర్ ఐలాండ్, చిలి:
పసిఫిక్ మహాసముద్రం సమీపంలో ఉంది ఈ ఈస్టర్ ఐలాండ్. అయితే ఇక్కడ ఉండే సంప్రదాయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత రిమోట్ ఏరియా.

ఈస్ట్ రెన్నెల్
ప్రపంచ యునెస్కో హెరిటేజ్ కి సంబంధించిన ప్రాంతం ఈస్ట్ రెన్నెల్. ఇది సొలొమాన్ ఐలాండ్స్ లో ఉంది. ఈ ప్రాంతానికి కూడా మనుషులు వెళ్లడానికి వీలులేదు.

స్నేక్ ఐలాండ్
బ్రెజిల్ లో ఉంది ఈ స్నేక్ ఐలాండ్. ప్రతి చదరపు మీటర్ కి ఒక పామును చూడటమే.. ఈ ప్రాంతం స్పెషాలిటీ. అంటే ప్రతి రెండో అడుగుకి ఒక పాము తప్పకుండా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రతి పామూ.. గోల్డ్ కలర్ చారలు కలిగి ఉంటాయి. ఇవి కాటేస్తే.. చాలా భయంకరమైన విషం ఎక్కుతుంది. వామ్మో వింటుంటేనే.. చాలా భయమేస్తోంది కదూ..

స్నేక్ ఐలాండ్
ఈ రక్తపింజరి పాముల నుంచి రక్షణ కల్పించడానికి ఈ ప్రాంతానికి మనుషులకు ప్రవేశం లేకుండా.. బ్రెజిలియన్ నేవీ బ్యాన్ చేసింది.

పోవ్ గిలా, ఇటలీ
వెనీస్, లిడో ప్రాంతాల మధ్య నార్త్ ఇటలీలో ఉంది ఈ పోవ్ గిలా ఐలాండ్. ఈ ప్రాంతంలో రకరకాల వ్యాధులు, భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల ఇక్కడికి మనుషులకు ప్రవేశం లేకుండా నిషేధం విధించారు.

పోవ్ గిలా, ఇటలీ
కొన్ని అంచనాల ప్రకారం ఈ దీవుల్లో కొన్ని సంవత్సరాల నుంచి లక్ష మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఎవరైనా వెళ్లాలంటే భయపడుతున్నారు.



Click it and Unblock the Notifications