Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జీవితంలో.. ఎలాంటి పరిస్థితుల్లో, ఎప్పటికీ గొడవపడకూడని వ్యక్తులు..!!
మనుస్మ్రితిని లా ఆఫ్ మను అని కూడా పిలుస్తారు. ఇది హిందువుల న్యాయ పుస్తకం. దీన్ని ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. పూర్వకాలం.. జీవితం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను.. ఈ పుస్తకం ద్వారా తెలుసుకునేవాళ్లు.
మను బ్రహ్మదేవుడి మొదటి కుమారుడు. ఇతని ద్వారానే మానవజన్మ మొదలైంది. మనుశాస్త్రం ప్రకారం.. కొంతమంది వ్యక్తులతో ఎట్టిపరిస్థితుల్లో గొడవ పడకూడదు, పోట్లాడకూడదట. కొన్ని సందర్భాల్లో మనకు కోపం వచ్చిందంటే.. ఏమాత్రం ఆలోచించకుండా, ఎదుటి వ్యక్తి ఎవరు అనేది మరిచిపోయి మాట్లాడేస్తుంటాం.
అసలు మన జీవితంలో ఎలాంటి వ్యక్తులతో పోట్లాడకూడదు, వాదించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రాహ్మణులను
యాగాలు చేసే బ్రాహ్మణులను ఎట్టిపరిస్థితుల్లో దూషించకూడదు. వాళ్లతో వాదించడం, గొడవ పడటం వంటివి చేయకూడదు.

టీచర్
ఒకవేళ మీ టీచర్ మిమ్మల్ని తిడుతున్నా కూడా.. నవ్వుతూ స్వీకరించాలి. వాళ్లతో వాదించడం మంచిది కాదు.

అతిథులు
అతిథులను దేవుడితో సమానంగా భావిస్తారు. కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లో వాళ్లను అగౌరవపరచకండి.

అమ్మను
దేవుడు, గురువు కంటే కూడా.. తల్లి స్థాయి పెద్దది. ఒకవేళ అనుకోకుండా, తెలియకుండా.. మీ అమ్మ మిమ్మల్ని తిట్టినా, ఒక మాట అన్నా.. ఆమెపై రివర్స్ అవకూడదు. తిట్టకూడదు.

నాన్న
నాన్న ఎప్పుడు పిల్లల పెరుగుదలకు, ఎలాంటి సమస్య ఉన్నా.. సహాయపడటానికి, సలహా ఇవ్వడానికి గైడ్ లా వ్యవహరిస్తారు.

బంధువులు
బంధువులతో గొడవ పడటం వల్ల.. మీ తల్లితండ్రులపై గౌరవం తగ్గుతుంది. కాబట్టి.. బంధువులతో ఎట్టిపరిస్థితుల్లో గొడవపడకూడదు.

సోదరుడు
ఎలాంటి సందర్భంలోనైనా.. బ్రదర్.. ఎప్పుడూ మీకు సపోర్ట్ గా ఉంటాడు. బ్రదర్స్ ఎప్పుడూ.. మీ సంరక్షణ చూస్తుంటారు. వాళ్లు మీ తండ్రి ప్లేస్ ని రీప్లేస్ చేయగలుగుతారు.

సోదరి
అక్క, చెల్లి ఎవరైనా.. మీకు అన్ని రకాల విషయాల్లో గైడ్ లా ఉంటారు. తన గురించి తనకు బాధగా ఉన్నా.. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది. మీ సంతోషం కోరుకునే సోదరితో గొడవలు మంచిది కాదు.

కొడుకు
కొడుకులు ఎన్ని రిలేషన్స్ లో ఇరుక్కున్నా.. కుటుంబ బాధ్యతను తీసుకుంటారు. అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు. కాబట్టి.. వీళ్లతో ఎప్పుడూ పోట్లాడకూడదు.

కూతురు
పెళ్లి తర్వాత కూడా.. తమ పుట్టింటి మీద ఉన్న మమకారం.. వర్ణించలేనిది. కూతుళ్లను ఇంటికి లక్కీగా భావిస్తారు. అలాంటి వాళ్లను తిట్టడం, ఏడిపించడం మంచిది కాదు.

కోడలు
కోడలిని ఎప్పుడూ.. ఇంటికి కూతురిగానే భావించాలి. మీ కొడుకు కోసం తన పుట్టింటిని వదిలిపెట్టి వచ్చిందని గుర్తించాలి. కాబట్టి ఆమెను గౌరవించాలి కానీ.. ధూషించకూడదు.

పనివాళ్లను
మీ కోసం మీరు చేసుకోలేని పనులను చేసిపెడతారు సర్వెంట్స్. కాబట్టి వాళ్లను ఎట్టిపరిస్థితుల్లో అగౌరవపరచకండి. వాళ్లకు మీ రహస్యాలన్నీ తెలుసని గుర్తుంచుకోండి.

అల్లుడిని
కుటుంబంలో అల్లుడు ఎప్పుడూ గౌరవించబడుతూ ఉండాలి. ముఖ్యంగా..అత్తగారింట్లో.. అతని చాలా గౌరవం ఇవ్వాలి. అగౌరవపరచడం మంచిది కాదు.

భార్య
భార్యగా.. ఇంటి బాధ్యతలన్నింటినీ స్వీకరించి.. నిర్వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి.. ఆమెను ఎప్పుడూ.. సంతోష పెట్టాలి. సంతోషంగా ఉండేలా.. చూసుకోవాలి.

పెద్దవాళ్లను
వయసు పెరిగిన పెద్దవాళ్లపై కొంతమంది పదేపదే తిడుతూ, గొడవపడుతూ ఉంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. వాళ్ల వయసుకి తగ్గ గౌరవం ఇవ్వాలి. ఎట్టిపరిస్థితుల్లో వాదించకూడదు.



Click it and Unblock the Notifications