Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ రాశిని ప్రకారం మీరు దేనికి అడిక్ట్ అవుతారో తెలిస్తే షాక్ అవుతారు..!!
అడిక్షన్ అనేది.. మనం దూరంగా ఉండాలని భావించేది. అంటే.. ఒక దానికి అట్టే అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని భావిస్తాం. కానీ.. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకదానికి అడిక్ట్ అయి ఉంటారు. అయితే.. ఇలా ఏదో ఒకదానికి బాగా అడిక్ట్ అవడం వల్ల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు.. పెద్ద సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది.
మన మనస్తత్వాలకు, మనం పుట్టిన రాశులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే రాశులను బట్టి.. మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా కావచ్చు. అవి మన ప్రవర్తనను, మన భవిష్యత్ ని వివరిస్తాయి.

ప్రతి రాశిలోనూ మనకు సంబంధించినంతవరకు కొన్ని సమస్యలను తీసుకొస్తాయి. మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా కూడా ఉండవచ్చు. పర్సనాలిటీని బట్టి.. ప్రతి రాశుల వాళ్లకు కొన్ని రకాల అడిక్షన్స్ ఉంటాయట. ఒకవ్యక్తికి అతని రాశిని బట్టి.. అడిక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉన్న విషయం ఏంటో తెలుసుకుందాం..

మేషరాశి
మేషరాశి వాళ్లకు జీవితంలో ఎక్కువ చిరాకు తెచ్చే విషయం ఏంటంటే.. వీళ్లకు ఓర్పు చాలా తక్కువ. పోటీతత్వం కలిగి ఉంటారు. వీళ్ల పర్సనాలిటీని, రాశిని బట్టి వీళ్లు.. డ్రగ్స్ లేదా కొకైన్ వంటి వాటికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్లు జీవితం చాలా ఫాస్ట్ గా ముందుకు కదలాలని కోరుకుంటారు.

వృషభ రాశి
వృషభ రాశి రాశి వాళ్లకు చాలా ఓపిక, పట్టుదల ఉంటుంది. వీళ్లకు ఫుడ్ అంటే ఎక్కడలేని పిచ్చి. వీళ్లు ఆహారానికే అడిక్ట్ అవుతారు. వీళ్లు టేస్ట్, టచ్, స్మెల్ కి ఎట్రాక్ట్ అవుతారు.

మిధున రాశి
మిధున రాశి వాళ్లు.. వాళ్ల ఫీలింగ్స్ ని దూరంగా పెట్టాలనుకుంటారు. సిగరెట్స్ కి వీళ్లు.. అడిక్ట్ అవుతారు. అలాగే.. సోషల్ మీడియాకు కూడా బాగా ఎడిక్ట్ అయ్యే అవకాశాలుంటాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు.. బయటి ప్రపంచాన్ని పట్టించుకోరు. వీళ్లు చాలా సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు. దీనివల్ల పెయిన్ కిల్లర్స్ కి అడిక్ట్ అవుతారు. స్పర్శ రహిత మందులకు అలవాటు పడతారు.

సింహరాశి
సింహరాశి వాళ్లకు గర్వం చాలా ఎక్కువ. గారడిమాటలతో ఆకట్టుకుంటారు. థ్రిల్స్ పై ఉండే ఆసక్తి.. వాళ్లకు జీవితంలో లాభనష్టాలను తీసుకొస్తాయి. వీళ్లు షాపింగ్ అడిక్ట్ అవుతారు. అలాగే.. కార్డ్స్ ఆడే అలవాటు కూడా వీళ్లకు నష్టాలు తీసుకొస్తుంది.

కన్యారాశి
సేవ చేయడానికి కన్యారాశివాళ్లు ఇష్టపడతారు. వీళ్లు కేర్ టేకర్స్ గా వ్యవహరిస్తారు. ఎలాంటి సమస్యనైనా.. పరిష్కరించుకునే సత్తా ఉంటుంది. దీనివల్ల రిలాక్స్ అవడానికి సమయం ఉండదు. ప్రశాంతత పొందడానికి మత్తుమందులకు అలవాటు పడతారు.

తులారాశి
తులారాశి వాళ్లు బ్యాలెన్స్డ్ గా ఉండలేరు. దీంతో.. ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లు సెక్స్ కి లేదా ఎఫైర్స్ కి అడిక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వాళ్లు లక్కీ పర్సన్స్. వీళ్లకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, లక్ష్యాలు ఎక్కువ. అలాగే ధనస్సు రాశివాళ్లు కార్డ్ ఆడటానికి, ఆల్కహాల్ తీసుకోవడానికి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

మకర రాశి
మకర రాశి వాళ్లకు సమాజంలో స్టేటస్ ఉండటం వల్ల.. సమాజం అంగీకరించే చిన్న చిన్న వాటికి అడిక్ట్ అవుతారు. మకర రాశి వాళ్లు సమాజంలో గౌరవం కోల్పోకూడదనే ఉద్ధేశ్యంతో.. షాపింగ్ కి అడిక్ట్ అవుతారు. అలాగే పిల్స్ కి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. వీళ్లకు ఈటింగ్ డిజార్డర్ కూడా ఉంటుంది.

కుంభ రాశి
కుంభ రాశి వాళ్లకు వీడియో గేమ్స్, డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారు. రకరకాల డ్రగ్స్ పై అనుభవం పొందుతారు.

మీన రాశి
మీన రాశి వాళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్లు ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications