Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ ‘‘షూ’’ల విషయంలో ఈ వాస్తు చిట్కాలు పాటించకపోతే బ్యాడ్ లక్ వెంటాడటం ఖాయం..!!
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాదాలే వారి గమ్యాన్ని సూచిస్తాయంటారు. అలాగే వారు పాదాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోగలను మరియు కేర్ తీసుకోవడం మీదే వారి అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
సహజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మనిషి జీవితానికి సంబంధించిన ప్రతీ అంశానికి ఏదో ఒక గ్రహంతో సంబంధం ముడి పడి ఉంటుంది. మనం ధరించే పాదరక్షలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జ్యోతిషం ప్రకారం పాదరక్షలకు శనితో సంబంధం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అందుకే శనితో పీడింపబడుతున్న వారు పాదరక్షలను దానం చేయమని చెబుతుంటారు జోతిష్యులు. కొన్ని సందర్భాల్లో జీవితంలో కష్టాలు తీవ్రమవుతాయి. ఎన్ని పూజలు, శాంతులు చేయించినా దురదృష్టం వెంటాడుతుంది. దీనికి మన పాదరక్షలు కూడా కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పాదాలను ఆరోగ్యంగా ఉంచుకునేవారు చాలా అవకాశాలను పొందుతారు. మన పూర్వీకులు పాదరక్షల గురించి చాలా వివరాలను వెల్లడించారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాదాలే వారి గమ్యాన్ని సూచిస్తాయంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాదాలే వారి గమ్యాన్ని సూచిస్తాయంటారు. అలాగే వారు పాదాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోగలను మరియు కేర్ తీసుకోవడం మీదే వారి అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

రెండూ ఒకే సైజ్ లో సరైన పదారక్షలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
రెండూ ఒకే సైజ్ లో సరైన పదారక్షలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. దొంగిలించిన లేదా గిఫ్ట్‌గా పొందిన పాదరక్షలను ఎవరూ వేసుకోకూడదు. మీ లక్ష్యాలను చేరుకోవడంలో, కెరీర్ పురోగతిలో అవి మీకు ఏ రకంగానూ సాయపడవు. అంతే కాకుండా మీ లక్‌ను కూడా అవి వెనక్కి నెట్టివేస్తాయి. దురదృష్టంగా దారితీస్తుంది.

ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో
ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో చిరిగిన లేదంటే పాడైన స్థితిలో ఉన్న షూ ధరించకూడదు. అవి మీ అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చేస్తాయి. చిరిగిన షూ మీ సక్సెస్ ను అడ్డుకుంటుంది. మీ దగ్గర డబ్బులు లేకుంటే ఎవరి షూ అయినా అడిగి తీసుకెళ్లండి కానీ దొంగతనం మాత్రం చేయొద్దు.

ఆఫీస్‌కు బ్రౌన్ కలర్‌లో లేదా ఉడ్ కలర్ లో ఉండే షూ వేసుకెళ్లొద్దు.
ఆఫీస్‌కు బ్రౌన్ కలర్‌లో లేదా ఉడ్ కలర్ లో ఉండే షూ వేసుకెళ్లొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకుంటే అవి మనకు మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఆఫీస్‌కెళ్లేటప్పుడు బ్రౌన్ కలర్ షూ వేసుకెళ్లొద్దు.

ఎవరైతే బ్యాంకులు లేదా విద్యా సంస్థల్లో పని చేస్తారో..
ఎవరైతే బ్యాంకులు లేదా విద్యా సంస్థల్లో పని చేస్తారో..అలాంటి వారు కాఫీ కలర్ లేదా డార్క్ బ్రౌన్ కలర్ షూ వేసుకెళ్లడం మంచిది కాదు. ఇలాంటి షులు ధరించడం వల్ల పనిచేసే ప్రదేశాల్లో సమస్యలు తప్పవు. ఇలాంటి షూ మీ ఆదాయ మార్గాలపై ప్రభావం చూపుతాయట.

. వైట్ షు కారణంగా సంపద నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
వైద్యం రంగాల్లో లేదా మెడిసిన్ ఫీల్డ్ లో లేదా ఐరన్ సంబంధ రంగాల్లో పనిచే వారు తెలుపు రంగు షూలను అసలు ధరించకూడదు. అలా ధరిస్తే బ్యాడ్ లక్ వెంటాడుతుంది. వైట్ షు కారణంగా సంపద నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

నీటి సంబంధ లేదా ఆయుర్వేదిక రంగాల్లో పని చేసేవారు బ్లూ కలర్ షూలను ధరించకూడదు.
నీటి సంబంధ లేదా ఆయుర్వేదిక రంగాల్లో పని చేసేవారు బ్లూ కలర్ షూలను ధరించకూడదు. అలాగని క్లాత్‌తో తయారు చేసిన షూ వేసుకోవడం కూడా మంచిది కాదు. బ్లూ కలర్ షులు ఇటువంటి సందర్భాల్లో సూట్ అవ్వకపోవచ్చు.

ఆహారం తీసుకునేటప్పుడు షూ వేసుకుంటున్నారా?
ఆహారం తీసుకునేటప్పుడు షూ వేసుకుంటున్నారా? అయితే వెంటనే ఈ అలవాటును వదులకోండి. ఇది నెగటీవ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. బయటకెళ్లి తినాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు షూ విప్పేసి ఆహారం తీసుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో షూ రాక్ ఉంచడం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో షూ రాక్ ఉంచడం వాస్తు రీత్యా మంచిది కాదు. ఉదయాన్నే సూర్య కిరణాలు ముందుగా ఈ ప్రదేశంలో ప్రసరిస్తాయి. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే చోట కాకుండా మరో చోట షూను ఉంచాలి.

షూల గురించి కొన్ని నమ్మకాలు :
ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడివైపు మాత్రమే షూ విడిచిపెట్టాలి. ఒకవేళ మీ ఇల్లు తూర్పు లేదా ఈశాన్యం దిశలో ప్రవేశించేలా ఉంటే ప్రవేశ ద్వారానికి దగ్గర్లో షూ రాక్ ఉంచొద్దు.

షూల గురించి కొన్ని నమ్మకాలు :
ఎట్టి పరిస్థితిలోనూ షూను ఎప్పుడూ వేలాడదీయొద్దు. ఇంట్లోకానీ, బయటకానీ ఇలా షూలను హ్యాంగ్ చేయడం వల్ల మృత్యువు సంభవించే అవకాశంతోపాటు తీవ్రమైన దురదృష్టం వెంటాడే అవకాశం ఉంది. అంతే కాకుండా కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

షూల గురించి కొన్ని నమ్మకాలు :
అలాగే ఒక షూపైన మరో షూను కూడా ఉంచకూడదు. లేదా ఒకషూలో మరొకటి దూర్చి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తొలగించి అపాయానికి దారితీస్తుంది.

షూల గురించి కొన్ని నమ్మకాలు :
ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి పాదరక్షలను దానం చేయాలి లేదంటే పూడ్చి వేయాలి. అంతేకానీ వాటిని ఇంట్లో మాత్రం ఉంచొద్దు. అవి ఇంట్లో ఉండటం మంచి శకునం కాదు. ప్రొఫషనల్ గా కూడా వైఫల్యానికి దారితీస్తుంది. చెడుకు ఆహ్వానం పలిగికినట్లు అవుతుంది.

షూల గురించి కొన్ని నమ్మకాలు :
షూ కొత్తవైనా సరే వాటిని బెడ్ మీద, టేబుల్ మీద ఉంచొద్దు. కొద్దిసేపు కూడా అలా ఉంచొద్దు. అలాగే మంచం కింద కూడా షూను ఉంచొద్దు. వాటిని మంచం లేదా సోఫా పక్కన కానీ రాక్‌లోగానీ ఉంచాలి.

షూల గురించి కొన్ని నమ్మకాలు :
చెప్పులు దొంగిలించబడితే మంచి జరుగుతుందని మూడ నమ్మకం కూడా ఉంది?దేవాలయల దగ్గర చెప్పులు పోతే మంచిదని అంటారు. చర్మంతో తయారుచేసిన చెప్పులకు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే శని ప్రభావం చర్మం పైనా పాదాల పైనా ఎక్కువగా ఉంటుంది. చర్మంతో చేసిన పాదరక్షలు శని స్థానాలు . కనుక అటువంటి చెప్పులు దొంగిలించబడితే ఆ పోగొట్టుకున్న వ్యక్తి శని బాధల నుండి విముక్తుడై శుభాన్ని పొందుతాడని అంటారు. అందుకని చెప్పులు పోతే మంచిదన్న నమ్మకం ప్రజలలో ఏర్పడింది.

షూల గురించి కొన్ని నమ్మకాలు :
ఒక్కసారి పాదరక్షలతో ఇంట్లోకి వస్తే 4లక్షల21వేల జాతుల బ్యాక్టీరియాను ఇంట్లోకి తీసుకువస్తామట. చెప్పులతో పాటు ఇంట్లోకి వచ్చే ఈ బ్యాక్టీరియాలు అనేక వ్యాధులను కలుగుచేస్తాయట. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా జాతులు ఇంట్లోకి చేరి విరేచనాలు, వాంతులు, పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయట.
ముఖ్యంగా చిన్నారులు ఉన్న ఇంట్లోకి చెప్పులతో వస్తే.. అనేక రోగాలను తీసుకువచ్చినట్లే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాకిలి బయటే చెప్పులు వదిలి రావాలన్న మన పెద్దల మాటలో ఎంతో ముందుచూపు దాగి ఉందని అంగీకరించక తప్పదు. సంప్రదాయంగా కాకుండా శాస్త్రంగా చూస్తే.. మన పెద్దలు నేర్పిన అలవాట్లలోని మంచి తెలుస్తుంది.



Click it and Unblock the Notifications











