Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రొమాంటిక్ కపుల్ లైలా & మజ్నుల ప్రేమ కథ గురించి మీకు తెలియని 7 ఆసక్తికర రహస్యాలు
రొమాంటిక్ కపుల్ లైలా & మజ్నుల గురించి మీకు తెలియని 7 ఆసక్తికర రహస్యాలు...
మీరు బాలీవుడ్ తారల ప్రేమ జీవితం గురించి చదవటం మరియు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి శృంగార సినిమాలు చూసి ఉంటారు. కానీ మీకు చాలా ప్రసిద్ధమైన శృంగార జంట ప్రేమ కథ గురించి ఏమైనా తెలుసా?
నిజమైన ప్రేమ లేదా రొమాంటిక్ లవ్ కపుల్స్ గురించి మాట్లాడినప్పుడు లైలా & మజ్ను గురించి చెప్పుతూ ఉంటారు. వారు మరణించిన వారి ప్రేమ ఇప్పటికి సజీవంగా ఉంది. వారి ప్రేమ జ్ఞాపకంగా ఒక సమాధి ఇప్పటికీ బింజోర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఇది పాకిస్థాన్ సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్ సమీపంలో శ్రీ గంగానగర్ దగ్గర ఉంది. కార్గిల్ యుద్ధం ముందు పాకిస్తానీ సందర్శకులకు సందర్శించే అనుమతి ఉండేది. కానీ ఆ తర్వాత సరిహద్దును మూసివేశారు. ఈ రొమాంటిక్ లవ్ కపుల్స్ గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు...

లైలా,మజ్ను సృష్టించిన ఈ ప్రేమ
ఈ సమాదిని ప్రతి రోజు చాలా మంది సందర్శిస్తారు. లైలా,మజ్ను సృష్టించిన ఈ ప్రేమ కొంత మందికి హాస్యాస్పదముగా ఉంటుంది.

లైలా మరియు మజ్ను పాకిస్తాన్లో
అయితే లైలా మరియు మజ్ను లోతైన ప్రేమలో ఉన్నారు. ఈ ప్రేమ లైలా సోదరుడు మరియు తల్లిదండ్రుల, వారి కుటుంబం మద్దతు లేకపోవటంతో లైలా మరియు మజ్ను పాకిస్తాన్లో సింధ్ నుండి దూరంగా భారతదేశంలోని బింజోర్ కి వచ్చారు.

లైలా మజ్ను మరణం
వారి మరణానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంత మంది మజ్ను మరణం లైలా భర్త కారణంగా జరిగిందని చెప్పుతారు. దాంతో లైలా హార్ట్ అటాక్ తో మరణించిందని చెప్పుతారు.

లైలా మజ్ను కి మజార్, రాజస్థాన్
బింజోర్ ప్రజలు లైలా మరియు మజ్ను ఇద్దరిని ఖననం చేసిన ప్రదేశంలో వారి ప్రేమకు జ్ఞాపకార్ధంగా ఒక సమాధిని కట్టారు. ఈనాటికీ చాలా ప్రేమ జంటలు ఈ సమాధి దగ్గరకు వచ్చి వారి ప్రేమకు ఆశీస్సులను తీసుకుంటారు.

జాతి బేధం లేకుండా వస్తారు
హిందూ మతం, ముస్లిం మతం, సిక్కు, క్రిస్టియన్ వంటి అన్ని మతాల వివాహిత ప్రజలు ఈ సమాధి వద్దకు వచ్చి వారి తలలను వంచి నమస్కరిస్తారు.

జూన్ లో జరిగే ఉత్సవానికి వందల సంఖ్యలో కొత్త ప్రేమ జంటలు హాజరు అవుతారు.
కీవదంతి ప్రకారం, కొంత కాలం క్రితం వరకు ప్రతి రోజు పాకిస్తాన్ నుంచి వచ్చి చిరాగ్ వెలిగించి వెళ్ళిపోయేవారు. దీనికి గ్రామంలోని పాత తరం వారు సాక్ష్యంగా ఉన్నారు. జూన్ లో జరిగే ఉత్సవానికి వందల సంఖ్యలో కొత్త ప్రేమ జంటలు హాజరు అవుతారు.



Click it and Unblock the Notifications