2018లో మీ రాశి ప్రకారం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అదృష్టాలివే

Written By:
Subscribe to Boldsky

2018లో మీ రాశి ప్రకారం మిమ్మల్ని కొన్ని అదృష్టాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు 2017లో చాలా ఇబ్బందులకు గురై ఉంటారు. అయితే 2018లో మాత్రం మీ రాశి ప్రకారం ఇక్కడ ఇచ్చిన కొన్ని జాగ్రత్తలు పాటించి కీలక నిర్ణయాలు తీసుకోవడం చాలు.

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)

ఈ ఏడాదంతా మీరు చేసిన కొన్ని విషయాల్లో తప్పు చేసి దాన్ని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు. అయితే వచ్చే సంవత్సరంలో మాత్రం మీకు అలాంటి ఇబ్బందులేవి ఉండవు. మీకు అంతా మంచే జరుగుతుంది. మీ గురించి ఎవరైతే తక్కువ చేసి మాట్లాడి ఉంటారో వాళ్లే మళ్లీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపనలు కోరుతారు.

మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో మీ క్రియేటివిటీ మీరు బయటపెట్టడానికి చాలా ఇబ్బందులుపడి ఉంటారు. కానీ వచ్చే సంవత్సరం మాత్రం మీరు మీ క్రియేటివిటీని బయటపెట్టడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అయితే మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. దానివల్ల మీరు ఈజీగా మీలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది.

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)

మీకు 2017లో మొత్తం బ్యాడ్ టైమ్ నడిచి ఉంటుంది. 2018లో మీకు చాలా అవకాశాలు వస్తాయి. మీరు జాబ్ పరంగా కొన్ని చిక్కుల్లో చిక్కుకుని ఉంటారు. అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు అందుకు తగ్గట్లుగా హార్డ్ వర్క్ చేయాలి.

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

2018 నుంచి మీరు మీ జీవన శైలిని కాస్త మార్చుకోవాలి. మీరు కొన్ని రకాల కొత్త హాబీలను అలవర్చుకోవాలి. ఆరోగ్యానికి ఉత్తేజాన్ని ఇచ్చే పనుల్ని మీరు అలవాటు చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే మీకు వచ్చే అవకాశాలను సద్దినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.

మిథునరాశి (మే 21-జూన్ 20)

మిథునరాశి (మే 21-జూన్ 20)

2017 లో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఉంటారు. కానీ అవన్నీ అమలు చేయలేకపోయి ఉంటారు. అయితే మీరు 2018లో వాటన్నింటిని అమలు చేసేందుకు మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా సహనంతో ముందుకెళ్లండి. మీరు 2018లో చాలా విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (జూన్ 21- జూలై 22)

కర్కాటకం (జూన్ 21- జూలై 22)

మీరు మీ జీవన విధానంలో కొన్ని రకాల మార్పుల చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ కుటుంబానికి కాస్త ప్రాధాన్యం ఇవ్వాలి. మీ ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. లేదంటే చాలా ఇబ్బందులుపడతారు.

సింహరాశి (జూలై 23- ఆగస్టు 22)

సింహరాశి (జూలై 23- ఆగస్టు 22)

2018లో మీకు తిరుగులేదు. మీరు సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. మీరు మీ రంగాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైన ధైర్యంగా ముందడుగు వేయండి.

కన్య (ఆగష్టు 23- సెప్టెంబర్ 22)

కన్య (ఆగష్టు 23- సెప్టెంబర్ 22)

మీరు 2017లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో మీరు మళ్లీ కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వాటిని అధిగమించే విషయంలో మీరు వెనుకడుగు వేయండి. మీరు ప్రతి ధైర్యంగా ముందుకెళ్లగలగాలి.

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 22)

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 22)

2018 లో మీరు కొన్ని నిర్ణయాలు చాలా స్పీడ్ గా తీసుకోవాలి. అలాగే మీరు సామాజికంగా కొన్ని రకాల సేవలు చేయాలని భావిస్తారు. అయితే మీరు ప్రతి విషయంలో కూడా భయపడకుండా ముందుకెళ్లగలగాలి. అప్పుడే మీరు విజయబాటలో నడుస్తారు.

వృశ్చికం (అక్టోబర్ 23- నవంబర్ 21)

వృశ్చికం (అక్టోబర్ 23- నవంబర్ 21)

మీకు కొన్ని రకాల బంధాలు ఏర్పడతాయి. మీరు ఎవరైన వ్యక్తి ప్రేమలో పడడమో లేదంటే కొత్త వ్యక్తులతో స్నేహం బంధం ఏర్పడడమో జరుగుతుంది. అయితే మీరు ప్రతి విషయంలో నిజాయితీగా ఉండడండి. మీ గురించి మీరు మీ కొత్త ఫ్రెండ్స్ తో ఏమి దాచి పెట్టాల్సిన పని లేదు. అలా చేయడం వల్ల వారికి మీపై ఎక్కువగా గౌరవం ఏర్పడుతుంది.

ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21)

ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21)

2017 లో మీరు మీకు సంబంధించిన కొన్ని విషయాల్లో ఇబ్బంది పడి ఉంటారు. మీ మనస్సులో ఉన్న మాటను ఇతరులకు చెప్పడంలో కూడా మీరు చాలా ఇబ్బందులకు గురై ఉంటారు. 2018 లో మాత్రం మీరు చాలా విషయాల్లో విజయాలు చూస్తారు. అలాగే కొన్ని ఊహించని పరిణామాలు మీరు ఎదుర్కొంటారు.

మకరం (డిసెంబర్ 22- జనవరి 19)

మకరం (డిసెంబర్ 22- జనవరి 19)

2018 లో మీరు మీ బాధ్యతలను మరిం సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుంది. మీ సామాజిక, వ్యక్తిగత జీవితాల్లో మీరు చురుకుగా ఉండాలి. మీ చుట్టు పక్కల ఉండే వారి విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి.

English summary

dont miss opportunities 2018 based zodiac sign

dont miss opportunities 2018 based zodiac sign
Story first published: Wednesday, December 27, 2017, 17:00 [IST]