Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ప్రపంచంలోనే పొట్టి మహిళ గురించి నమ్మలేని నిజాలు!
మనలో ఉన్న లోపాలను మరియు వైఫల్యాలు స్వీకరించడం ద్వారా అవి అత్యంత పెద్ద శక్తిగా మారుతాయి అనే విషయాన్ని ఈ ప్రపంచంలోని కొంతమంది వ్యక్తులు ఈ ప్రపంచానికే తెలియజేస్తారు. ఇలాంటి ఒక ప్రేరణ కలిగించే వ్యక్తులలో జ్యోతి ఆంగ్ కూడా ఒకరు. ఈమె ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచింది. మొత్తం ప్రపంచంలోనే ఈమె అత్యంత పొట్టి మహిళ. తన యొక్క బలహీనతనే ఆమె బలంగా మార్చుకుంది జ్యోతి ఆంగ్.
కొన్ని వర్గాల దగ్గర నుండి అందిన సమాచారం ప్రకారం ఆమె యొక్క ఎత్తు రెండు అడుగులు, బరువు దాదాపు 5.5 కె.జీ లు మాత్రమే ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. వాటి గురించి వివరంగా క్రింద చెప్పబడినది....

ఆమె ఎత్తు అస్సలు పెరగలేదు.
జ్యోతి ఎత్తు 62.8 సెంటీమీటర్లు అంటే దాదాపు 2 అడుగులకు కొద్దిగా ఎక్కువ, బరువు ఐదున్నర కె.జీ లు మాత్రమే. ఈమె పుట్టినప్పటి నుండి చాలా కొద్ది బరువు మాత్రమే పెరిగింది. ఇందుకు కారణం ఆమెకు ఉన్న ఒక ఆరోగ్య సమస్య. దాని పేరే ' ఆచోన్డ్రోప్లేసియా ( ఎముకలందలి తరుణాస్థి ఎదుగుదలలోపమువల్ల కలిగిన మరుగుజ్జుతనము ) ' . దీని వల్ల శరీరం ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అందుచేతనే ఈమెలో ఎదుగుదల పూర్తిగా లోపించింది.

ఈమె ఈ స్థితి తో బాధపడుతోంది అనే విషయం ఆమెకు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు తెలీదు.
ఎప్పుడైతే జ్యోతికి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిందో ఆ సమయంలో ఈమె అరుదైన ఎముకలకు సంబంధించి ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతోంది అనే విషయాన్ని కుటుంబం గుర్తించింది. వెంటనే ఒక నిపుణుడైన వైద్యుడ్ని జ్యోతి కుటుంబం సంప్రదించడం జరిగింది. కానీ, డాక్టర్ విస్తుపోయే నిజాన్ని బయటపెట్టాడు. ఆమె జీవితాంతం ఇక ఎప్పటికి ఎత్తు పెరగదు అనే నిజాన్ని చెప్పేశారు.

ఆమె స్థితి ఆలా ఉన్నప్పటికీ కూడా సాధారణ పిల్లలాగానే ఆమెతో అందరూ ప్రవర్తించాలని కోరుకుంటుంది.
ఈమె యుక్తవయస్సులో ఉన్నప్పుడు నాగపూర్ లో ఒక పాఠశాలకు వెళ్ళేది. ఈమె గురించి ఆ పాఠశాలలో ఒక చిన్న బల్ల మరియు కూర్చు ఉండేది. ఆమె తన జీవితానంతా సాధారణ పిల్లలు లాగానే ఆనందంగా గడిపారు. ఒక ప్రత్యేకమైన చిన్న పిల్లగా చూడటానికి జ్యోతి అస్సలు ఇష్టపడేవారు కాదు.

సాధారణ జీవితం గడపటానికి ఆమె చుట్టూ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మార్పు చేయడం జరిగింది.
ఆమె పాఠశాలలో కూర్చొనే బల్ల మరియు కుర్చీ దగ్గర నుండి దుస్తులు మరియు బంగారం ఇలా ప్రతి ఒక్క దానిని ఆమెకు తగ్గట్టుగా తయారుచేయడం జరిగింది. ఆమె వాడే ప్లేట్లు, వస్తువులు, పరుపు మరియు ఇతర నిత్యావసర అవసరాలన్నింటికీ సంబంధించిన వాటిని ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.

అత్యంత పొట్టి మహిళగా ప్రకటించారు.
ఆమె యొక్క 18 వ పుట్టినరోజు సందర్భంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు వారు అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అనే విషయాన్ని 2011 లో ప్రకటించారు. కొన్ని వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఇంతకుముందు ఇదే రికార్డు సృష్టించిన అమెరికా కు చెందిన బ్రిడ్జెట్టే జోర్డాన్ కంటే కూడా ఈమె 6.7 సెంటీమీటర్ల ఎత్తు తక్కువగా ఉంది.

ఆమెలో ఉన్న లోపం ఆమె ఎదగడానికి అడ్డంకిగా మారలేదు.
ఎదో ఒకరోజు తానూ ఒక గొప్ప బాలీవుడ్ హీరోయిన్ అవ్వాలని కలలు కనేది. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ ఈమె అనే బిరుదు దక్కించుకున్న తర్వాత బాలీవుడ్ లో నటనాప్రస్థానం వైపు తన దృష్టిని మరల్చింది. బాలీవుడ్ నటులలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మరియు అమితా బచ్చన్ లు అంటే ఈమెకు ఎంతో ఇష్టం.
ఈమెకు తన జీవితంలో అంతా మంచి జరగాలని ఆశిద్దాం.



Click it and Unblock the Notifications