2018లో మీ భార్య, గర్ల్ ఫ్రెండ్ మీతో ఇలా మెలుగుతారు

Written By:
Subscribe to Boldsky
2018లో మీ భార్య, గర్ల్ ఫ్రెండ్.. మీతో ఇలా మెలుగుతారు..

మీ రాశి ప్రకారం 2018లో మీరు మీ జీవిత భాగస్వామి(భార్య లేదా భర్త) తో లేదా మీ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఉంటారనే విషయాలను తెలుసుకోవొచ్చు. మీ భార్యతో 2017లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ మీ ప్రేమను అంగీకరించకపోయి ఉండొచ్చు. 2018లో కూడా ఇలాంటి ఇబ్బందులనే మీరు అనుభవించనున్నారా లేదంటే మీరు కోరుకున్న అమ్మాయితో ఆనందంగా ఉండనున్నారా అనే విషయాల్ని తెలుసుకోండి.

మేషం

మేషం

2018లో మీరు మీ జీవిత భాగస్వామి(భార్య లేదా భర్త) తో మీరు ఆనందంగా ఉంటారు. ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ తో 2018లో సంతోషంగా ఉంటారు. అయితే అప్పుడప్పడు మీ పార్టనర్ తో చిన్నచిన్న సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ విషయంలో మీరు తొందరపడి మాట జారకండి. ఎలాంటి తగదాలు పెట్టుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో చిన్నగా మొదలయ్యే గొడవలే తర్వాత పెద్దగా మారే అవకాశం ఉంది.

వృషభం

వృషభం

2018 మీకు చాలా సంతోషాలు తీసుకురానుంది. మీరు మీ భాగస్వామిని ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత మంచిది. అయితే 2018 ప్రారంభంలో మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవొచ్చు. తర్వాత మీ సంసారపరంగా ఎలాంటి ఇబ్బందులుండవు. అలాగే పెళ్లికాని వారు గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. మీలో కాస్త మొండిగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. అయితే దాన్ని మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ దగ్గర చూపించకండి. అలా చేస్తే వారి ప్రేమకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది.

మిథునం

మిథునం

2018లో మీ భార్య మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఆమెతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక పెళ్లి కానీ వారికి వారు కోరుకున్న అమ్మాయితో పెళ్లి అయ్యే అవకాశం ఉంది. మీరు 2017లో మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యతో కాస్త ఇబ్బందులుపడి ఉండొచ్చు. కానీ 2018 మాత్రం మీరు సంతోషంగా ఉంటారు.

కర్కాటకం

కర్కాటకం

2017లో మీరు మీ భాగస్వామితో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో మాత్రం మొత్తం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీకు నచ్చినట్లుగానే మీ జీవిత భాగస్వామి వ్యవహరిస్తుంది. అంతేకాదు మీ భార్య మీరు కోరుకుంటున్న చాలా కోరికల్ని త్వరలో నెరవేర్చనుంది. 2018లో మీ భాగస్వామి ద్వారా చాలా ఆనందం పొందుతారు.

సింహరాశి

సింహరాశి

2018లో మీ ప్రేమ విజయవంతం కానుంది. మీరు ఎన్నో రోజులుగా ప్రేమించిన అమ్మాయి మీ ప్రేమను అంగీకరిస్తుంది. ఇక గర్ల్ ఫ్రెండ్ లేని వారికి చాలా మంది అమ్మాయిలు పరిచయం అవుతారు. అందులో తమ జీవితభాగస్వామిగా ఎవరినీ సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో మీరు కాస్త ఇబ్బందిపడతారు. వివాహం చేసుకున్న వారు భార్యతో ఆనందంగా ఉంటారు. బంధువులు కూడా మీ కాపురాన్ని చూసి మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు.

కన్య

కన్య

2018 మీ వైవాహిక జీవితం అంత బాగుండదు. మీకు కొన్ని కష్టాలు వస్తాయి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి కొన్ని విషయాల్లో మీతో వాదించవచ్చు. దీంతో మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. చికాకుపడుతారు. అయితే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తే మాత్రం ఎలాంటి సమస్యలుండవు.

తుల

తుల

2018 మీకు చాలా అదృష్టాలను తీసుకొస్తుంది. మీరు ఇష్టపడే అమ్మాయితోనే మీ వివాహం త్వరలో జరుగుతుంది. ఒకవేళ అమ్మాయి కోసం వెతుకుతున్నట్లయితే మీరు అర్థం చేసుకునే మంచి అమ్మాయి మీకు దొరుకుతుంది. 2018 మొత్తం మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం

పెళ్లికాని వారు 2018లో చాలా ఆనందంగా ఉంటారు. మీరు కోరుకున్న అమ్మాయి మీకు దక్కుతుంది. ఆమెతో మీరు రోజూ ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తారు. పార్టీలకు వెళ్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 2018లో ప్రతి క్షణం మీ లవర్ తో హ్యాపీగా గడుపుతారు. అయితే మీరు ఒక్కోసారి హద్దులు దాటే క్షణాలు కూడా వస్తాయి. ఆ టైంలో కంట్రోల్ లో ఉండండి. ఇక పెళ్లయిన వారు వారి భాగస్వామి తో ఆనందంగా ఉంటారు.

ధనుస్సు

ధనుస్సు

2018లో మీ భార్య మీకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. మీరు చెప్పినట్లుగా వింటుంది. మీకు సంసారపరంగా ఎలాంటి ఇబ్బందులుండవు. ఒకవేళ మీకు పెళ్లికానట్లయితే మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి మీకు త్వరలో భార్యగా రానుంది.

మకరం

మకరం

2017 లో మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాస్త నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. కానీ 2018లో మాత్రం ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుంది.

2018లో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో చాలా సంతోషంగా ఉంటారు. మీరిద్దరూ కలిసి త్వరలోనే డేటింగ్ స్టార్ట్ చేస్తారు. పెళ్లయిన వారు సంసారపరంగా సంతోషంగా ఉంటారు.

కుంభం

కుంభం

2017 లో మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో మీరు చాలా ఇబ్బందులుపడి ఉంటారు. అయితే 2018లో మాత్రం మీరు కొన్ని రోజులు మీ భార్యతో ఇబ్బందులుపడే అవకాశం ఉన్నా తర్వాత నుంచి అంతా మంచే జరుగుతుంది. మీ భాగస్వామి మీపై నమ్మకం పెంచుకుంటుంది. మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది.

మీనం

మీనం

మీరు 2017 లో మానసిక క్షోభను అనుభవించి ఉంటారు. అయితే 2018లో మాత్రం అలాంటి ఇబ్బందులేవి ఉండవు. మీ ప్రేమను మీ భార్య అర్థం చేసుకుంటుంది. మీకు ఎలాంటి సమస్యలు రావు. మీరు ప్రేమించిన అమ్మాయితో మీకు వివాహం జరుగుతుంది. మీ భార్య మీకు అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకోగలదు.

English summary

Love horoscope 2018

Love horoscope 2018
Story first published: Tuesday, January 2, 2018, 11:30 [IST]