For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారెవ్వా.. వెజైనా (యోని) స్మెల్ పర్‌ఫ్యూమట

By Bharath Reddy
|

పర్‌ఫ్యూమ్‌ ప్రతి ఒక్కరికీ నచ్చే స్మెల్. ప్రతి రోజూ ఆఫీస్ కు వెళ్లేముందు ఒక్క రౌండ్ బాడీపై దాన్ని అలా కొట్టేవాళ్లు చాలామందే ఉంటారు. వీటి వాడకంలో యువత ఎక్కువగా ముందు ఉంటారు. అయితే వీటిలోనూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఓహో.. అవి మాకు తెలుసనుకుంటే పొరపాటే.

మీరు చూడని ఫ్లేవర్స్ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కొన్ని రకాల స్మెల్స్ వచ్చే పర్‌ఫ్యూమ్స్ కోసం కొందరు పడి చస్తారంట మరి. మార్కెట్లో వాటికి గిరాకీ కూడా భలే ఉందండీ.

<strong>అమ్మాయిలను ఆ ఒక్కటీ అడక్కండి..చచ్చినా..ఆ సీక్రెట్ మాత్రం రివీల్ చెయ్యరు..!</strong>అమ్మాయిలను ఆ ఒక్కటీ అడక్కండి..చచ్చినా..ఆ సీక్రెట్ మాత్రం రివీల్ చెయ్యరు..!

తీవ్ర దుర్వాసన అంటే డంపింగ్ యార్డ్ వద్ద వస్తుందే అలా వాసన ఉండే పర్‌ఫ్యూమ్స్, పాప్ కార్న్ లాంటి స్మెల్ వచ్చే సెంట్స్, వెజైనా నుంచి వెలువడే వాసనలా ఉండే పర్‌ఫ్యూమ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి.

వీటిని కొని బాడీపై స్ప్రే చేసుకుని ఆనందించే వారు చాలామందే ఉన్నారు. కొందరికి ఇవి అంటే భలే ఇష్టమట. అలాగే మీకు ఇష్టమైన జంక్ ఫుడ్ స్మెల్ తో ఉన్న పర్‌ఫ్యూమ్స్ , తదితర రకాల సెంట్స్ కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి అవి ఏమిటో ఓ లుక్కేద్దామా.

పొగాకు పర్‌ఫ్యూమ్‌

పొగాకు పర్‌ఫ్యూమ్‌

ప్రపంచంలోని పొగాకు ప్రేమికుల కోసం ఈ పర్‌ఫ్యూమ్ ని ప్రవేశపెట్టింది ఓ కంపెనీ. కొన్ని ఏళ్ల క్రితం ఒక సంస్థ దీన్ని పరిచయం చేసింది. ఈ టొబాకో పెర్ఫ్యూమ్ కోసం ముందస్తు ఆర్డర్ చేసేవాళ్లు చాలామందే ఉన్నారు.

లోబ్ట్సర్

లోబ్ట్సర్

ఎండ్రకాయల వాసనను ఎవరైనా ఆస్వాదిస్తారా? ఒంటినిండా దాన్ని స్మెల్ వచ్చేలా ఎవరైనా పూసుకుంటారా. అయితే కొందరు మాత్రం కాల్చిన ఎండ్రకాయలు వాసన అంటే పడి చస్తారంట. అలాంటి వారు చాలామంది ఉన్నారు. దీంతో ఒక సంస్థ ఎండ్రకాయ పర్‌ఫ్యూమ్‌ ను ప్రవేశపెట్టింది. ఈ పర్‌ఫ్యూమ్‌ మాంసం, సముద్రపు నీరు, వెన్నలతో తయారు చేస్తారు.

వజీనా స్మెల్

వజీనా స్మెల్

వజీనా నుంచి వెలువడే స్మెల్ ను కూడా కొందరు బాగా ఇష్టపడతారంట. అలాంటి వారికోసమే ఆ రకం వాసన వచ్చే పర్‌ఫ్యూమ్‌ మార్కెట్లోకి వచ్చింది. అయితే దీన్ని ఉపయోగించే వాళ్లు కూడా చాలమందే ఉన్నారు. ఈ పర్‌ఫ్యూమ్స్ కు సంబంధించిన ఒక కంపెనీ ఒక సంవత్సరంలో 1000 కంటే ఎక్కువ పర్‌ఫ్యూమ్స్ ను అమ్ముతుందట. ఇలాంటి జనాలు కూడా ఉన్నారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

కుళ్లిపోయిన కూరగాయల వాసన

కుళ్లిపోయిన కూరగాయల వాసన

వజీనా నుంచి వచ్చే వాసనాల్లంటి పర్ ఫ్యూమ్ లు వాడడమే గొప్ప అనుకుంటూ ఇలా కుళ్లిపోయిన కూరగాయాల నుంచి వచ్చే వాసనల్ని కూడా ఆస్వాదించే వారు ఉన్నారంట. ఇది నిజంగా షాకింగే కదా.

ఒక పెర్ఫ్యూమ్ బ్రాండ్ కంపెనీ ఈ రకం వాటిని ప్రవేశపెట్టింది. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందంట.

పాప్ కార్న్

పాప్ కార్న్

పాప్ కార్న్ ను తింటూ థియేటర్లలో సినిమాలు చూడడం అనేది సాధారణం. ఇది ప్రతి ఒక్కరికీ ఇష్టమే. మరి మీరేప్పుడన్నా పాప్ కార్న్ కాల్చేటప్పడు వచ్చే స్మెల్ ఉంటుంది కదా దాన్ని ఇష్టపడ్డారా? చాలామందికి అంత ఇష్టంగా లేకపోవచ్చు. కానీ ఆ వాసన అంటే పడి చచ్చే వాళ్లు ఉన్నారండోయ్. అందుకోసమే ఒక పెర్ఫ్యూమ్ బ్రాండ్ కంపెనీ ఈ పాప్ కార్న్ పర్ ఫ్యూమ్ ను ప్రవేశపెట్టింది. అదోరకంగా ఉడే ఈ స్మెల్ అంటే చాలామందికి ఇష్టమట.

<strong>ఫర్ఫ్యూమ్స్ వాడటం వల్ల తలనొప్పి, ఆస్త్మా మరియు మైగ్రేన్ సమస్యలు వస్తాయా?</strong>ఫర్ఫ్యూమ్స్ వాడటం వల్ల తలనొప్పి, ఆస్త్మా మరియు మైగ్రేన్ సమస్యలు వస్తాయా?

కాఫీ

కాఫీ

కాఫీ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కాఫీ స్మెల్ కూడా బాగా వస్తుంది కాబట్టి దీన్ని కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకోసమే ఈ రకం వాసన గల పెర్ఫ్యూమ్స్ మార్కెట్లో బాగా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రేమికుల కోసం కాఫీ బ్రాండ్ కంపెనీ అయిన ఎస్ప్రెస్సో ప్రత్యేకంగా కొన్ని కాఫీ పర్‌ఫ్యూమ్స్ ప్రవేశపెట్టింది.

శ్మశానం నుంచి వచ్చే వాసన

శ్మశానం నుంచి వచ్చే వాసన

ఒక్కొక్కరికి ఒక్కో వాసన అంటే ఇష్టం. అలాగే కొందరికీ శ్మశానాల నుంచి వెలువడే వాసన అంటే ఇష్టం. ఇలాంటి వారి కోసమే ఫ్యునరల్ హోమ్ అనే పర్‌ఫ్యూమ్ మార్కెట్లో లభిస్తుంది. ఇది పలు రకాల తెల్ల పువ్వులు, లిల్లీ పువ్వులు వంటి వాసన వెదజల్లుతుంది.

అయితే ఈ పర్‌ఫ్యూమ్ సంస్థ ఇదే వాసన వెదజల్లే సెంట్స్ తో పాటు లోషన్, షవర్ జెల్, సబ్బులను కూడా ప్రవేశపెట్టింది.

పేషెంట్ పర్‌ఫ్యూమ్

పేషెంట్ పర్‌ఫ్యూమ్

మీరు ఎప్పడైనా పేషెంట్ దగ్గర ఉండే వాసన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా అయితే మీరు వోడ్ పర్‌ఫ్యూమ్ వాడాల్సిందే. వోడ్ పెర్ఫ్యూమ్ ఉపయోగించారునుకో మీ పక్కనే పేషెంట్ ఉన్నట్లు ఉంటుంది. అలా ఉంటుంది ఆ వాసన. ఇది పెయింట్ వాసన కలిగి ఉంటుంది. ఈ పర్‌ఫ్యూమ్ రంగు కోబాల్ట్ నీలంలో ఉంటుంది. మీకూ ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేయండి మరి.

బర్గర్

బర్గర్

బర్గర్ అంటే కొందరికి పిచ్చి. అయితే బర్గర్ పర్‌ఫ్యూమ్ మీరు కొట్టుకుని బయటికి వెళ్లారనుకో మీ దగ్గర బర్గర్ ఉందని మీ పక్క వారు అనుకుంటారు. అలా ఉంటుంది మరి దాని వాసన. శాకాహారులు ఈ పర్‌ఫ్యూమ్ కు దూరంగా ఉండాలి. ఈ పర్‌ఫ్యూమ్ కూ మంచి గిరాకీ ఉంది మార్కెట్లో.

క్యానబీస్

క్యానబీస్

క్యానబీస్ ను చాలామది ఇష్టపడతారు. అయితే ఈ రకం పర్‌ఫ్యూమ్ చాక్లెట్, కస్తూరి, వనిల్లా వంటి వాటితో తయారవుతుంది. కలుపు మొక్కల నుంచి వాసల్ని ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. అలాంటి వారు ఈ పర్‌ఫ్యూమ్ ను ఉపయోగించి ఆనందించవచ్చు.

English summary

Perfumes Made From The Weirdest Ingredients

These are the weirdest smelling perfumes that people have made.
Story first published:Friday, October 27, 2017, 17:20 [IST]
Desktop Bottom Promotion