For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నమ్మాల్సిందే...గోర్ల ఆకారం బట్టి ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారో చెప్పేయొచ్చు...

By R Vishnu Vardhan Reddy
|

ప్రపంచం లో ప్రతి మనిషికి ఎదుటి వ్యక్తి లో మొదట కనిపించేది బాహ్య సౌందర్యమే. మనం మరొక వ్యక్తి తో మాట్లాడుతున్నప్పుడు , ఆ ఎదుటి వ్యక్తి మొహం, కళ్ళు, ఆ వ్యక్తి ఎత్తు ఇలా ఆ మనిషి లో అనేకే భౌతిక లక్షణాలు మన కంటికి కనపడతాయి. వీటన్నింటిని కలిపి మన మెదడు ఆ వ్యక్తి యొక్క ఆకారాన్ని నిక్షిప్తం చేనుకుంటుంది. చాలా మంది, ఎదుటి వ్యక్తి లో కనపడినా పట్టించుకోని అంశం, ఏముందిలే అనే ధోరణి తో వదిలేసే ముఖ్యమైన విషయం ఆ వ్యక్తి యొక్క గోర్లు. కనిపించి కనిపించినట్లు మన కళ్ళు ముందు దోబూచులాడే ఎదుటి వ్యక్తి గోర్లను సరిగ్గా గమనించడం ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, స్వభావము ఇలా చాలానే తెలుసు కోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

రాశి భవిష్యం: మీ అదృష్ట సంఖ్య మీ వ్యక్తిత్వాన్ని ఎలా రివీల్ చేస్తుందో చూడండి..?రాశి భవిష్యం: మీ అదృష్ట సంఖ్య మీ వ్యక్తిత్వాన్ని ఎలా రివీల్ చేస్తుందో చూడండి..?

జపాన్ దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం, మనుషులకు ఉన్న వివిధ గోర్ల ఆకారాన్ని బట్టి, వారిని ఎలా అంచనా వేసుకోవాలి అనే విషయం పై పరిశోధనలు జరిపింది. వీళ్ళ పరిశోధన లో ఆశక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని గోర్ల ఆకారం బట్టి ఇట్టే తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

నిటారుగా ఉన్న పొడవైన గోర్లు :

నిటారుగా ఉన్న పొడవైన గోర్లు :

ఇలాంటి గోర్లు కలిగిన వ్యక్తుల్లో, నిగ్రహం కాస్త తక్కువగా ఉంటుంది. శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారు. వీళ్లకు కుడి వైపు మెదడు బాగా అభివృద్ధి చెంది మంచిగా పనిచేస్తుంది. ఎక్కువగా ఊహాజనిత ప్రపంచం లో బ్రతుకుతుంటారు. ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉండి ఎప్పుడూ కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ చుట్టూ ఉన్న పరిసరాలను అంచనా వేయడం లో పొరపాటు పడి మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించామని చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి తో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు, అతనిని సరిగ్గా అర్ధం చేసుకోవడం లో విఫలమై పరిష్కారమార్గం లో ప్రయాణించకుండా, భేదాభిప్రాయాలతో వెనుదిరిగే ఆష్కారాలు ఎక్కువ. కుడి వైపు మెదడు పని చేసినంత బాగా ఎడమ వైపు మెదడు పని చేయదు.

వెడల్పుగా పెరిగిన గోర్లు :

వెడల్పుగా పెరిగిన గోర్లు :

నిగ్రహం చాల తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం నడుస్తున్న అడుగుజాడల్లో నడవకుండా, తానూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. వీళ్ళులో ఎడమ వైపు మెదడు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. చాలా అనర్గళం గా మాట్లాడగలరు. వాళ్ళ మనస్సు లో అనుకున్న విషయాన్ని ఎదుటి వారికి స్పష్టం గా చెప్పగలరు. ఈ లక్షణాలన్నీ చూసి ముక్కు సూటిగా, అనుకున్నది ఖచ్చితం గా, నిఖచ్చిగా మీరు చెప్పగలరని ఎదుటి వ్యక్తులు భావిస్తారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలను వినడానికి ఇష్టపడరు. నిగ్రహం చాల తక్కువ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు తమకు తాము సర్ది చెప్పుకొని సమస్యలకు దూరం గా ఉండాలి. ఈ స్వభావము ఉన్న వ్యక్తులు భావోద్వేగ వ్యక్తులతో అంత సులువుగా కలవలేరు.

మీ భర్త చేతులు అతని పర్సనాలిటి గురించి ఏం తెలుపుతాయి..మీ భర్త చేతులు అతని పర్సనాలిటి గురించి ఏం తెలుపుతాయి..

గుండ్రటి లేదా గుడ్డు ఆకారం లో గోర్లు ఉంటే:

గుండ్రటి లేదా గుడ్డు ఆకారం లో గోర్లు ఉంటే:

ఇలాంటి వాళ్ళు చాల ప్రశాంత స్వభావం కలిగి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఏ విషయాన్నీ దృఢ నిశ్చయంతో, ఖచ్చితం గా చేయాలి అనే తలంపుతో పని చేయరు. వాళ్లకు నచ్చిన విధం గా, ఆనందంగా, వాళ్లకు ఎప్పుడు తోస్తే అప్పుడు హాయిగా పనులు చేసుకుందామని భావిస్తుంటారు. చాల స్నేహ శీలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా గొడవ పడితే మొదట వెళ్లి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ వ్యక్తిత్వాన్ని చాల మంది ఇష్టపడతారు, కానీ స్వభావరీత్యా ఆయా వ్యక్తులుకున్న మొదట చెప్పిన లక్షణాలు చూసి స్నేహితులు దగ్గర నమ్మకం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబ్బట్టి కొద్దిగా జాగ్రత్త వహించి పనులను కాస్త త్వరగా చేస్తే మంచిది. మిగతా అందరికంటే, వీళ్ళు అన్ని స్వభావము ఉన్న వ్యక్తుతో బాగా కలిసిపోతారు.

చతురస్ర (స్క్వేర్) ఆకారం లో గోర్లు ఉంటే :

చతురస్ర (స్క్వేర్) ఆకారం లో గోర్లు ఉంటే :

వీళ్ళ కొద్దిగా గభీరంగా ఉండి, భావోద్వేకానికి తావు లేకుండా, ఆచరణాత్మక ధోరణితో నిజమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తుల్లో పట్టుదలతో పాటు ఏ పనినైనా చేయగల దమ్ము కూడా ఉంటుంది. చాలా మంది పురుషులు ఈ కోవలోకే చెందుతారు. ఇలాంటి వైఖరి మంచిదై ఉండొచ్చు కానీ, సూక్ష్మబుద్ధి గల నాయకత్వం తో పాటు సమయానికి తగినట్లు తలొగ్గకపోవటం వల్ల, వీళ్లకు ఎదో లోపం ఉంది అని ఎదుట వ్యక్తుల మనస్సు లో గోచరిస్తుంది. అంటే చందమామ పై మచ్చ ఉన్నట్లు. ఇలాంటి వ్యక్తులు కొద్దిగ పట్టు విడుపులకు పోయి సమయానికి తగ్గట్టు ప్రవర్తించగలిగితే వాళ్ళ జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుంది.

త్రిభుజం లేదా విలోమ త్రిభుజ ఆకారం లో గోర్లు ఉంటే :

త్రిభుజం లేదా విలోమ త్రిభుజ ఆకారం లో గోర్లు ఉంటే :

వీళ్ళు ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుంటారు. వేరే వాళ్ళు పసిగట్టని విషయాలను వీళ్ళు పసిగట్టగలరు. విలోమ త్రిభుజ ఆకారం లో గోర్లు గల వ్యక్తులు ఎప్పుడూ ఎదో ఒకటి సాధించాలనే తపనతో, కొద్దిగ ఆత్రుత పడుతుంటారు.

నిటారు త్రిభుజాకారం లో గోర్లు కలిగిన వాళ్ళు, మరీ ఎక్కువ సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. తన చుట్టూ ఎవరైనా అనాలోచిత పనులు చేసే వ్యక్తులు గనుక ఉంటే అలాంటి వాళ్ళను అస్సలు ఇష్టపడరు. తమ దగ్గర పనిచేసే మనుష్యులు సమయపాలన లేకుండా వాళ్లకు నచ్చినట్లు పనిచేస్తుంటే, వారి పై విపరీతమైన కోపం అసహనం వ్యక్తం చేస్తారు.

మీ చేతి సైజును బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు..!!మీ చేతి సైజును బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు..!!

బాదం పప్పు ఆకారంలో గోర్లు ఉంటే :

బాదం పప్పు ఆకారంలో గోర్లు ఉంటే :

ఇలాంటి వ్యక్తులు నమ్మకం, నిజాయితీ గల లక్షణాలతో మెలుగుతారు. స్పష్టమైన ఊహను కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తులపై దయా గుణం తో పాటు, మర్యాదగా, ఎంతో హుందా తనం తో వ్యవహరిస్తారు. తనకు నచ్చని విషయం ఏదైనా గనుక తన కళ్ళ ఎదుట జరిగితే నిగ్రహం కోల్పోయి, ఉక్కుపాదం తో అనిచివేయాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు నిద్ర పోవాలనిపిస్తే అప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలా చేయడం వల్ల ఇలాంటి స్వభావము ఉన్న వ్యక్తులు మళ్ళీ మామూలు స్థితి కి చేరుకొని వాళ్ళు చేయాలనుకున్న పనిని మరింత ఏకాగ్రత, అంకిత భావం తో చేస్తారు.

కత్తి ఆకారం లో గోర్లు ఉంటే:

కత్తి ఆకారం లో గోర్లు ఉంటే:

కత్తి ఆకారం లో గోర్లు గల వారు ప్రతిష్ఠాత్మక భావాలు కలిగి ఒక ఆదర్శవాదిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులు వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి ఎంత కష్టపడటానికైనా సిద్దపడతారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల కన్నా, వాళ్ళు నమ్మిన ఆదర్శ భావాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందులో భాగం గా వాళ్లకు నచ్చని పనినైనా చేయడానికి సిద్ద పడతారు. ఎదుటి వ్యక్తులకు సహకరించే విషయం లో వెనుకబడి ఉంటారు. విశ్రాంతి తీసుకొని, నిర్లక్ష్యంతో పనిచేసే వ్యక్తులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఇలాంటి వాళ్ళు తమ సహచరులతో కలిసి పనిచేసే సామర్ధాన్ని పెపొందించుకొని కొద్దిగా ఓర్పు వహిస్తే శ్రేయస్కరంగా ఉంటుంది.

ఇలా వ్యక్తుల గోర్ల ఆకారాన్ని బట్టి ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని చెప్పేయొచ్చు అంటున్నారు జపాన్ పరిశోధకులు.

English summary

The shape of your nails may reveal the type of person you are

A recent personality diagnosis trend in Japan suggests that shape of your nails could reveal characteristic traits about you! What shape are your nails?
Desktop Bottom Promotion