For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషాంగంలాంటి చేపలు.. అక్కడ భలే తింటారు

ఒక రకం చేప అయితే సేమ్ మగవారి అంగం (పురుషాంగం) మాదిరిగా ఉంటుంది. ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తుంది. దీన్ని అక్కడి వారు చాలా ఇష్టంగా తింటుంటారు.

By Bharath
|

ప్రపంచంలో రకరకాలు చేపలున్నాయి. కొన్ని అరుదైన చేపలు ఉంటాయి. వాటిని చూస్తే చాలా వింతగా ఉంటాయి. అలాంటి చేపల్ని మనం అసలు చూసి ఉండం కూడా. వాటిని గురించి తెలుసుకుంటే మాత్రం కాస్త ఆశ్చర్యానికి లోను అవుతాం. ఒక రకం చేప అయితే సేమ్ మగవారి అంగం (పురుషాంగం) మాదిరిగా ఉంటుంది. ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తుంది. దీన్ని అక్కడి వారు చాలా ఇష్టంగా తింటుంటారు. ఇలాంటి చేపలు చాలానే ఉంటాయి. సముద్రాల్లో వుండే రకరకాల చేపలు, ఇతర జీవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పెనిస్ ఫిష్

పెనిస్ ఫిష్

ఇది చూడడానికి మగవారి పురుషాంగం మాదిరిగా ఉంటుంది. ఇవి కొరియా, జపాన్, చైనా, రష్యాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి బురుదలో దొరుకుతాయి. వీటిని గ్యాబుల్ ఫిష్ అని కూడా అంటారు. ఇవి నిటారుగా ఉంటే పురుషాంగం మాదిరిగా కనిపిస్తాయి.

యూ షేప్ లో ఉంటాయి

యూ షేప్ లో ఉంటాయి

గ్యాబుల్ ఫిష్ లేదా పెనిస్ పిష్ అలు యు షేప్ లో ఉంటాయి. ఈ చేపల్ని అక్కడి వారు ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే వీటిని వండడం మాత్రం కాస్త కష్టమే. ఎక్కువ సమయం తీసుకుంటాయి. కొరియాలో వీటిని ఎక్కువగా తింటుంటారు. అక్కడ ఉంటే రెస్టారెంట్లలో ఇది విరివిగా లభిస్తుంటుంది.

వీటి పేరు పెనిస్ ఫిష్ కాదు

వీటి పేరు పెనిస్ ఫిష్ కాదు

ప్రస్తుతం అందరూ పెనిష్ ఫిష్ గా పిలిచే వీటి పేరు వాస్తవానికి పెనిష్ ఫిష్ కాదు. ఇవి ఆ ఆకారంలో ఉండడం వల్లే వీటిని అలా పిలుస్తున్నారు. చైనా రెస్టారెంట్లలో వీటితో తయారు చేసిన వంటకాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే వీటిలో ఆడ, మగ జాతిలను కూడా అక్కడి వారు ఈజీగా కనుక్కుంటారు. వీటి అసలు పేరు యూరిచి యునికినట్స్. ఇవి కాస్త రెడ్ కలర్ లో ఉంటాయి. 10 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుంటాయి. దీనిలో ఎలాంటి ఎముకలు, ముళ్లు ఉండవు. ఇవి కొరియా దేశానికి చెందిన చేపలు.

హాట్చెట్ ఫిష్

హాట్చెట్ ఫిష్

ఇది కాస్త భయంకరంగా ఉంటుంది. ఇది చాలా అరుదుగా లభించే చేప. హ్యాచ్చెట్ సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఇది నోటి దగ్గర బ్లేడు ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇవి ఐదు అంగుళాల వరకు పెరుగుతాయి. ఇవి సముద్రంలో చాలా లోతులో ఉంటాయి. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాల్లోనే ఇవి లభిస్తాయి.

ఫ్యాంగ్ టూత్

ఫ్యాంగ్ టూత్

ఈ చేప కూడా చూడడానికి భయంకరమైన పళ్లతో కనిపిస్తుంది. అయితే దీనికి కంటి చూపు చాలా తక్కువ. దీంతో ఇది ఎక్కువగా వేటాడలేదు. కానీ దాని చుట్టు పక్కలకు ఏ చిన్న చేప వచ్చినా కచ్చితంగా ఇది తినేస్తుంది. ఇది సముద్రంలో 16,400 అడుగుల లోతులో ఉంటుంది. అమెరికాలోని సముద్రాల్లో ఎక్కువగా ఇది ఉంటుంది.

కుకుంబర్ చేప

కుకుంబర్ చేప

ఇవి కూడా కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ఇది సముద్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తట్టుకోగల శక్తి కలిగి ఉంటుంది. చాలా పెద్దగా ఉండే ఈ చేపలు వాతావరణ ప్రభావం ఉన్నప్పుడు మొత్తం ముడుచుకుని ముద్దలాగా మారిపోతాయి.

గోల్బిన్ షార్క్

గోల్బిన్ షార్క్

ఇది సొర చేప మాదిరిగా ఉంటుది. గోబ్లిన్ షార్క్ సముద్ర గర్భంలో ఉంటుంది. 125 మిలియన్ సంవత్సరాల జాతికి చెందిన షార్క్ ఇది. ఇది చాలా ప్రత్యేకమైన షార్క్. చాలా భయంకరంగా ఉంటుంది. వీటి పళ్లు చాలా షార్ప్ గా ఉంటాయి. ఇవి చాలా ప్రమాదరకమైనవి. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్లో ఒక ఆక్వేరియానికి ఈ జాతికి చెందిన చేపను తీసుకొచ్చాురు. కానీ అది అక్కడి వాతావరణానికి తట్టుకోలేక మరణించింది. ఇప్పుడు వీటిని చూడాలంటే కూడా చాలా కష్టమే.

ఫ్లెమింగో టంగ్వే

ఫ్లెమింగో టంగ్వే

ఫ్లెమింగో టంగ్వే అనేది నత్త జాతికి చెందింది. ఇది కూడా సముద్రాల్లో ఎక్కువగా ఉంటుంది. అట్లాంటిక్, కరేబియన్ దీవుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.

యాంగ్లర్ ఫిష్

యాంగ్లర్ ఫిష్

ఈ చేప చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని నోటి భాగంలో తోక ఆకారంలో ఉండేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని నుంచి స్కార్క్ మాదిరిగా వెలుగు వస్తుంటుంది. దీని పళ్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. వాటిని చూస్తే భయం వేస్తుంది.

బ్లాబ్ ఫిష్

బ్లాబ్ ఫిష్

ఈ చేప సముద్రగర్భం లో ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా ఎక్కువగా దొరకుతుంది. ఎక్కువ లోతులో ఇది నివసిస్తుంటుంది. ఇవి 30 సెం.మీ. దాకా పెరుగుతాయి. ఈ చేప అంతా సరేరం జిగురుతో నిండి ఉంటుంది. ఇవి చాలా కనిపిస్తాయి. ఇవి సముద్రాల్లో ఎక్కువ పీడనం ఉండే చోట ఉండడమే ఇందుకు కారణం.

అసహ్యంగా ఉంటుంది

అసహ్యంగా ఉంటుంది

ప్రపంచంలోకెల్లా అత్యంత అసహ్యమైన జీవి బ్లాబ్ ఫిష్. ఇది సముద్ర జలాల్లో అత్యంత లోతు ప్రదేశాల్లో మాత్రమే జీవిస్తుంది. 2013 లో నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్ లో అత్యంత అసహ్యమైన రూపం కలిగిన జీవుల్లో ఇది ప్రథమ స్థానం పొందింది.

సా ఫిష్‌

సా ఫిష్‌

సా ఫిష్‌ అనేది బహుశా ఎక్కువ మందికి ఇవి తెలీక పోవచ్చు ఎందుకంటే ఇవి అట్లాంటిక్‌, ఇండొ-పసిఫిక్‌ సముద్రాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తాయి. తల భాగంతో పాటు శరీరం మొత్తం పూర్తిగా సాగిల పడినట్టుండే ఇవి సముద్రాల్లో ఉండే అతి ఉష్ణ, శీతల వాతావరణాలని సైతం తట్టుకోగలవు. అన్ని రకాల చేపల కంటే భిన్నంగా మూతి భాగంలో రంపాన్ని పోలిన ఆకారాన్ని కలిగి ఉంటాయి.దాన్నే రోస్ట్రం అని పిలుస్తారు. ఫిష్‌లు రాత్రి సమయంలో మాత్రమే ఆహార వేట మొదలు పెడతాయి. ప్రస్తుతం సా ఫిష్‌ల సంఖ్య చాలా తక్కువ అయిపోయింది.

English summary

weird kind of fishes

A Weird Kind of Fish which also Known as Penis Fish!Urechis Unicinctus, A Weird Kind of Fish which also Known as Penis Fish.
Desktop Bottom Promotion