చాణుక్యుడు మహిళల గురించి చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

Posted By:
Subscribe to Boldsky

చాణుక్యుడు మహిళల గురించి చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు! .చాణుక్యుడు ఎన్నో విషయాల మీద తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పాడు, అలా రాజకీయాలు, స్త్రీలు, ప్రేమ, కుంటుంబం, ఇలా జీవితంలో ప్రతి అంశాన్ని స్రుజించారు. ఇలా చాణుక్యుడు మహిళ'ల మీద చెప్పిన అభిప్రాయాల్లో కొన్ని విచిత్రంగా ఉన్నా, నేటి కాలమాన పరిస్థితుల్లో అవి నిజమే అనిపిస్తున్నాయి.

జీవితంలో ముందుకెళ్లాల్సిన త‌రుణంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఇత‌రుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు, స‌మాజంలో మ‌న న‌డ‌క... వంటి అనేక అంశాలలో చాణ‌క్యుడు మ‌న‌కు అనేక నీతి బోధ‌లు చేశాడు. అవ‌న్నీ మ‌న ప్ర‌గ‌తికి ఆయా సందర్భాల్లో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే చాణ‌క్యుడు అవే కాదు, స్త్రీల గురించి కూడా ప‌లు విష‌యాలు మ‌న‌కు తెలియ‌జేశాడు. అవేమిటంటే...

చాణక్య ప్రకారం మగవారికి ఇవే అత్యంత దురదృష్టకరమైన సందర్భాలు..!!

1. స్త్రీలకు బద్ద శ్రతువులు:

1. స్త్రీలకు బద్ద శ్రతువులు:

అబ‌ద్దాలు చెప్ప‌డం, స్వార్థం, అసూయ‌, క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మూర్ఖ‌త్వం, ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం, క్రూర‌త్వం వంటి అంశాలు స్త్రీల‌లో ప్ర‌ధానంగా ఉంటాయ‌ట‌. వీటి వ‌ల్ల చాలా మంది స్త్రీలు జీవితంలో ముందు రాకుండా అలాగే ఉండిపోతార‌ట‌. ఇవి వారికి బ‌ద్ద శ‌త్రువుల‌ట‌.

2. పురుషుల కన్నా స్త్రీలకు :

2. పురుషుల కన్నా స్త్రీలకు :

పురుషుల క‌న్నా స్త్రీల‌కు ఆక‌లి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

చాణుక్య ప్రకారం : మీరు సక్సెస్ సాధించాలంటే ఈ విషయాల్లో సిగ్గు పడకూడదు!!

3. ఏ విష‌యంలోనైనా స్త్రీ భ‌ర్త అనుమ‌తి తీసుకోవాల‌ట‌.

3. ఏ విష‌యంలోనైనా స్త్రీ భ‌ర్త అనుమ‌తి తీసుకోవాల‌ట‌.

ఏ విష‌యంలోనైనా స్త్రీ భ‌ర్త అనుమ‌తి తీసుకోవాల‌ట‌. అలా తీసుకోక‌పోతే ఆ భ‌ర్త ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌. అంతే కాదు, అలాంటి భ‌ర్త క‌న్నా భార్యే ముందు చ‌నిపోయి న‌ర‌కంలో బాధ‌లు అనుభ‌విస్తుంద‌ట‌.

4. పురుషుడి బలం, శక్తి

4. పురుషుడి బలం, శక్తి

పురుషుడి శ‌రీరంలో ఉన్న బలాన్ని, శ‌క్తిని స్త్రీ ఒక్క దెబ్బ‌కే లాగేయ‌గ‌ల‌ద‌ట‌. మ‌ళ్లీ ఆ బ‌లం, శ‌క్తి పాలు తాగితేనే వ‌స్తాయ‌ట‌.

5. స్త్రీ ఎంత అందవిహీనంగా ఉన్నా...

5. స్త్రీ ఎంత అందవిహీనంగా ఉన్నా...

యువ‌తి ఎంత అంద విహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందిన‌దైతే వివాహం చేసుకోవ‌చ్చ‌ట‌. కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాక‌పోతే అలాంటి యువ‌తిని పెళ్లాడ‌కూడ‌ద‌ట‌.

6. స్త్రీల నుంచి క‌ప‌టం, వంచ‌న :

6. స్త్రీల నుంచి క‌ప‌టం, వంచ‌న :

మ‌ర్యాద ఇచ్చిపుచ్చుకోవ‌డం అనేది రాజ‌కుటుంబీకుల నుంచి, సంభాష‌ణ ఎలా చేయాల‌నే దాన్ని పండితుల నుంచి, అబద్దాలు ఎలా ఆడాల‌నే విష‌యం జూద‌గాళ్ల నుంచి నేర్చుకోవాల‌ట‌. అదేవిధంగా స్త్రీల నుంచి క‌ప‌టం, వంచ‌న ఎలా చేయాలో నేర్చుకోవాల‌ట‌.

7. స్త్రీల రుతుక్రమం:

7. స్త్రీల రుతుక్రమం:

ఇత్త‌డి పాత్ర‌ల‌ను బూడిద‌తో, రాగి పాత్ర‌ల‌ను ఆమ్ల ప‌దార్థాల‌తో ఎలా శుభ్రం చేయ‌వ‌చ్చో అలాగే రుతుక్ర‌మం అనేది స్త్రీల‌ను శుభ్రం చేస్తుంద‌ట‌.

8. రాజు, మత గురువు స్త్రీలలో హద్దుల్లో ఉండాలట:

8. రాజు, మత గురువు స్త్రీలలో హద్దుల్లో ఉండాలట:

రాజు, మ‌త గురువు, స్త్రీ వీరితో అస్స‌లు చ‌నువుగా ఉండ‌రాద‌ట‌. అలా ఉంటే ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ట‌.

ఈ 6 విషయాలను బయటి వారితో చర్చిస్తే మీరెప్పటికీ సక్సెస్ కాలేరు..: చాణుక్య...!!

9. ఆడవారి మాటలు, మనస్సు అస్సలు అర్థ చేసుకోవాలేమంటున్న చాణుక్య

9. ఆడవారి మాటలు, మనస్సు అస్సలు అర్థ చేసుకోవాలేమంటున్న చాణుక్య

స్త్రీ మ‌న‌స్సును అస్స‌లు అర్థం చేసుకోలేమ‌ట‌. వారిలో కొంద‌రు ఒక మ‌గాడితో మాట్లాడుతూ, మ‌న‌స్సులో మ‌రొక‌రిని ఊహించుకుంటూ, వేరొక‌రు వెళ్తుంటే వారి వైపు చూస్తార‌ట‌. అలాగే ఎవ‌రైతే పురుషులు త‌మ‌ను ఫ‌లానా స్త్రీ బాగా ప్రేమిస్తుంది అని అనుకుంటారో వారు ఆ స్త్రీల‌కు బానిస‌ల‌వుతార‌ట‌.

English summary

What chanukya says about Women

Chanakya is the famous Indian Politician, Strategist and Writer during the period 350 BC-283 BC. He was an adviser and a prime minister to the first Maurya Emperor Chandragupta (340-293 BC), and is the architect of his rise to power.
Subscribe Newsletter