అమ్మాయిలు ఈ రాశుల వారికి ఈజీగా పడిపోతారు

Written By:
Subscribe to Boldsky

చాలామంది అమ్మాయిలు వారికి తెలియకుండానే కొన్ని రాశుల అబ్బాయిలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. పుట్టిన సమయాన్ని బట్టి... వారి నక్షత్రం, రాశి తెలుస్తాయి. దాన్ని బట్టి వారి జాతకం చూసి, పండితులు వారు ఎలాంటి వారో ఎందులో రాణిస్తారో, వారి జీవితం ఎలా ఉండబోతుందో చెబుతారు. అలాగే కొన్ని రాశుల అబ్బాయిలు అమ్మాయిలను బాగా ఆకర్షిస్తారంట.మరి ఆ రాశులు ఏమిటి.. ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందో లేదో తెలుసుకోండి.

మిథునరాశి

మిథునరాశి

మీది మిథునరాశి అయితే మీరు అమ్మాయిల విషయంలో ఎలాంటి ఆందోళన చెందుతారు. అమ్మాయిల మీకు ఈజీగా పడిపోతారు. అట్రాక్ట్ అవుతారు. అమ్మాయిల విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఎక్కుడున్నా అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకుంటారు.

అమ్మాయిలు ఫ్లాట్

అమ్మాయిలు ఫ్లాట్

మీ చుట్టూ ఉండే అమ్మాయిలు మీకు ఫ్లాట్ అయిపోతారు. ఈ రాశివారు కాస్త మృదు స్వభావం కలిగి ఉంటారు. మీరు మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆమెతో బాగా మాట్లాడితే చాలు.. ఆమె మీ జీవిత భాగస్వామిగా కూడా మారొచ్చు. అంతేకాదు వీళ్లకు అమ్మాయిలను ఎలా పడగొట్టాలో కూడా తెలుసు.

అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు

అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు

మిథున రాశికి వారితో అమ్మాయిలు త్వరగా స్నేహం చేస్తారు. వీరితో ఇట్టే కలిసిపోతారు. వీరితో మాట్లాడడానికి కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఆడవాళ్ల మనస్తత్వాలకు అనుగుణంగా బిహేవ్ చేయడంలో ఈ రాశి వారు సిద్ధహస్తులు అమ్మాయిల హృదయాన్ని అర్ధం చేసుకునే సామర్ద్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారిని అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారు కూడా అమ్మాయిలు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అమ్మాయిలు వీరికి ఈజీగా ప్లాట్ అవుతారు. వీరు అమ్మాయిల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. అమ్మాయిల హృదయాలను దోచుకోవడంలో వీరు కింగ్ లు.

తొలి చూపుకే పడిపోతారు

తొలి చూపుకే పడిపోతారు

అలాగే సింహ రాశి కి చెందిన వారు బలమైన శాశ్వత సంబంధాలు కోరుకుంటారు. వీరు విశాలమైన హృదయం కలవారు. వీరు ఎవరితో అయినా సరే స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే వీరిని అమ్మాయిలే కాదు ఎవరైనా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తొలి చూపులోనే ఏ అమ్మాయినైనా ఆకర్షించే సామర్ద్యం వీరికి ఉంటుంది. వీరు చాలా సెన్సబుల్ గా ఉంటారు.

తులరాశి

తులరాశి

తుల రాశి వారు అమ్మాయిల మనస్సును ఈజీగా దోచేస్తారు. అయితే వీరి వారి ప్రేమను అమ్మాయిలకు వ్యక్తీకరించడంలో చాలా ఇబ్బందులుపడతారు. ఈ విషయంలో వీరు కాస్త పిరికిగా ఉంటారు. వీరు ఎవరైనా అమ్మాయితో కాస్త స్నేహంగా మెలిగితే చాలు తర్వాత ఆ అమ్మాయి వీరి ప్రేమలో పడిపోతుంది.

నాది అనుకుంటే వదిలి పెట్టరు

నాది అనుకుంటే వదిలి పెట్టరు

అలాగే తుల రాశి వారి కళ్లలోనే ఆకర్షణ శక్తి ఉంటుంది. తక్కువ సమయంలో అందమైన అమ్మాయిలను వీరు ఇట్టే ఆకర్షిస్తారు. వీరి శైలి, నడవడిక, మాట్లాడే తీరు, అన్నీ ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయి. ప్రేమ విషయంలో దీర్గంగా ఆలోచించే లోతైన స్వభావం కలిగి ఉంటారు. వీరు దేన్నయినా ఒక్క సారి నాది అనుకుంటే వదిలి పెట్టరు.

మొండితనం ఎక్కువ

మొండితనం ఎక్కువ

అలాగే తుల రాశి వారు ప్రేమ, బాధ్యతల మధ్య సమతూకం పాటిస్తారు. ప్రతి మనిషికీ ఒకేలా ప్రేమ పంచుతారు. తెలియకుండా కూడా తప్పులు చేయరు. ఏదయినా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి ముందు అడుగు వేస్తారు. కాకపోతే వీరికి మొండితనం ఎక్కువ.

మకరరాశి

మకరరాశి

వీరికి అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. వీరు మాటలతో అమ్మాయిలను పడగొడతారు. వీరి మాటలు ఎవరినైనా ప్రభావితం చేయగలవు. వీరి స్టైల్, వీరి ప్రవర్తనకు ఏ అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుంది. అందువల్ల వీరు అమ్మాయిల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎంతకైనా తెగిస్తారు

ఎంతకైనా తెగిస్తారు

అలాగే మకర రాశి కి చెందిన అబ్బాయిలను చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు. తెలివిగా సమాధానాలు చెప్పగలరు. ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. రేపటి గురించి బాధపడరు. టెన్షన్స్ నెత్తిన పెట్టుకోరు. తమ చుట్టూ ఉండే వారిని ఆనందంగా ఉంచడానికి ఎంతకైనా తెగిస్తారు.

అమ్మాయిలను ఆకట్టుకునే వ్యక్తిత్వం

అమ్మాయిలను ఆకట్టుకునే వ్యక్తిత్వం

మకర రాశి వారు అన్నిసమయాల్లో సంతోషంగా ఉంటారు. ఇలాంటి మనోహరమయిన వ్యక్తిత్వం అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తుంది. చాలా చురుగ్గా ఉండడం వలన ఇలాంటి వారితోనే స్నేహంగా ఉండడానికి అమ్మాయిలు ఇష్టపడతారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ప్లే బాయ్ టైపు. అందుకే వీరిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి రాని పని అంటూ ఉండదు. వీరిలో చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి. తమ అనుకున్న వారి కోసం ఎంత కష్టమైనా పడతారు. అనుకున్నది సాధించేవరుకు వదిలిపెట్టరు. అందంగా మాట్లాడగలరు.

మాయ చేస్తారు

మాయ చేస్తారు

వృశ్చిక రాశి వారు తమ చుట్టు పక్కల ఉండే ఎవరూ తమ వల్ల నొచ్చుకోకూడదనే భావనతో ఉంటారు. అమ్మాయిలను ఇట్టే మాయ చేయగలరు. వాళ్ళ వింతైన తెలివితో మాట్లాడగలరు. సాయం చేయడానికి ఎప్పుడూ వెనకాడరు. మంచి రొమాంటిక్ వ్యవహార శైలితో ఉంటారు. అందంగా ఉండడంతో పాటుగా భవిష్యత్తుపై ఓ క్లారిటీ ఉంటుంది.

English summary

Women are attracted to these 4 zodiac signs

Women are attracted to these 4 zodiac signs
Story first published: Friday, December 22, 2017, 14:51 [IST]