For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనిషి మరణించడానికి ముందు యమధర్మ రాజు పంపించే ఆ 4 సందేశాలేంటో తెలుసుకోండి!

|

ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జనన మరణాలు సహజం. కానీ ఏ జీవి ఈ సృష్టిలో ఈ జనన మరణాల గురించి అలోచించదు అసలు వాటికీ ఈ విషయం గురించి తెలియను కూడా తెలియదు. కానీ ఒక మనిషి మాత్రమే తన పుట్టక గురించి, చనిపోతామోమోనన్న ఆందోళన పడుతుంటారు. పుట్టుక, మరణం గురించి ఏ జీవి అలోచించనంత విధంగా ఆలోచిస్తూ భయపడుతుంటాడు.

హిందు ధర్మ ప్రకారం మనిషి చనిపోయే ముందు యమ ధర్మ రాజు ఆ మనిషికి 4 సూచనలు పంపుతాడు. ఆ 4 సూచనలు బట్టి ఆ మనిషి మరణం దగ్గర పడిందని అర్ధం అవుతుంది. ఈ 4 మృత్యు సూచ‌న‌లు ఎలా పంపడం జరిగిందన్న విషయం మీద ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

పురాణ కాలంలో

పురాణ కాలంలో

పురాణ కాలంలో య‌మునా న‌ది వ‌ద్ద అమృతుడనే వ్య‌క్తి నివ‌సించే వాడు. కాగా ఒకానొక సంద‌ర్భంలో అత‌నికి చావు భ‌యం ప‌ట్టుకుంటుంది. మృత్యువు ఎప్పుడు వ‌స్తుందో, ఎలా వస్తుందో, ఎలా తాను చ‌నిపోతానో అని త‌ల‌చుకుని అత‌ను భ‌య‌ప‌డేవాడు.

అందుకు యమ ధర్మ రాజు

అందుకు యమ ధర్మ రాజు

దీనికి యమ ధర్మ రాజు నేను ఆ విషయం చెప్పలేను కాని ఆది వచ్చేముందు జరిగే సూచనలు చెప్తాను అని చెప్పాడు.

సరే అని ఆ సూచనలు విన్న అమృతుడు

సరే అని ఆ సూచనలు విన్న అమృతుడు

సరే అని ఆ సూచనలు విన్న అమృతుడు కూడా కాలక్రమేనా ఆ సూచనలు గురించి మర్చిపోయాడు. కొన్ని రోజులకి అమృతుడుకి వెంట్రుకలు తెల్లబడడం మొదలయింది. ఇంక్కొన్ని రోజులకి పళ్ళు రాలడం మొదలయింది.

మరికొన్ని రోజులకి చూపు కూడా కనిపించడం

మరికొన్ని రోజులకి చూపు కూడా కనిపించడం

మరికొన్ని రోజులకి చూపు కూడా కనిపించడం మానేసింది ఇంక్కొని రోజులకి అవయవాల్లో కదలికలు తగ్గడం ప్రారంభమైనది. పక్షవాతం వచ్చింది. కంటి సపోర్ట్ లేకుండా నడవలేకపోయేవాడు. ఇలాంటి పరిస్థితిని చూసినవారు అతనికి సమయం దగ్గపడిందని, ఎక్కువ రోజులో బ్రతకడని అనుకున్నారు.

కానీ ఇన్ని అనారోగ్య సూచనలు వచ్చిన కూడా

కానీ ఇన్ని అనారోగ్య సూచనలు వచ్చిన కూడా

కానీ ఇన్ని అనారోగ్య సూచనలు వచ్చిన కూడా అమృతుడు తనకి ఇంకా ఆయుషు ఉందని నమ్మకంతోనే ఉన్నాడు. యమ ధర్మ రాజు నుండి తనకు ఎలాంటి సందేషాలు రాలేని, జీవించడానికి ఇంకా సమయం ఉందని నమ్మకంతో ఉంటాడు.

కానీ ఆ సమయం రానే వచ్చింది.

కానీ ఆ సమయం రానే వచ్చింది.

కానీ ఆ సమయం రానే వచ్చింది. ఒక రోజు యమ ధర్మ రాజు వచ్చి నీ ఆయుషు అయ్యిపోయింది పద అనగా అమృతుడు మీరు నాకు వరం ఇచ్చారు మర్చిపోయారా? నాకు ఎటువంటి సూచనలు కానీ, సందేషాలు కానీ మీరు పంపలేదు. పంపకుండా నా చావుని ఎలా తెస్తారు, మీరు నన్ని మోసం చేస్తున్నారని యమధర్మ రాజుని అడిగారు.

అప్పుడు యమ ధర్మ రాజు

అప్పుడు యమ ధర్మ రాజు

అప్పుడు యమ ధర్మ రాజు నేను నాలుగు సూచనల్ని నీ ఆరోగ్యం రూపంలో పంపాను కాని నువ్వే వాటిని పటిన్చుకోలేదు అని చెప్పాడు. నీవు జీవితంలో ఎలాంటి మంచి పనులు చేయలేదు, ఆధ్యాత్మిక చింతన అస్సలు లేదు, అలాంటప్పుడు సందేషాలను పంపుతానని నువ్వు ఎలా అనుకుంటావని అడుగుతాడు?

నేను నీకిచ్చిన మాటకోసం

నేను నీకిచ్చిన మాటకోసం

అయినా కూడా నేను నీకిచ్చిన మాటకోసం ఒకటి కాదు నాలుగు సందేషాలను పంపాను. అయితే అన్నింటిని నీవు నిర్లక్ష్యం చేసావు అని యమధర్మ రాజు అనేసరికి..

నువ్వు నాలుగు సందేషాలను పంపితే

నువ్వు నాలుగు సందేషాలను పంపితే

నువ్వు నాలుగు సందేషాలను పంపితే నాకు ఒకటి కూడా చేరలేదు. పోస్ట్ మ్యాన్ నాకు అందజేయకుండా, మర్చిపోయే అవకాశాలేమైనా ఉన్నాయా? అని అమృతుడు యమధర్మ రాజును అడుగుతాడు?.

అప్పుడు యమధర్మరాజు

అప్పుడు యమధర్మరాజు

అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెబుతాడు, నీ శరీరం ఒక పేపర్ , పేపర్ మీద ఇంక్ లో మార్పు వచ్చింది, సమయమే పోస్ట్ మ్యాన్ అని సమాధనం ఇస్తాడు .

మరి అయితే నీవు పంపిన ఆ నాలుగు సందేశాలేంటి

మరి అయితే నీవు పంపిన ఆ నాలుగు సందేశాలేంటి

మరి అయితే నీవు పంపిన ఆ నాలుగు సందేశాలేంటి అని యమధర్మ రాజును అడుగుతాడు అమృతుడు. అప్పుడు యమధర్మ రాజు అతనికి పంపిన నాలుగు సందేషాలను ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేస్తారు.

1.

1.

కొన్ని సంవత్సరాల ముందు, నీ జుట్టు తెల్లగా మారుతుంది. ఇది నేను నీకు పంపిన మొదటి సందేశం.దీన్ని నీవు నిర్లక్ష్యం చేశావు .

2.

2.

నీవు దంతాలన్నింటిని కోల్పోయావు ఇది నా రెండో సందేశం.

3.

3.

ఏ వస్తువునీ సరిగా చూడలేకుండా కంటి చూపును కోల్పోతావో అదే నా మూడో సందేశం.

4.

4.

ఎప్పుడైతే నీ శరీరం సెన్స్ కోల్పోయిందో ..పక్షవాతం వచ్చిందో అదే నాలుగో సందేశం.

అమృతుడుకి తను ఆరోగ్యం విషయంలో చేసిన తప్పు తెలిసి వచ్చింది

అమృతుడుకి తను ఆరోగ్యం విషయంలో చేసిన తప్పు తెలిసి వచ్చింది

అమృతుడుకి తను ఆరోగ్యం విషయంలో చేసిన తప్పు తెలిసి వచ్చింది .అప్పుడు అమృతుడు నిజ‌మేన‌ని ఒప్పుకోగా య‌ముడు అత‌ని ప్రాణాల‌ను తీసుకెళ్తాడు.

ఈ క‌థ‌ను బ‌ట్టి మ‌న‌కు తెలిసిందేమిటంటే,

ఈ క‌థ‌ను బ‌ట్టి మ‌న‌కు తెలిసిందేమిటంటే,

ఈ క‌థ‌ను బ‌ట్టి మ‌న‌కు తెలిసిందేమిటంటే, వయస్సులో ఉన్నప్పుడే మంచి జీవితాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి సూచనలు వస్తున్నాయంటే అందుకు మనం వాటిని సరిచేసుకుని, జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని యమధర్మ రాజు మనకు పంపే సూచనలు.

మ‌న‌కు క‌లిగే అనారోగ్యాలే మ‌న మ‌ర‌ణాన్ని నిర్దేశిస్తాయి.

మ‌న‌కు క‌లిగే అనారోగ్యాలే మ‌న మ‌ర‌ణాన్ని నిర్దేశిస్తాయి.

మ‌న‌కు క‌లిగే అనారోగ్యాలే మ‌న మ‌ర‌ణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్ర‌త్త ప‌డితేనే మ‌న ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వ‌స్తుంద‌ని తెలుస్తుంది. మరణం నుండి ఎవ్వరు తప్పించుకోరు కానీ, అందుకు రెడీగా ఉండమని సంకేతాలు సూచిస్తాయి.

English summary

Yamraj Sends 4 Letters To Everyone As They Near Death

Yamraj Sends 4 Letters To Everyone In Their Lifetime As They Near Death. Here's How To Identify These Letters And Not Miss Them.
Desktop Bottom Promotion