For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు దమ్ముంటే ఆ ద్వీపానికి వెళ్లిరండి.. ఇలాంటి దీవుల గురించి మీరు అస్సలు విని ఉండరు

ఈ సుదూరమైన విశ్వంలో మనిషి వెళ్లలేని ప్రదేశం అంటూ ఏది లేదు.కానీ ఈ భూమిపైన మనిషి వెళ్లలేని,వెళ్లకూడని ప్రదేశాలు కొన్ని ఉన్నాయంటే మీరు నమ్మగలరా? అందులో కొన్నింటిని మీకు పరిచయం చేస్తాను.

|

ఈ సుదూరమైన విశ్వంలో మనిషి వెళ్లలేని ప్రదేశం అంటూ ఏది లేదు.కానీ ఈ భూమిపైన మనిషి వెళ్లలేని,వెళ్లకూడని ప్రదేశాలు కొన్ని ఉన్నాయంటే మీరు నమ్మగలరా? అందులో కొన్నింటిని మీకు పరిచయం చేస్తాను. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా వింతగొలిపే ఎన్నో ద్వీపాల గురించి మీరు వినే ఉంటారు. అయితే పాములకీ ఓ ద్వీపం ఉందని మీకు తెలుసా..! కేవలం విషసర్పాలు మాత్రమే కొలువుదీరిన ఈ ద్వీపం గురించి తెలుసుకోవాలంటే బ్రెజిల్‌లోని 'ఐలా డి మెడిగాన్డె' ప్రాంతానికి వెళ్లితీరాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న స్నేక్‌ ఐల్యాండ్‌ అదే మరి.

ఐలా డి మెడిగాన్డె ద్వీపం

ఐలా డి మెడిగాన్డె ద్వీపం

పామును చూడగానే చాలామందికి వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. నోట మాటరాక తడబడుతుంటారు. ఒక్క పామును చూస్తేనే పరిస్థితి అలా ఉంటే మరి కొన్ని లక్షల పాములు ఒకే చోట కనబడితే!..... ఇదేంటి పాములన్నీ ఒకే చోట కనబడడమేంటని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. బ్రెజిల్‌లోని ఐలా డి మెడిగాన్డె ద్వీపం గురించి తెలిస్తే అసలు సంగతేంటో మీకే అర్థమవుతుంది. బ్రెజిల్‌లోని సావ్‌పావ్‌ నగరానికి సరిగ్గా 33 కి.మీ దూరంలో ఉంది ఐలా డి మెడిగాన్డె అనే ద్వీపం. పోర్చుగీస్‌ భాషలో ని ఐలా డి మెడిగాన్డె అంటే కాలిపోయిన ద్వీపం అని అర్థం.

పూర్తిగా సర్పాలతో

పూర్తిగా సర్పాలతో

నీటి మట్టం పెరగడం ద్వారా ప్రధాన భూభాగం నీటితో నిండిపోవడంతో పెద్ద ఎత్తున విషపూరితమైన పాములుఈ ద్వీపంలోకి వచ్చిచేరాయనేది ఒక కథనమైతే... ఈ ద్వీపంలో ఉండే జాలరులు తరచుగా విషసర్పాల కాటుకు గురౌతుండడంతో వాళ్ళు ఈ ద్వీపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఆ తర్వాత ఈ ద్వీపం పూర్తిగా సర్పాలతో నిడిపోయిందనేది మరో కథనం. కారణం ఏదైనా ఒకప్పుడు జనావాసాలతో ఉన్న ఈ ద్వీపం ఇప్పుడు పూర్తిగా విషసర్పాల ద్వీపంగా మారింది. నిర్మానుష్యంగా మారింది. అందుకే ఈ ద్వీపానికి (స్నేక్‌ ఐల్యాడ్‌) అనే పేరు. 4,30,000కు పైగా అత్యంత విషపూరితమైన పాములున్న ఈ ద్వీపంలో అతి ప్రమాదకరమైన గోల్డెన్‌ ల్యాన్సెహెడ్‌ రకానికి చెందిన సర్పాలే దాదాపు నాలుగువేలు ఉన్నాయనేది ఒక అంచనా.

చదరపు అడుగుకు దాదాపు ఆరు పాములు

చదరపు అడుగుకు దాదాపు ఆరు పాములు

ప్రతి చదరపు అడుగుకు దాదాపు ఆరు పాములు కనిపిస్తాయంటే ఈ ద్వీపం ఎంతగా సర్పాలతో నిండి ఉందో అర్థంచేసుకోవచ్చు. అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ విషసర్పాలు అభివృద్ధి చెందడానికి కారణం వీటిని ఆహారంగా తీసుకునే ఏ జంతువూ అక్కడ లేకపోవడమే. అరదుగా కొన్ని పక్షులు, జంతువులు వచ్చి చేరినా వాటిని కూడా ఈ సర్పాలు హతమార్చడంతో ఇక్కడ ఏ ఇతర పెద్ద జంతువూ మనుగడ సాగించలేకపోయింది. అయితే ఈ ద్వీపంలోకి కొందరు నావికులు వచ్చేందుకు ప్రయత్నించినా పాముకాటు బారినపడి వారు మృతిచెందడంతో ఆ తర్వాత ఇక్కడికి మనుషులెవరూ వచ్చేందుకు ప్రయత్నించలేదు.

ఈ ద్వీపాన్ని విడిచిపెట్టారు

ఈ ద్వీపాన్ని విడిచిపెట్టారు

ఈ విషసర్పాల ద్వీపం నుంచి నావికులను హెచ్చరించేందుకు 1909లో ఇక్కడొక లైట్‌ హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టారు. లైట్‌హౌస్‌ పూర్తి అటోమేటెడ్‌గా మార్చినప్పటి నుంచి చివరి మానవ నివాసితులూ ఈ ద్వీపాన్ని విడిచిపెట్టారు. 1985లో బ్రెజిల్‌ ప్రభుత్వం ఈ ద్వీపంలోని దక్షిణ భాగంలో 82 ఎకరాల మేర జీవవైవిధ్య పరిరక్షణపై దృష్టి సా రించడంతో బ్రెజిల్‌ నావికా దళం సామా న్యులకు ఈ ద్వీపంలో ప్రవేశాన్ని పూర్తిగా నిషే ధించింది. ఇప్పటి వరకు ఈ ద్వీపాన్ని ఎక్కువగా సందర్శించింది కూడా కొన్ని పరిశోధనా బృందాలు మాత్రమే.

జంబూద్వీపం

జంబూద్వీపం

ఇక జంబూ ద్వీపం అనేది కూడా ఉంది. దీన్ని సుదర్శన ద్వీపం అని కూడా అంటారు. విష్ణుపురాణంలో జంబూద్వీపంలో ఉండే జంబూ వృక్షాలు ఏనుగుల మాదిరిగా చాలా పెద్దగా ఉంటాయని వర్ణించబడి ఉంది. ఈ వృక్షాలు కూలి పర్వతాల మీద పడినపుడు వాటి ఫలాల నుంచి వచ్చిన పండ్ల రసంతో ఏర్పడిన నది జంబూనది. ఇది జంబూ ద్వీపంలో ప్రవహిస్తూ ఉంటుంది. జంబూ ద్వీపం తొమ్మిది వర్షాలు(దేశాలు), ఎనిమిది పర్వతాలను కలిగి ఉంటుంది. తొమ్మిది వర్షాల్లో భరత వర్షం ఒకటి.

మేరు వర్షం నుంచి

మేరు వర్షం నుంచి

మార్కండేయ పురాణంలో జంబూ ద్వీపం మేరు వర్షం నుంచి ప్రారంభం అవుతుంది. పర్వత రాజు మేరు పర్వతం మధ్యలో ఆవరించి ఉంటుంది. మేరు పర్వత సానువుల్లో బ్రహ్మలోకం ఉంటుంది. దీనిని బ్రహ్మపురి అంటారు. బ్రహ్మపురి పరిసరాల్లో 8 పట్టణాలు ఉంటాయి. ఈ 8 పట్టణాల్లో ఒక దానిలో ఇంద్రుడు, మిగిలిన 7 పట్టణాల్లో ఇతర దేవతలు రాజ్యం చేస్తుంటారు.

ఉత్తర సెంటినల్ ద్వీపం

ఉత్తర సెంటినల్ ద్వీపం

మీకు ఉత్తర సెంటినల్ ద్వీపం గురించి తెలుసా?

ఆధునిక మానవ ప్రపంచం తో కలవని మనవ తెగ ఒకటి వుందని మీకు తెలుసా! ఈ ద్వీపం అండమాన్ దీవుల పక్కన ఉంది. ఇక్కడ నివసించే సెంటినల్ తెగ వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. వీరిని కలవటానికి చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు. వారి భూభాగం లోనికి ఎవరు ప్రవేసించినా ఈ తెగ వారు దాడి చేసి చంపేస్తారు.

ఈ దీవుల్లో ఉన్న తెగ ప్రజలు ఎవ్వరినీ దీవి లోనికి అనుమతించరు.ఈ తెగ ప్రజలకి ప్రపంచంతో ఎటువంటి బాహ్య సంబంధాలు లేవు.వీరు ఆధునిక నాగరికతకు చాలా దూరంలో ఉన్నారు.ఒకవేళ ఎవరైనా వెళ్ళితే వారు ప్రాణాలతో బయటపడటం అనుమానమే.అందుకే ఈ దీవి కూడా ఎవ్వరూ వెళ్లకూడని ప్రదేశాల జాబితాలో చేర్చారు.

60,000 సంవత్సరాల నాటి నుంచి

60,000 సంవత్సరాల నాటి నుంచి

ఇది భారత ప్రభుత్వ ఆదీనంలో ఉన్నప్పటికీ, ఈ ద్వీపం విషయంలో భారత ప్రభుత్వం కలుగ చేసుకోదు. ఈ తెగను సుమారు 60,000 సంవత్సరాల నాటి నుంచి మనుగడ సాగిస్తున్న తెగగా భావిస్తున్నారు. వీరి జనాభా సుమారు 200 నుంచి 500 వరకు వుండవచ్చని అంచనా. కొబ్బరికాయలు, చేపలు వీరి ప్రధాన ఆహారంగా భావిస్తున్నరు. బయటి ప్రపంచంతో సంబంధం లేని వీరు చాల గొప్ప ఆరోగ్యవంతులట! ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న వారిని అలా వదిలెయ్యటమే మనం చెయ్యగలిగిన గొప్ప మేలు కదా!!

ఏరియా 51

ఏరియా 51

ఈ ఏరియా 51 అనేది అమెరికాకి చెందిన అత్యంత రహస్య ప్రదేశం.ఇది అమెరికాలోని నవెడ అనే ఎడారి ప్రదేశంలో ఉంది.ఇక్కడ ఏలియన్స్ పైన పరిశోదనలు జరుగుతాయని అపోహ ఉంది.అందుకే ఈ ప్రదేశం లోనికి సామాన్య మానవులు ఎవరు వెళ్లకూడదని నిబంధన ఉంది.

ఫోర్ట్ నాక్స్,కెంటకి

ఫోర్ట్ నాక్స్,కెంటకి

ఇది కూడా అమెరికాకి చెందిన అత్యంత రహస్య ప్రదేశాల్లో ఒకటి.ఇది అమెరికాకి చెందిన కొన్ని వేల టన్నుల బంగారు నిక్షేపాలు దాచి ఉంచిన ప్రదేశం.దీనిపైన అమెరికాకి చెందిన విమానాలు మరియు హెలికాప్టర్ల ద్వారా ఎల్లప్పుడు అత్యంత కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ఉంటుంది.ఈ ప్రదేశం దగ్గరికి కూడా సామాన్య మనవులు కానీ పర్యాటకులు కానీ నిషేధం.

స్వాల్ బార్డ్ సీడ్ వాల్ట్

స్వాల్ బార్డ్ సీడ్ వాల్ట్

ఇది ఒక రకంగా చెప్పాలంటే శీతల గిడ్డంగి లాంటిది.ఇది నార్వీజియన్ ద్వీపం లో అత్యంత చల్లని ప్రదేశం లో ఉంది.ఇది దేశ విదేశాలకు చెందిన వివిధ రకాల విత్తనాలను ఇక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిల్వ ఉంచారు.ప్రపంచంలో ఎప్పుడైనా అత్యంత కరువుకాటకాలు వచ్చినప్పుడు ఉపయోగించడానికి ఈ విత్తనాలను ఇక్కడ భద్రపరిచారు.ఈ ప్రదేశం దగ్గరికి ఎవ్వరూ వెళ్లకూడదని నిబంధన ఉంది.

లాస్కాక్స్ గుహలు,ఫ్రాన్స్

లాస్కాక్స్ గుహలు,ఫ్రాన్స్

ఈ గుహలు క్రీ.పూ. 17,300 సంవత్సరాలకి చెందినవి.ఈ గుహలు ఫ్రాన్స్ దేశం లో ఉన్నాయి.ఈ గుహల్లో ఆది మానవులు గీచిన జంతువులు మరియు కొన్ని ఆకారాలు ఉన్నాయి. అయితే కొన్ని భద్రత కారణాల దృష్ట్యా క్రీ.శ.1963 నుండి ఇక్కడికి మనుషులు ఎవ్వరినీ అనుమతించడం లేదు.

English summary

10 seriously weird places around the world

10 seriously weird places around the world
Story first published:Thursday, June 14, 2018, 9:57 [IST]
Desktop Bottom Promotion