Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ విషయాలను విస్మరిస్తే, ఆత్మలు మీ వెనక రావడం గారెంటీ అంటున్నారు
ఈ విషయాలను విస్మరిస్తే, ఆత్మలు మీ వెనక రావడం గారెంటీ అంటున్నారు
మీరు దెయ్యాలున్నాయని నమ్ముతుంటారా ? లేదా అవి మీ వెంట తిరుగుతున్నాయని భావిస్తున్నారా ? క్రమంగా కొన్ని సంఘటనలకు గగుర్పాటుకు గురవుతూ ఉంటారు కూడా. మీరు వాటిని నమ్మినా, నమ్మకున్నా అవి మీ వెంటనే ఉంటాయని చెప్తుంటారు అనేకులు. మరియు ప్రాచీన కాలం నుండి మనం చేసే కొన్ని పనులకు ఆకర్షితమై అవి మన వెంట వస్తుంటాయని, క్రమంగా పట్టి పీడిస్తాయన్న నమ్మకం కూడా ఉంది. క్రమంగా మంత్రగాళ్ళు, మంత్రగత్తెల ఉనికి కూడా మొదలైంది.
ఒక హోటల్ లేదా కొండ ఎక్కడైనా కావచ్చు, ఆత్మల ఉనికి సాధారణంగా ఉంటుందని చెప్తుంటారు. కావున మీరు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలసినదిగా సూచిస్తుంటారు. ముఖ్యంగా మీరు ఇంటి బయటకు వెళ్ళినప్పుడు, మీరు దూరంగా ఉంచవలసిన విషయాల జాబితా గురించిన వివరాలు మీకోసం.

ఈ విషయాలను విస్మరిస్తే, ఆత్మలు మీ వెనక రావడం గారెంటీ అంటున్నారు

రాత్రిపూట పెర్ఫ్యూమ్ వద్దు:
దెయ్యాలు సున్నితమైన వాసనలకు తేలికగా ఆకర్షితమవుతుంటాయి. బుద్దిజం ప్రకారం, పూర్వీకులను పూజించే క్రమంలో అగర్బత్తీల సువాసనను ఉంచడం ద్వారా, ఆత్మలు ఆకర్షితమై, వచ్చి, పెట్టిన ఆహారాన్ని స్వీకరిస్తాయి అని చెప్పబడిందని అంటారు అనేకులు. కానీ బుద్దుడు మాత్రం దెయ్యాల ఉనికిని ధ్రువీకరించినట్లు సాక్ష్యాలు మాత్రం ఎక్కడా లేవు.
కావున ఎప్పుడైతే మీరు ఆకర్షించే స్వభావాలను కలిగి ఉన్న ఘాడమైన పర్ఫ్యూమ్స్ వేసుకోవడం మొదలుపెడుతారో, ఆత్మలకు నచ్చిన ఎడల మిమ్ములను అనుసరించే అవకాశాలు ఉన్నాయని చెప్తుంటారు. ఈ సువాసనల వెనుక ఎటువంటి చరిత్ర దాగి ఉందో మాత్రం ఇప్పటికీ ఎవరి దగ్గరా సరైన ఆధారాలు లేవు. స్మశానం దగ్గర కూడా ఇటువంటి సువాసనలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుండడం మనం గమనించవచ్చు.

రాత్రిళ్ళు స్విమ్మింగ్ చేయకండి:
రాత్రి వేళల్లో స్విమ్మింగ్ చేయడం ద్వారా, ఆత్మలు, మనిషి మరో పుట్టుకకు కారణమయ్యేలా నీళ్ళలోకి ముంచి చంపివేసే అవకాశాలు ఉన్నాయని చెప్పబడింది. సైన్స్ ప్రకారం, సాయంత్రం 6 దాటితే గురుత్వాకర్షణ ప్రభావాల కారణంగా మనిషి శ్వాస సంబంధిత అసమతుల్యతలను ఎదుర్కొంటూ ఉంటాడు. కావున రాత్రి వేళల్లో స్విమ్మింగ్ ఉపక్రమించడం ద్వారా కొన్ని పరిస్తితుల్లో ప్రమాదకరంగా మారవచ్చు.

చీకటిలో ఒంటరిగా విజిల్ చేయవద్దు :
దుష్ట ఆత్మలు విజిల్ పట్ల ఆకర్షితమవుతుంటాయి. ఒక్కోసారి ఇవి దీర్ఘకాలం పాటు వ్యక్తిని అనుసరించే అవకాశాలు ఉన్నాయి, క్రమంగా దురదృష్టం వెన్నాడుతుంది అని చెప్తుంటారు. చీకటి ప్రదేశాల్లో దొంగల బారిన పడకుండా కూడా ఇలా చెప్పి ఉండవచ్చు.

రాత్రిపూట ఒంటరిగా బయట తిరగకండి:
ఇది ముఖ్యంగా పిల్లలు మరియు గుంపు నుండి తప్పించుకొని ఒంటరిగా ఉండుటకు ఇష్టపడే యువతకు వర్తిస్తుంది. రాత్రివేళల సంచరించే దయ్యాలు సులభంగా యువతపట్ల మక్కువని ప్రదర్శిస్తుంటాయని చెప్పబడింది. పిల్లలను ఎత్తుకుని పోవడం, దోపిడీ దొంగల, రేపిస్ట్ల బారిన పడకుండా కాపాడే ప్రయత్నంలో ఈ భయాన్ని పెట్టి ఉండవచ్చు.

దొరికిన డబ్బు ముట్టకూడదు :
మీరు పొరపాటున డబ్బుల కట్టను దారిలో చూసినట్లయితే, ఎంక్వైరీ చేసి సంబంధిత వ్యక్తికి అందజేయడం లేదా విస్మరించడం లేదా చారిటీకి పంచడం వంటివి చేయండి. స్వలాభానికి వాడుకోవడం ద్వారా ఆత్మలు మీతోనే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పబడింది. కింద పడిన డబ్బును లేదా బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలను, ఆత్మలు తమకు అవమానం జరిగినట్లుగా భావిస్తాయని చెప్పబడింది. దొరికిన డబ్బు కారణంగా శత్రుమూకలు పెరగడం, బంధువర్గాలతో గొడవలు మొదలైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ భయాన్ని పెట్టి ఉండవచ్చు కూడా.

చెట్ల వద్ద మూత్ర విసర్జన చేయకండి :
చెట్ల మీద నివశించే ఆత్మలు, మీరు చెట్లవద్ద మూత్ర విసర్జన చేస్తున్నట్లు గమనిస్తే, ప్రతీకారం తీర్చుకుంటాయని చెప్పబడింది. చెట్లు నాశనం కాకుండా ఇటువంటి భయాన్ని పెట్టి ఉండవచ్చు కూడా.

రాత్రివేళల అద్దం చూడకండి :
నిద్రపోతున్న సమయాల్లో మీరు అద్దంలో కనిపించేలా ఉండకూడదు అని నిర్ధారించుకోండి. అద్దాలకు ప్రతికూల శక్తులను ఆకర్షించే తత్వాలు ఉన్నాయి.(ముఖ్యంగా వ్యక్తుల మానసికస్థితులు ప్రభావితమవుతాయి)

నీళ్ళు–ఉప్పు పద్దతి:
మీపడకకు దగ్గరలో ఒక గ్లాస్ నీళ్ళు, మరియు ఒక బాటిల్ ఉప్పు ఉంచడం ద్వారా ఆత్మలు దగ్గరకు రావని చెప్పబడింది. రాత్రివేళల్లో, శ్వాససంబందిత సమస్యలు తలెత్తినప్పుడు, ఆక్సిజన్ అందని పక్షంలో మరియు అతిమూత్రసమస్య ఉన్నవాళ్ళు నీళ్ళలో ఉప్పు కొద్దిగా కలిపి తీసుకోవడం ద్వారా తక్షణశక్తిని పొందగలరనేది సైన్స్ మాట.



Click it and Unblock the Notifications