For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు భారతదేశంలో మాత్రమే కనిపించే 10 ప్రత్యేక సంగీత వాయిద్యాలు

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం మనకు సంగీత సాధన కోసం అద్భుతమైన వాయిద్యాలను ఇచ్చింది. మాటల్లో చెప్పలేనివి, సంగీతంతో చెప్పొచ్చని ఈ వాయిద్యాలు రుజువు చేసాయి.

By Gandiva Prasad Naraparaju
|

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం మనకు సంగీత సాధన కోసం అద్భుతమైన వాయిద్యాలను ఇచ్చింది. మాటల్లో చెప్పలేనివి, సంగీతంతో చెప్పొచ్చని ఈ వాయిద్యాలు రుజువు చేసాయి.

దేశంలోని వివిధ భాగాల నుండి, వివిధ సంస్కృతుల నుండి - మీరు భారతదేశంలో మాత్రమే చూడగలిగే 10 ప్రత్యేక సంగీత వాయిద్యాలు ఇక్కడ ఉన్నాయి.

1.పెపా

1.పెపా

పెపా అనేది గేదె కొమ్ము నుండి తయారుచేసే హార్న్ పైప్ సాధనం. ఇది అస్సాం లో చాలా ముఖ్యమైన సంగీత వాయిద్యం, ప్రత్యేకంగా దీన్ని బిహు నృత్యం సమయంలో ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా బిహు కళాకారులు (పురుష బిహు కళాకారులు) యువకులు వాయిస్తారు, దీన్ని ఫ్లూట్ తో పోలుస్తారు. పెపా ని అస్సాం వంటి వివిధ అడవి జాతీయులు పెంపా, గ్జురి, సింగరా అని మరి కొంతమంది పేపటి అని వివిధ పేర్లతో పిలుస్తారు.

2.పఖావజ్

2.పఖావజ్

పఖావజ్ బారెల్-ఆకృతి, రెండు-తలల డ్రమ్ ఆకారంలో ఉంటుంది, దీన్ని మృదంగం అని కూడా అంటారు. ఇది డోలక్ లాగా కనిపించినప్పటికీ, దీన్ని రాగం తబలా లాగా ఉంటుంది. ఈ సున్నితమైన వాయిద్యానికి, కోమలమైన గొంతు ఉంది. దీన్ని సంగీతం, నృత్య వివిధ రూపాలతో సహవయిద్యంగా ఉపయోగిస్తారు.

3.పదయాని డప్పు

3.పదయాని డప్పు

పాదయని డప్పు చెక్క పలకలు, తోలు గోడలతో చేయబడిన ఫ్రేం డ్రమ్. ఇది కర్రలతో వాయించి పరాయి డప్పు లాగా కాకుండా చేతితో వాయించే వాయిద్యం. పాదయని అనేది కేరళ సాంప్రదాయ నృత్యం, దీనికి డప్పుని సహకార వాయిద్యంగా ఉపయోగిస్తారు. ఇది మంచి లయబద్ధమైన సంగీతాన్ని సృష్టించి, చెవులకు ఇంపుగా ఉంటుంది.

4.అల్గోజా

4.అల్గోజా

పంజాబ్, రాజస్ధాన్ లో కనిపెట్టిన ఈ వాయిద్యం స్థానికంగా చాలా ప్రసిద్ది చెందింది. ఇది సింధి, బలోచి సంగీత కారులచే దత్తత తీసుకోబడి, జుగ్ని, జింద్ మహి, మిర్జా కళా ప్రక్రియలో ఉపయోగించబడింది. ఇది రెండు ఫ్లూట్లు కలిసినట్లుగా ఉంటుంది, దీన్ని రెండు వైపులా మూలలు వేళ్ళను ఉపయోగించి వాయిస్తారు.

5.సుర్సింగర్

5.సుర్సింగర్

సుర్సింగర్ అనే వాయిద్యం సరోడ్ ని పోలి ఉంటుంది, ‘అందంతో కూడిన శ్రావ్యం' అని దీనర్ధం. పరిమాణంలో, ఇది సరోడ్ కంటే పెద్దదిగా ఉంది, ఎక్కువ శబ్దాన్ని ఇస్తుంది. ఇది చెక్క లేదా లెదర్ తో తయారుచేయబడి దీని మెడ భాగం మెటల్ ఫింగర్ బోర్డు తో ఉంటుంది. ఈ వాయిద్యం తీగలు మెటల్ ప్లేక్త్రం తో వాయిస్తారు, దీని బ్రిడ్జ్ చదునైన కొమ్ముతో తయారుచేయబడి ఉంటుంది.

6.గుబ్గుడా

6.గుబ్గుడా

గుబ్గుడా పెర్కుషణ్ తీగల వాయిద్యం, ఇది ఎండిన కాయ లేదా ప్రేగు లాంటి తీగతో కలప బడిన చెక్క ప్రతిధ్వని కారి. ఈ వాయిద్యాన్ని వాయిన్చినపుడు, దీని శరీరం దీన్ని వాయించేవారి చేతికింద ఉండి, తీగ చివరి భాగం అదే చేతి పిడికిలిలో ఉంటుంది. ఆ తీగ మరో చేతిలో ఉండే ప్లాస్టిక్ ముక్క ద్వారా లాగబడుతుంది.

7.కుజ్హల్

7.కుజ్హల్

రెండు-కర్రలతో కూడిన ఈ కుజ్హల్ వాయిధం కేరళలోని ఆలయాలలో ఉపయోగిస్తారు. దీని ధ్వని ఈల శబ్దం లాగా ఉండి, దీన్ని నాదస్వరం తో పోలుస్తారు. ఇది షెహనాయి లాగా ఉంటుంది, అందువల్ల ఈ రెండు వాయిద్యాల మధ్య చాలామంది తికమక పడతారు. కుజ్హల్ ని సాధారణంగా ఆలయాలలో పండగల సమయంలో వాయిస్తారు.

8.ఉడుకై

8.ఉడుకై

ఉడుకై అనేది తమిళనాడు కు చెందిక ఫోన్ ఆకరయంలో ఉండే వాయిద్యం. దీన్ని జానపద సంగీతంలో వాడతారు, ఇది భారతీయ అవర్ గ్లాస్ డ్రమ్స్ ని పోలి ఉంటుంది, దీనికి ఒకవైపు వంగి ఉన్న చిన్న ఉచ్చు ఉంటుంది. ఉడుకై ని చేతితో వాయిస్తారు, దీని పిచ్, టెంపో ని లెస్ ని వత్తిడి చేయడం ద్వారా మధ్యమధ్యలో మార్చవచ్చు. శివుడి చేతులో ఉంది డమరు ని కూడా ఉడుకై గా భావిస్తారు.

9.సంబల్

9.సంబల్

పశ్చిమ భారతదేసానికి చెందిన సంబల్ డ్రమ్ లాగా ఉండే సంగీత వాయిద్యం. ఇది రెండు డ్రమ్ ల కలగలుపుతో ఉండి, ఒక డ్రమ్ మరోదాని కంటే ఎక్కువ పిచ్ కలిగి ఉంటుంది. ఈ డ్రమ్ పైభాగం చర్మం తలతో విస్తరించి ఉంటుంది, ఇది ఎక్కువగా తబలా లాగా కనిపిస్తుంది.

10.రావనహత

10.రావనహత

పేరుకు తగ్గట్టుగా, ఈ వాయిద్యం రావణుని కాలంలో శ్రీలంక లోని హేలా ప్రజలు దాని మూలాలను కలిగి ఉందని నమ్ముతారు. ఇది పురాతన తీగల వాయిద్యం, ఇది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, శ్రీలంక, ఈ రెండు దేశాలలో వాడతారు. ఇది వయోలిన్ కి పూర్వీకురాలిగా కూడా చెప్తారు.

All Images Source

English summary

10 Unique Musical Instruments You'll Only See In India

India’s rich cultural heritage has given us some of the most amazing yet unique musical instruments. It is often said that when words fail, music speaks and these instruments are proof of that. From different parts of the country, and from different cultures - here are 10 unique musical instruments you’ll only see in India.
Story first published:Friday, January 12, 2018, 17:41 [IST]
Desktop Bottom Promotion