For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శిల్పాశెట్టి బట్టలు లేకుండా యోగా బాగా చేస్తుందట, అనుష్క కు యోగానే జీవితమట, సెలబ్రెటీల యోగా ముచ్చట్లు

  |

  ఇప్పుడు యోగా అంటే ఒక ఫ్యాషన్. మన సంప్రదాయం మనకు అందించిన యోగా ప్రపంచవ్యాప్తంగా వ్యాయామ సాధనంగా జేజేలు అందుకుంటోంది. ఇక సెలబ్రెటీలు కూడా యోగా చేయడం వల్ల అందరూ యోగాపై ఆసక్తి చూపుతున్నారు. ఆ మధ్య బాలీవుడ్ నటి శిల్పాశెట్టి యోగా వీడియో విడుదల చేసింది. ఇక టాలీవుడ్ సెలబ్రిటీ అమల అక్కినేని యోగా శిక్షకురాలు. అలాగే 'విక్రమ్ యోగా' అని, 'క్రియ యోగా' అనీ... విభిన్న రకాల ప్రక్రియల్ని మిగిలిన సెలబ్రిటీలు వరుసగా మోసుకొచ్చేస్తున్నారు.

  మానసిక పటుత్వాన్ని కూడా మెరుగుపరిచే శక్తి ఉన్న యోగా కారణంగా... శరీరం ఆరోగ్యవంతంగా, మనసు దృఢంగా మారుతుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసలను తీసుకునే స్థాయిని మెరుగు పరుస్తుంది యోగా.

  వయసుకు అతీతంగా

  వయసుకు అతీతంగా

  ఆధునిక వ్యాయామాలు చేయడానికి కొన్ని పరిమితులున్నప్పటికీ, యోగాను మాత్రం వయసుకు అతీతంగా అందరూ సాధన చేయవచ్చు. మనిషి మానసిక రుగ్మతలను దూరం చేసి అందాన్ని, ఆనందాన్ని పెంచేది యోగా మాత్రమే. యోగాకు అందాన్ని పెంచడమే కాదు మందాన్ని తగ్గించే శక్తి ఉంది. ఉంది. ఈ విషయం నటి అనుష్కకు బాగా తెలుసు. మొదట్లో యోగా టీచర్‌ అయిన ఈ స్వీటీ ఆనక యాక్టర్‌ అయిన విషయం తెలిసిందే.

  కొత్త అందాలతో మళ్లీ ఈ బొద్దు గుమ్మ

  కొత్త అందాలతో మళ్లీ ఈ బొద్దు గుమ్మ

  ఆ మధ్య సైజ్‌ జీరో చిత్రం కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బహుబలి-2 చిత్రం కోసం తగ్గడానికి చేయని కసరత్తులు లేవట. అసలు విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అనుష్క యోగానే శరణ్యంగా భావించి నటనను కొంతకాలం దూరంగా పెట్టి యోగాలో మునిగితేలనున్నారట. ఒక పక్క నటిస్తూ యోగాకు పూర్తిసమయాన్ని కేటాయించడం సాధ్యం కాకపోవడంతో అనుష్క ఈ నిర్ణయానికి వచ్చారట. ఇకపోతే యోగాకు కేటాయించిన కాలాన్ని పూర్తి చేసుకుని కొత్త అందాలతో మళ్లీ ఈ బొద్దు గుమ్మ తెరపైకి వస్తారట.

  అనుష్క యోగా నేర్చుకున్న విధానం

  అనుష్క యోగా నేర్చుకున్న విధానం

  ఇక గతంలో అనుష్క తాను యోగా నేర్చుకున్న విధానం గురించి కూడా చెప్పారు. "మెడిటేషన్‌ వర్క్‌షాప్ కు వెళ్లినప్పుడు భరత్‌ ఠాకూర్‌ని కలిశాను. ఆ తరువాత ఆయనే నాకు యోగా గురువు అయ్యారు. యోగా చేయడం చాలా బాగా అనిపించింది. యోగ చేయడం మొదలుపెట్టాక నా ఆలోచనాధోరణిలో, వ్యక్తిత్వంలో మంచి మార్పులు చోటుచేసుకున్నాయి. యోగా నేర్చుకున్నాక నాకు యోగాను నలుగురికీ నేర్పించాలి అనిపించింది. కాని మా నాన్న అందుకు ఒప్పుకోలేదు. నేను యోగా నేర్పించడాన్ని ఒప్పుకునేందుకు ఆయనకు చాలానే టైం పట్టింది." అని అనుష్క అప్పట్లో చెప్పింది.

  అనుష్క క్లాసులకు అంతా వాళ్లే

  అనుష్క క్లాసులకు అంతా వాళ్లే

  " యోగా టీచర్‌గా నా మొదటి యోగా క్లాస్‌లో ఎన్నో సానుకూల భావనలు కలిగాయి నాకు. క్లాసులకు 45 నుంచి 50 యేళ్ల మధ్య వయస్కులు వచ్చే వాళ్లు. యోగ నేర్చుకోవడంతో పాటు వాళ్ల సమస్యల గురించి కూడా మాట్లాడేవారు. ఆ ప్రపంచమే వేరుగా ఉంటుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా యోగ మంచి టూల్‌. నేను రోజుకి 30 నిమిషాల వర్కవుట్‌ సెషన్‌ చేస్తాను." అని అనుష్క శెట్టి చెప్పింది.

  యోగానే నా జీవితం

  యోగానే నా జీవితం

  "నా యోగా గురు భరత్‌ ఠాకూర్‌ దగ్గర నేర్చుకున్న యోగా వల్ల శారీరకంగా ఓపిక, మానసికంగా పరిణతి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా వల్ల జీవితం పట్ల స్పష్టత, సమతుల్యం వచ్చాయి. యోగానే నా జీవితం. యోగా చేయడం మొదలుపెట్టి దశాబ్ద కాలం దాటింది. యోగాలో భాగంగా మెడిటేషన్‌, చాంటింగ్‌, ఆసనాలు వేయడం ఉంటాయి. అన్నీ సరిగా చేసినప్పుడు ఫలితం కళ్ల ముందు కనిపిస్తుంది." అని గతంలో అనుష్క చెప్పింది

  మత్స్యకన్య శిల్పాశెట్టి

  మత్స్యకన్య శిల్పాశెట్టి

  ఇక మత్స్యకన్య శిల్పాశెట్టి ఆ మధ్య సరదాగా చేసిన వ్యాఖ్య అప్పట్లో వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ కూడా యోగాలో మంచి ఎక్స్‌పర్ట్. దీనికి సంబంధించి ఆమె రిలీజ్ చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఆమె తను రాసిన రెండో పుస్తకం ‘ది డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా'ను ఆ మధ్య ఇటీవల విడుదల చేసింది.

  దుస్తులు లేకుంటే ఇంకా బాగా యోగాసనాలు వేసేదాన్ని

  దుస్తులు లేకుంటే ఇంకా బాగా యోగాసనాలు వేసేదాన్ని

  ఈ సందర్భంగా ఆమె లైట్ అండ్ బ్లాక్ కలర్.. సిల్కీ డ్రెస్‌ను ధరించింది. ఆమె వేదికపై ఆసనాలు వేస్తున్నప్పుడు అవి తనకు కంఫర్ట్‌గా అనిపించలేదేమో.. ఈ దుస్తులు లేకుంటే ఇంకా బాగా యోగాసనాలు వేసుండేదాన్నంటూ కిలకిల నవ్వేసింది. ఆ దుస్తులు యోగా చేసేందుకు పెద్దగా కంఫర్ట్‌గా లేవని శిల్పాశెట్టి భావం. అయితే సరదాగా చెప్పినప్పటికీ ఇప్పుడు ఈ వీడియో అప్పట్లో నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది.

  బకాస‌నం వీడియో

  బకాస‌నం వీడియో

  ఇక గతంలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా బాలీవుడ్ సుంద‌రి శిల్పాశెట్టి బ‌కాస‌నం వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌ను వేసిన బకాస‌నం వీడియో అప్పట్లో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ బ‌కాస‌నాన్ని నేర్చుకున్న‌ద‌ట శిల్పా. గతంలో బిపాసా కూడా యోగా వ‌ర్క‌వుట్స్ చేసిన ఫోటోలను త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

  45 లక్షలు తీసుకున్నారట

  45 లక్షలు తీసుకున్నారట

  అయితే బ్లాక్ బ్యూటీ బిపాసా బసు 45 నిమిషాలపాటు యోగాసనాలు వేసి 45 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలతో అప్పట్లో సతమతం అయ్యారు. గతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ‘బెండ్ ఇట్ లైక్ బిపాసా' పేరిట జరిగిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆసనాలు వేశారు. బిపాసా రావడంతో ఈవెంట్ బాగా పాపులర్ అయ్యింది.

  రాణి ముఖర్జీ

  రాణి ముఖర్జీ

  బాలీవుడ్ అగ్ర హీరోయిన్, ఖాందాల గర్ల్ రాణి ముఖర్జీ కూడా యోగా బాగా చేస్తుంటారు. ప్రతి రోజు ఆమ రెండు గంటల పాటు యోగా చేసేవారట. గతంలో స్పోర్ట్స్ పర్సన్‌గా రాణి ముఖర్జీ పోషించే పాత్ర కోసం యోగాను బాగా ప్రాక్టీస్ చేసిందట. దీంతో ఆమె అప్పట్లో స్లిమ్ గా మారారు.

  కరీనాకపూర్

  కరీనాకపూర్

  యోగా నా జీవితాన్నే మార్చేసిందని బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఆ మధ్య చెప్పారు. తన ప్రతిరోజు యోగాతోనే మొదలవుతోందన్నారు. రోజూ గంటన్నరసేపు యోగా చేస్తుందంట కరీనా. యోగా చెయ్యని నాడు తను ఏదో వెలితిగా ఉంటుందట. ఆ రోజు పూర్తిస్థాయి ఉత్సాహం కరీనాలో కరవవుతుందట. క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే శరీరం, మనసు మన అదుపులోనే ఉంటాయని కరీనా సలహాలు కూడా ఇచ్చింది.

  బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్

  బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్

  బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ...బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ ఫిట్ నెస్ కు కారణం యోగానే. తన ఆరోగ్య రహస్యం ఇదేనని పలు సందర్భాల్లో చెప్పింది మల్లిక. ఇక ఆ మధ్య రోజుకో ఆసనం వేసి.. ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది మల్లిక. అంతేకాదు ఏ ఆసనం వేస్తే.. ఏం లాభమో కూడా నేర్పించేది. సేతు బంధనాసనం, చక్రాసనం, ఊర్ధ్వ ధనురాసనం.. ఇలా అన్నిరకాల ఆసనాలతో యోగా నేర్చుకునే వారికి లైవ్ డేమో కూడా మల్లిక ఇచ్చింది.

  భూమిక

  భూమిక

  ఇక పలు తెలుగు సినిమాల‌తో ఆక‌ట్టుకున్న బ్యూటీఫుల్ భూమిక భ‌ర్త భ‌ర‌త్ ఠాకూర్ కూడా యోగా గురువే. భర్తతో పాటు భూమిక కూడా యోగా చేస్తూ ఉంటుంది. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే యోగా మాస్టర్‌ భరత్‌ను ప్రేమించి పెళ్లి చేసుక్ను భూమిక కూడా యోగా మంచి ఎక్స ఫర్టే.

  తమన్నా

  తమన్నా

  ‘ఇక ప్రతిరోజూ ఓ కొత్తరోజు. లైఫ్‌లో నిన్ను నువ్వు డెవలప్‌ చేసుకునే ప్రోగ్రెస్‌ ఎవ్రీడే ప్రాసెస్‌లో ఉండాలి. ఇలా జరగాలంటే మైండ్‌ అండ్‌ శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయాలి. ఇందుకు యోగాను మించింది లేదు. శారీరకంగా, మానసికంగా యోగా బెస్ట్‌'' అని ఆ మధ్య తమన్నా పేర్కొన్నారు. తమన్నా కూడా నిత్యం యోగా చేస్తారు.

  చాలా మంది సెల‌బ్రిటీలు

  చాలా మంది సెల‌బ్రిటీలు

  ఇక గతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాల సందర్భంగా మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, టాలీవుడ్ హీరోయిన్లు అమీజాక్సన్, శ్రియా, కాజల్ అగర్వాల్, హన్సికా మోత్వానీ, బాలీవుడ్ హీరోయిన్లు శిల్పాశెట్టి, కరీనాకపూర్, బిపాసాబసు, కరణసింగ్‌గ్రోవర్ దంపతులు, అక్షయ్‌కుమార్, ట్వింఖిల్‌కన్నా యోగా ఆసనాలు కూడా వేశారు. ఇక అంతర్జాతీయ యోగా డే సంద‌ర్భంగా చాలా మంది సెల‌బ్రిటీలు కూడా త‌మ‌కు తెలిసిన ఓ ఆస‌నాన్ని వేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

  English summary

  15 celebrities who practice yoga regularly and swear by its benefits

  15 celebrities who practice yoga regularly and swear by its benefits
  Story first published: Thursday, June 21, 2018, 11:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more