For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ రాకముందు ప్రపంచమే వేరు, సెల్ వచ్చాక సెక్స్ కూడా చేయడం లేదు, మరి ఇంత దారుణమా?

|

ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంది. కానీ కొన్నేళ్ల క్రితం ఎవ్వరి చేతిలో ఫోన్ ఉండేది కాదు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఒక్క క్షణం చేతిలో లేకుంటే ప్రాణం పోయినంత పని అవుతుంది. మరి స్మార్ట్ ఫోన్ వినియోగించని ఆ రోజులు అందరికీ గుర్తు ఉండి ఉంటాయి. ఈ స్టోరీ చదివితే మీ చేతిలో మొబైల్ లేనప్పుడు చేసిన పనులన్నీ కూడా మీకు మళ్లీ గుర్తొస్తాయి. ఆ జ్ఞాపకాల్ని ఒకసారి మళ్లీ నెమరువేసుకోండి మరి.

కెమెరా

కెమెరా

గతంలో పండుగకో పబ్బానికో ఒక ఫొటో దిగడమే గగనం. పండుగ రోజు ప్రత్యేకంగా ఫొటో గ్రాఫర్ ని ఇంటికి పిలిపించుకుని ఫొటో దిగిన వాళ్లు చాలా మందే ఉంటారు. అది కూడా సింగిల్ ఫొటో కాదండోయ్.. గ్రూప్ ఫొటోనే. సింగిల్ గా ఒక్కొక్కరు ఫొటో దిగే భాగ్యం ఈ స్మార్ట్ ఫోన్స్ రాకముందు మనకు అస్సలు ఉండేది కాదు. మొబైల్స్ వచ్చాక నిమిషనిమిషానికొక సెల్ఫీ తీసుకుంటూ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. సార్మ్ ఫోన్ రాక ముందు కెమెరాలకు మంచి డిమాండ్ ఉండేది.. ఇప్పుడు అంత లేదు.

సీడీ, ఎంపీ 3 ప్లేయర్స్, రేడియో, టేప్ రికార్డ్స్ లో పాటలు

సీడీ, ఎంపీ 3 ప్లేయర్స్, రేడియో, టేప్ రికార్డ్స్ లో పాటలు

ఈ మొబైల్స్ రాక ముందు చాలా మంది సీడీ, ఎంపీ 3 ప్లేయర్స్, రేడియో, టేప్ రికార్డ్స్ లో పాటలు విని ఉంటారు. సీడీ నిండా పాటలు ఎక్కించుకుని వాటిని మనసారా వింటూ ఫుల్ ఎంజాయ్ చేసిన వాళ్లు చాలా మందే ఉంటారు. ఇక డీవీడీలో పాటలు వినడమే కాస్త హై లెవల్ అన్నమాట. కొన్ని వందల పాటలు ఎక్కువగా వినొచ్చు కూడా. అంతకు ముందు రేడియో, టేప్ రికార్డ్స్ లలోనూ పాటలు మనం విని ఉంటాం. టేప్ రికార్డ్ లో పాటలు వింటే ఆ మజానే వేరు. కానీ మొబైల్ వచ్చాక అవన్నీ కనుమరుగయ్యాయి.

మ్యాప్స్

మ్యాప్స్

ఇప్పుడంటే స్మార్ట్ మొబైల్ లో జస్ట్ లొకేషన్ ఆన్ చేసుకుంటే చాలు. మనం కావాల్సిన ప్లేస్ కు అదే రూట్ చెబుతూ తీసుకెళ్తూ ఉంటుంది. కానీ గతంలో కొందరు దూర ప్రాంతాలకు వెళ్లే వారు మ్యాప్స్ కొనేవారు. ఆ ప్రింట్ అవుట్ చేతిలో పెట్టుకుని దాని ప్రకారం గమ్య స్థానాలకు చేరేవారు.

Most Read : ఎక్కడో టచ్ చేసి వెళ్లిపోతాడు, అతని చూపులకు వెంటనే చీర మార్చుకోవాలనిపిస్తుంది, దూల లేదు

డైరెక్షన్స్ అడిగేవారు

డైరెక్షన్స్ అడిగేవారు

ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఫోన్ తోనే మాట్లాడుతున్నారు. గూగుల్ నే అడ్రస్ అడుగుతున్నారు. కానీ ఈ స్మార్ట్ మొబైల్స్ రాక ముందు ఎవరో ఒకర్ని ఫలానా వీధికి వెళ్లాలండీ.. ఫలానా ఆఫీస్ కు వెళ్లాలండీ కాస్త అడ్రస్ చెబుతారా అని అడుగుతూ వెళ్లేవారు. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక ఎవ్వరీ అవసరం లేకుండా డైరెక్ట్ గా వెళ్లాల్సిన అడ్రస్ కు వెళ్లిపోతున్నారు.

కంప్యూటర్ లోనే మెయిల్స్ చెక్ చేయడం

కంప్యూటర్ లోనే మెయిల్స్ చెక్ చేయడం

గతంలో ఎవరైనా మెయిల్ పంపారంటే వెంటనే దగ్గరుండే నెట్ కేఫ్ కు వెళ్లి మెయిల్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకునేవారు. కేవలం మెయిల్ చెక్ చేసుకునేందుకే నెట్ కేఫ్ వద్ద గంటల తరబడి క్యూలో నిల్చున్న రోజులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో కావాల్సినంత డేటా ఉండడంతో సెకెన్స్ లో మెయిల్ చెక్ చేసుకుంటున్నారు.

విరాళం

విరాళం

ఒకప్పుడు విరాళాలు ఇవ్వాలంటే మ్యాన్ వల్ గా ఇచ్చేవారు. ఇప్పుడన్నీ ఆన్ లైన్ విరాళాలే. జస్ట్ అకౌంట్ నంబర్ కు మొబైల్ నుంచి సెండ్ చేసే రోజులొచ్చాయి.

ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్

ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్

గతంలో బ్యాంక్ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకోవాలంటే పాస్ బుక్ తీసుకుని బ్యాంక్ కు పోవడమో లేదంటే ఏటీఎం కార్డ్ తీసుకుని ఏటీఎం వద్ద క్యూలో నిలబడడమో చేసేవారు. కేవలం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఏటీఎం వద్ద క్యూలో నిలబడిన రోజులు మీకు గుర్తొస్తుంటాయి.

Most Read : నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను, ఒక్కరోజు రూమ్ కు వస్తావా నేను హెల్ప్ చేస్తాను

ఎక్కడికైనా వెళ్లాలంటే

ఎక్కడికైనా వెళ్లాలంటే

గతంలో రైల్వే స్టేషన్ లోనో లేదంటే బస్ స్టేషన్ లోనో దిగి ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటో కోసం వెతికేవారు. బేరం ఆడేవారు. ఇప్పుడవన్నీ అక్కర్లేదు. జస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకుని ఓలానో, ఊబరో యాప్ ఓపెన్ చేసి ఆటో కావాలంటే ఆటోను, క్యాబ్ కావాలంటే క్యాబ్ ఏ కారు నచ్చితే ఆ కారు బుక్ చేసుకుని ఇంటికెళ్లే సదుపాయం వచ్చింది.

ఆటలు

ఆటలు

గతంలో ఏవేవో ఆటలు ఆడేవాళ్లం. కానీ స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక అన్నీ అందులోనే. కొత్త కొత్త త్రీడీ గేమ్స్ తో బిజీబిజీ అయిపోతుంది యువత. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఔట్ డేర్ గేమ్స్ మరిచిపోతున్నారు.

డబ్బు

డబ్బు

ఇంతకు ముందు ప్రతి ఒక్కరూ జేబులో, పర్సులో డబ్బులుంచుకునేవారు. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా.. పేదవారైనా సరే స్మార్ట్ మొబైల్ లోనే లావాదేవీలు చేయాల్సి వస్తుంది. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ ఇలా చాలా యాప్స్ తో జస్ట్ నంబర్స్ ఎంటర్ చేసి లావాదేవీలు జరిపే కాలం వచ్చింది. అంతా స్మార్ట్ ఫోన్ మహిమ. ఎవ్వరీ జేబులో కనీసం పది రూపాయల నోట్ కూడా కనపడదు.

ల్యాండ్ లైన్

ల్యాండ్ లైన్

మొబైల్స్ రాక ముందు ఫోన్ లో మాట్లాడడమంటే చాలా పెద్ద విషయం. కేవలం సంపన్నులకే మాత్రమే ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండేది. అది కూడా ల్యాండ్ ఫోన్స్ లోనే. ఊర్లో ఒక్కటో రెండో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ఎవరైనా బంధువులు ఫోన్ చేస్తే ఆ ఇంటి వాళ్లు సరే మరో అరగంటకు చెయ్యి పిలిపిస్తాం అనేవారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఆ రోజులకు పుల్ స్టాప్ పడింది.

 ఫిల్టర్స్ ఉండేవి కావు.

ఫిల్టర్స్ ఉండేవి కావు.

స్మార్ట్ ఫోన్లు రాక ముందు ఫొటోలకు అన్ని ఫిల్టర్స్ ఉండేవి కావు. నేచురల్ గా ఫొటోలు దిగేవారు. ఇప్పుడు మాత్రం రకరకాలుగా ఫొటోలు దిగుతున్నారు. ముఖాలకు పిల్లుల మాదిరిగా మీసాలు ఎఫెక్ట్ కల్పిస్తూ ఫొటోలు దిగి పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని వేల రకాల ఫిల్టర్స్ అందుబాటులో ఉండడంతో అసలు ఒరిజనల్ గా ఫొటో దిగితే ఎలా ఉంటామో కూడా అర్థం కాకుండా ఉన్నారు జనాలు.

వీడియో గేమ్స్

వీడియో గేమ్స్

స్మార్ట్ ఫోన్స్ రాకముందు వీడియో గేమ్స్ ఆడేవాళ్లు చాలా మందే ఉండేవారు. ఇప్పుడంటే అన్నీ మొబైల్స్ లో గేమ్స్ ఆడుకుంటున్నారుగానీ గతంలో వీడియో గేమ్స్ ఆడేందుకు ఒక పరికరాన్నే ప్రత్యేకంగా కొనుక్కునేవారు. ఇక అది చేతిలో ఉంటే సమయమే తెలియకుండా గడిపేవారు. కానీ ఆ కాలానికి మొబైల్స్ చెక్ పెట్టేశాయి.

Most Read : ఆ ఇంట్లోకి వెళ్తే మాత్రం నరకమే, ఇళ్లంతా రక్తసిక్తం, చిత్రవధలకు గురయ్యే మనుషులను చూస్తారు

రికార్డ్

రికార్డ్

ఒక అప్పుడు వాయిస్ రికార్డ్ చేయడమంటే చాలా టెక్నాలజీతో కూడుకున్న విషయంగా భావించేవారు. అందుకోసం టేప్ రికార్డ్ లాంటి ఒక పరికరం ఉండేది. దాన్ని ఉపయోగించి రికార్డ్ చేసేవారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక వాయిస్ రికార్డ్ అంటే చాలా ఈజీ అయిపోయింది. మాట్లాడే ప్రతి మాటను, ప్రతి సంఘటనను రికార్డ్ చేసే వెసులు బాటు వచ్చింది.

కాయిన్స్ బాక్స్

కాయిన్స్ బాక్స్

మొబైల్స్ రాక ముందు చాలా మంది కాయిన్స్ బాక్స్

యూజ్ చేసేవాళ్లు. ప్రతి ఒక్కరికీ ఆనాటి మెమొరీస్ గుర్తు ఉండే ఉంటాయి. కాయిన్స్ బాక్స్ వద్ద క్యూలో నిలబడి మాట్లాడిన రోజులు కూడా ఉంటాయి.

ఫోన్ నంబర్లను గుర్తు పెట్టుకోవడం

ఫోన్ నంబర్లను గుర్తు పెట్టుకోవడం

గతంలో ప్రతి ఒక్కరూ చాలా ఫోన్ నంబర్లను గుర్తు పెట్టుకునేవారు. మొబైల్ వచ్చాక కనీసం సొంత నంబర్ ను కూడా గుర్తు పెట్టుకునే స్థితిలో లేరు. సొంత మనుషుల ఫోన్ నంబర్లు కూడా ఒక్కటీ గుర్తు ఉండవు.

ఒంటిరిగా ఉంటూ ఎంజాయ్ చేస్తూ

ఒంటిరిగా ఉంటూ ఎంజాయ్ చేస్తూ

మొబైల్స్ రాక ముందు ఒంటరిగా అలా బాల్కనీలోనో, సముద్రపు ఒడ్డునో, చెట్టు కిందో కూర్చొని ఆలోచిస్తూ ఉండేవారు. తమ మనస్సుతో తాము కాసేపు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడంతా సీన్ లేదు. ఎప్పుడూ సెల్ ఫోన్ తోనూ బిజీగా ఉంటున్నారు.

Most Read : లివర్ చెడిపోకుండా ఇలా శుభ్రం చేసుకుంటే లక్షల రూపాయల్ని మిగిలించుకోవొచ్చు

ఫోన్ బుక్ మెయింటెన్ చేసేవారు

ఫోన్ బుక్ మెయింటెన్ చేసేవారు

మొబైల్స్ రాక ముందు చాలా మంది ప్రత్యేకంగా ఫోన్ బుక్ మెయింటెన్ చేసేవారు. అందులో అందరి నంబర్లు రాసుకుని జేబులో భద్రంగా దాచుకునేవాళ్లు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు వెతికినా కనపడరు.

త్రీ వే కాలింగ్

త్రీ వే కాలింగ్

మొబైల్స్ రాక ముందు త్రీ వే కాలింగ్ అందుబాటులో ఉండేది. త్రీ వే కాలింగ్ మాట్లాడుతున్నామంటే చాలా గ్రేట్. కానీ ఇప్పుడు కాన్ఫిరెన్స్ కాల్ లో చాలా మందితో మాట్లాడే అవకాశం వచ్చింది.

బయటకు వెళ్లేవాళ్లం

బయటకు వెళ్లేవాళ్లం

స్మార్ట్ ఫోన్ రాక ముందు ఔటింగ్ కు వెళ్తూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఫోన్లు వచ్చాక అందులో మునిగి తేలిపోతున్నారు.

చదివేవాళ్లు

చదివేవాళ్లు

గతంలో డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు వెయిట్ చేయాల్సి వస్తేనో లేదంటే మరి ఎక్కడైనా వెయిల్ చేయాలంటే ఓపికగా అక్కడుండే పేపర్ లేదంటే మ్యాగజైన్ చదివేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫోన్ ఒత్తుకుంటూ కూర్చొంటున్నారు.

Most Read : అవకాశం ఇప్పిస్తానని చెప్పి నన్ను బాగా వాడుకున్నాడు, రకరకాల భంగిమల్లో ఇబ్బందిపెట్టాడు #mystory261

ఊహా ప్రపంచం

ఊహా ప్రపంచం

స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఊహా ప్రపంచంలో విహరించేవారు. కానీ ఇప్పుడు మాత్రం మొబైల్ అనే ప్రపంచంలోనే విహరిస్తున్నారు.

కళ్లలోకి చూసి

కళ్లలోకి చూసి

గతంలో ఏదైనా పార్టీకెళ్లినా లేదంటే ఎవరినైనా కలిస్తేచిరునవ్వుతో పలకరించి యోగక్షేమాలు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా మనలని పలకరించిన మరుక్షణమే ఫోన్ చేత పట్టుకుని వాట్సాప్ లేదంటే ఫేస్ బుక్ ఇంకేదైనాగానీ ఓపెన్ చేసుకుని అందులో నిమగ్నం కావడం కామన్ అయిపోయింది. ఎదుటి వ్యక్తితో మాట్లాడేంత ఓపిక, సమయం ఇప్పుడు లేదు. స్మార్ట్ ఫోనే ప్రపంచం అయ్యింది.

సెక్స్ కూడా చేయడం లేదు

సెక్స్ కూడా చేయడం లేదు

అంతేకాదు మొబైల్ రాకముందు భార్యతో ముద్దు ముచ్చటంటూ ఉండేది. ఇప్పుడు భర్తలంతా మొబైల్ లోనే మునిగితేలుతున్నారు. కనీసం ఐదు నిమిషాలు సెక్స్ లో పాల్గొనే ఓపిక కూడా చాలా మందికి ఉండడం లేదు. ఎందుకంటే ఆ ఐదు నిమిషాలు ఫోన్ పక్కన పెడితే ప్రపంచం ఏమైపోతుందనని భయం. ఇలా రాసుకుంటూ పోతే స్మార్ట్ ఫోన్ తర్వాత వచ్చిన మార్పులు కొన్ని వందలున్నాయి. సో.. స్టార్ట్ ఫోన్ ను కాస్త పక్కన పెట్టి మళ్లీ పాత ప్రపంచంలో కాస్త విహరించండి.

Image source (All Photos)

English summary

25 Things People Did Before Mobile Phones You Won't Believe

25 Things People Did Before Mobile Phones You Won't Believe