Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చిలిపి చెక్కిళ్ల ముద్దుగుమ్మ సోనాలిబింద్రేని వెంటాడుతున్న భయంకరమైన వ్యాధి,కోలుకోవాలని అభిమానుల పూజలు
సోనాలి బింద్రేకి క్యాన్సర్ మహమ్మారి సోకింది. ఈ విషయం సోనాలి బింద్రే తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటుంది.
ఆమె అందం ఆకాశమంత.. ఒకప్పుడు ఆమె నవ్వితే కుర్రాళ్ల ఎదలో ఏదో తెలియని గిలిగింత.. అవును చిన్ని కళ్ళతో, చిలిపి చెక్కిళ్లతో యువత హృదయాలను దొంగలించేసిన దొంగ ఆమె. . టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ విజయం సాధించాయి. నటించింది కొన్ని సినిమాలే అయినా ఇక్కడ అగ్రకథానాయకులకు మొదటి ఛాయిస్ గా నిలిచింది కొన్ని రోజులు. టాప్ పొజిషన్ కు చేరుకుంది.

ఓవర్ నైట్ స్టార్
ప్రేమికుల రోజు సినిమాలో అత్యంత అందంగా కనిపించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ భామ, మురారి, ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి తెలుగు చిత్రాల్లోనూ అలరించింది. మురారీలో మహేశ్ బాబు సరసన కొంటె పిల్లగా, అల్లరి ప్రేయసి, అమాయకురాలిగా నటించి తెలుగు వారి హృదయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది.ఆమెనేసోనాలి బింద్రే.

టాప్ హీరోయిన్ గా
ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించిన సోనాలి బింద్రే మరాఠీతో పాటు, దక్షిణభారతదేశంలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో టాప్ హీరోయిన్ గా నిలిచిన ఆమె చూడచక్కని అందం, అభినయంతో ఆకట్టుకుంది.

సోనాలి బింద్రేకి క్యాన్సర్ మహమ్మారి సోకింది
అంత అందమైన ముద్దు గుమ్మను ఒక భయంకరమైన వ్యాధి వెంటాడుతోంది. సోనాలి బింద్రేకి క్యాన్సర్ మహమ్మారి సోకింది. ఈ విషయం సోనాలి బింద్రే తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న తనకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా సపోర్ట్‌గా ఉన్నారనే విషయం కూడా తెలిపింది. సోనాలి క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ లో ఉన్నారు.
ట్విట్టర్ లో వివరించింది
సోనాలి బింద్రే తన ట్విట్టర్ ద్వారా క్యాన్సర్ వచ్చిందనే విషయాన్ని చెబుతూ.. "కొన్నిసార్లు.. నువ్వు కొంచెం కూడా ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా, లైఫ్ నిన్ను ఎక్కడికో విసిరేస్తుంది. నాకు రీసెంట్‌గా హై-గ్రేడ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. నిజానికి దీన్ని మేం ఏ మాత్రం ఊహించలేదు. అనారోగ్య కారణాలతో కొన్ని టెస్టులు చేయించుకున్న నాకు ఊహించని విధంగా క్యాన్సర్ అని తేలింది. నా కుటుంబం, నా క్లోజ్ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉంటూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. వారంతా నా చుట్టూ ఉండటం నా అదృష్టం."
A post shared by Sonali Bendre (@iamsonalibendre) on
న్యూయార్క్ లో చికిత్స
"వ్యాధిని గుర్తించారు కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవడమే సరైన మార్గం. వెంటనే ట్రీట్‌మెంట్ చేయించుకోవడం తప్ప దీనికి వేరే మార్గం లేదు. కాబట్టి నా డాక్టర్ల సలహాతో నేను న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్నాను. నేను కొద్ది రోజులుగా అందుకుంటున్న ప్రేమ, సపోర్ట్‌కి చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను."

మంచి సపోర్ట్ లభిస్తోంది
"నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ నాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. సానుకూలంగా ఆలోచించి, ఈ మార్గంలో అడుగడుగూ పోరాడాలి. నా వాళ్లు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే గొప్పగా అనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులే నా బలంగా క్యాన్సర్ తో పోరాడుతాను" అంటూ సోనాలి ట్వీట్‌లో పేర్కొన్నారు.

సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని కోరుకుందాం
1994లో తొలిసారి గోవిందా సరసన ఆగ్ అనే చిత్రంలో నటించింది సోనాలి. ఈ మూవీ ఆమెకి డెబ్యూ కాగా, పలు హిట్ చిత్రాలలో నటించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపైన పలు రియాలిటీ షోస్ కూడా చేస్తుంది. ఆమె క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని, ఆమె మళ్లీ మామూలు స్థితికి రావాలని కోరుకుందాం.



Click it and Unblock the Notifications