Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
రవిబాబు పందిపిల్లకు బ్రెష్ చెయ్యడానికి, పందిపిల్లతో ఫుష్ అప్స్ చేయడానికి కారణం తెలుసా?
తాజాగా ఫిట్‌నెస్ చాలెంజ్‌లో భాగంగా రవిబాబు పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. బంటితో కలిసి వ్యాయామం చేస్తున్న వీడియో, పందిపిల్లను వీపు మీద ఎక్కించుకుని రవిబాబు ఫుష్ అప్స్ తీశాడు.
డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు తీస్తు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. 'అల్లరి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన విలక్షణమైన దర్శకుడు, నటుడు రవిబాబు ఎవరూ ఊహించనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది దర్శకులు కుక్కలు, కోతులు, ఏనుగులు, ఈగలు వంటి జీవులను పెట్టి సినిమాలు తీశారు. కానీ రవిబాబు స్టైలే వేరు. ఏకంగా పందిపిల్లతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. నిజంగా ఇప్పటివరకు ఇలాంటి సాహసాన్ని ఎవరూ చేసుండరు.

అదుగో
పందిపిల్ల ముఖ్య పాత్రగా తెరకెక్కే ఈ చిత్రంలో అభిషేక్, నాభ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ''అదుగో'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రవిబాబుకి 'అ' సెంటిమెంట్ ఎక్కువని అందరికి తెలిసిందే. అందుకే ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సపోర్టుతో ఇలాంటి విలక్షణ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రవిబాబు సిద్ధమయ్యారు.

సినిమాపై భారీ అంచనాలు
ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. పందిపిల్లపై సినిమా చేయడం తొలిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ స్క్రిప్ట్‌తో సినిమా రూపొందించడంలో ఎదురైన అనేక సవాళ్ళను దాటి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు.

పందిపిల్ల పేరు బంటి
ఈ సినిమాలో నటిస్తున్న పందిపిల్లకు `బంటి` అని నామకరణం చేశారు. ఆ పందిపిల్లకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బంటికి రవిబాబు పళ్లు తోముతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
యానీమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌తో
పందిపిల్ల ఎలా ప్రవర్తిస్తుంది అనే దానిపై స్టడీ చేసిన రవిబాబు యానీమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌తో సినిమాను తెరకెక్కించాలనుకున్నాడట. కాని అది ఉపయోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనికావడంతో సిలికాన్‌తో పందిపిల్ల మోడల్‌ను తయారుచేశారు. సినిమా చిత్రీకరించే సమయంలో ఆ మోడల్ విరిగిపోయింది. దాంతో నిజమైన పందిపిల్లతోనే సినిమా చిత్రీకరించాడు.
పందిపిల్లకు శుభ్రంగా పళ్లు తోమి
ఆ మధ్య పలు సందర్భాలలో పందిపిల్లతోనే బయట కనిపించాడు. చాలా ఇంటర్వ్యూలకు పందిపిల్లతోనే వెళ్లాడు. అయితే షూటింగ్ సమయంలో బంటి (పంది పిల్ల)ని దర్శకుడు ఎలా రెడీ చేశారో ఫన్నీగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రవిబాబు పంది పిల్ల పళ్లుతోముతూ కనిపించారు. పందిపిల్లకు శుభ్రంగా పళ్లు తోమి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బంటితో కలిసి వ్యాయామం
ఇక రవిబాబు, తను ఏ పని చేసినా కాస్త స్పెషాలిటీని క్రియేట్ చేసుకొంతాడన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కొన్నిసార్లు ఆయన చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ఫిట్‌నెస్ చాలెంజ్‌లో భాగంగా రవిబాబు పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. బంటితో కలిసి వ్యాయామం చేస్తున్న వీడియోను రవిబాబు అభిమానులతో పంచుకున్నారు.

పందిపిల్లను వీపు మీద ఎక్కించుకుని
పందిపిల్లను వీపు మీద ఎక్కించుకుని రవిబాబు ఫుల్అప్స్ తీశారు. `ఫిట్‌నెస్ కోసం బంటి కూడా వ్యాయామం చేయగలుగుతోంది.. మరి, మీరెందుకు చేయరు` అంటూ రవిబాబు కామెంట్ పోస్ట్ చేశారు. `హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్` చాలెంజ్‌లో భాగంగా రవిబాబు ఈ వీడియోను రూపొందించారు.

పందిపిల్లతోనే ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూకు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో నోట్ల రద్దు సమయంలో పందిపిల్లతో కలిసి ఏటీఎం క్యూలో నిల్చోని అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా మొన్నామధ్య పందిపిల్లకు పళ్లు తోముతూ కనిపించాడు. ఇక ఆ మధ్య ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూకు కూడా పందిపిల్లను తీసుకుని వెళ్లాడు రవిబాబు.

పందిపిల్లకు మంచి పేరు తీసుకురావాలి
"నేను గోల్స్ పెట్టుకోను. ఈ రోజు పందిపిల్లతో సినిమా తీశాను. అంతవరకే. సినిమాని బాగా ఎగ్జిక్యూట్ చేయాలి. పందిపిల్లకు మంచి పేరు తీసుకురావాలి. ఇప్పటికే సొసైటీలో దీనికి బ్యాడ్‌నేమ్ ఉంది. నాకు బ్యాడ్‌నేమ్ వచ్చినా ఫర్వాలేదు. దీనికి రాకూడదు." అంటూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

పందిపిల్ల సెక్యూర్డ్‌గా ఫీలైనపుడు
అలాగే గంట నుంచి పట్టుకున్నా పంది పిల్ల అసలు కదలడం లేదు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆర్కే అడగ్గా... పందిపిల్ల హ్యూమన్ బేబీ లాంటిదే. మనం పట్టుకోవడంలోనే ఉంటుంది. అది సెక్యూర్డ్‌గా ఫీలైనపుడు అసలు కదలదంటూ రవిబాబు సమాధానం ఇచ్చారు. ఇక రవిబాబు ఇంట్లో కుక్క ఉందట. దాని పేరు మూర్తి అట.. లడ్డుబాబు స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు ఒక బాబు పాత్రకు ఆ పేరు పెట్టారట. అదే పేరును కుక్కకూ పెట్టారట.
కారణం ఒక్కటే
రవిబాబు పందిపిల్లకు బ్రెష్ చెయ్యడానికి, పందిపిల్లను పైన ఎక్కించుకుని ఫుష్ అప్స్ చేయడానికి కారణం ఒక్కటే. పందిపిల్ల (బంటి) తో తీసే సినిమా అదుగో మీద ఆసక్తి కొనసాగించేందుకు రవిబాబు ఇలా వినూత్నంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.



Click it and Unblock the Notifications