For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14 ఏప్రిల్ 2018 అంబేద్కర్ జయంతి --ఆయన విశిష్టత మీకు తెలుసా ?

14 ఏప్రిల్ 2018 అంబేద్కర్ జయంతి --ఆయన విశిష్టత మీకు తెలుసా

By R Vishnu Vardhan Reddy
|

1890 వ దశకంలో మెహర్ కులానికి చెందిన ఒక నిరుపేద బాలుడు ఉండేవాడు. అతడిని పాఠశాల గది బయట కుర్చోపెట్టేవారు. ఇతరులతో కలిసి కుర్చోనిచ్చేవారు కాదు. తాను కూర్చోవడానికి అవసరమైన సంచిని ప్రతిఓరోజూ ఇంటి నుండి స్కూల్ కి తెచ్చుకొనేవాడు ఆ బాలుడు. ఇదొక్కటే కాదు, ఒకవేళ అతడు గనుక పాఠశాలలో నీళ్లు తాగాలని భావిస్తే, అక్కడ పనిచేసే గుమస్తా కొద్దిగా ఎత్తులో నుండి అతడి చేయి పొత్తిళ్ళల్లోకి నీళ్లు పోసేవాడు. ఆ రోజుల్లో అంటరాని తనం అంత దారుణంగా ఉండేది.

అలాంటి వాతావరణంలో తక్కువ కులానికి చెందిన అమాయకపు బాలుడు ఎలా పెరిగి ఉంటాడో మనం అందరం అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ అతడి మెదడు పై ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయి? తన గురించి తనకు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటుంది? అతడి ఆత్మ స్థైర్యం ఎలా ప్రభావితం అయి ఉంటుంది? ఎటువంటి అనుమానం అవసరం లేదు ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.

Ambedkar Jayanti - 14th April 2018

కానీ, ఈ మానసిక దురాగతాల నుండి, ఒక బలవంతుడైన బాలుడు తనను తానూ రక్షించుకోవడమే కాకుండా, వాటిని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేసాడు. ఇతరులు జీవించడానికి, ఆనందంగా పెరగడానికి ఆరోగ్యవంతమైన మంచి వాతావరణాన్ని ఏర్పరిచాడు. అతడు ఎవరో కాదు బి.ఆర్ అంబేద్కర్. ఈరోజు మనం అందరం ఆయనని భారతీయ రాజ్యాంగం రాసిన జాతిపితగా కీర్తించడం జరుగుతుంది.

డాక్టర్ భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 వ సంవత్సరం మధ్య ప్రదేశ్ లో జన్మించాడు. ఇతడిని బడా సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఇతడి కుటుంబం మరాఠీ మూలలను కలిగి ఉంది. ఈయన తండ్రి రామ్ జీ మాళోజి సక్పాల్ బ్రిటీష్ భారతీయ సైన్యంలో సుబేదారిగా పనిచేసేవాడు. ఇతడి తల్లి పేరు భీమాబాయి.

చదువుల కోసమై ఎల్ఫిన్స్టన్ హై స్కూల్, ఎల్ఫిన్స్టన్ కాలేజీ, కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ ఇలా ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో చదువుని అభ్యసించాడు.

Ambedkar Jayanti - 14th April 2018

విద్యార్థి దశలో తన ప్రతిభతో ఎన్నో స్కాలర్ షిప్ లు తీసుకున్నప్పటికీ, కొన్ని సంవత్సరాల తర్వాత తన జీవిత ప్రయాణంలో ప్రైవేట్ బోధకుడిగా పనిచేసాడు. అకౌంటెంట్ గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టించే కన్సల్టెంట్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. అయితే వీటిల్లో ఎందులోనూ విజయం సాధించలేకపోయాడు. అందుకు కారణం అంటరానితనం. ఆ తర్వాత ముంబై నగరంలో రాజకీయ శాస్త్రంలో అధ్యాపకుడిగా చేరాడు. తనదైన ప్రతిభతో విద్యార్థుల్లో తక్కువ కాలంలోనే ఎంతో ఆదరణకు నోచుకున్నాడు. అయితే, మళ్ళీ అంటరానితనం మూలంగానే తన సహా అధ్యాపకులచేత వివక్షకు గురయ్యాడు.

అంబేద్కర్ అంటరానితనాన్ని పూర్తిగా పారద్రోలాలని తరచూ ఎక్కువగా ఆలోచించేవాడు. అయితే 1927 వ సంవత్సరంలో చివరాఖరికి ఈ మహమ్మారిని పూర్తిగా సమాజంలో లేకుండా చేయాలనే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రజా తాగునీటి వ్యవస్థను అంటరానివాళ్ళు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించుకునేలా ఉద్యమాలు లేవనెత్తాడు, దేవాలయాల్లోకి అంటరాని వారు ప్రవేశించడానికి అవకాశం కలిగించాలంటూ, అది వారి హక్కు అంటూ పోరాడాడు. ఇలా ఎన్నో ఉద్యమాలు చేసాడు. వీటన్నింటి వల్ల ఈయనను అభిమానించేవారు రోజు రోజుకు పెరిగిపోయారు. 1930 సంవత్సరంలో కల్ రామ్ దేవాలయ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.

వెనుకబడిన తెగలు, కులాల కోసం రిజర్వేషన్ :

1932 వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తక్కువ కులంగా పిలవబడే వారికోసం ఒక ప్రత్యేకమైన నియోజక వర్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే, ఇలాంటి చర్యల వల్ల హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతుందని గాంధీజీ భావించారు. ఇదే విషయాన్ని అంబేద్కర్, మదన్ మోహన్ మాలవీయ తో చర్చించాడు. సుదీర్ఘమైన ఆలోచనలు, అందుకు సంబంధించిన చర్చలు, ప్రతిపాదనలు బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఇలా చేయడం ద్వారా అణచివేయబడిన కులాల కోసం కొన్ని స్థానాలను రిజర్వు చేసుకోవడం లో విజయం సాధించారు. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 178 కి చేరింది. బిటిష్ ప్రభుత్వం ప్రతిపాదనలు గనుక పరిశీలిస్తే అంతకముందు ఈ మొత్తం సీట్ల సంఖ్య కేవలం 70 మాత్రమే.

Ambedkar Jayanti - 14th April 2018

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా చేయాలని అంబేద్కర్ కు ఆహ్వానం పంపడం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ రూపకల్పన కమిటీలో ఈయనను చైర్ పర్సన్ ను చేసారు. ఈ కారణం చేతనే ఈ రోజుకి కూడా అంబేద్కర్ ని భారతీయ రాజ్యాంగం రూపొందించిన జాతిపితగా పిలుస్తారు.

రాజ్యాంగం ప్రతిఒక్క వ్యక్తికి జీవించడానికి ఎన్నో హక్కులను ఇచ్చింది, నిబంధనలకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో చెప్పింది. అదే సమయంలో ఎస్. సి లు, ఎస్. టి లకు సివిల్ సర్వీసెస్, పాఠశాలలు, కళాశాలల్లో కొన్ని సీట్లు రిజర్వేషన్ ఉండేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు.

26 నవంబర్ 1949 వ సంవత్సరంలో అప్పటి భారతీయ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించడం జరిగింది.

అంబేద్కర్ హిల్టన్ యంగ్ కమిషన్ కు ఇచ్చిన సూచనల ఆధారంగానే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ను తీర్చి దిద్దడం జరిగిందని చెబుతారు.

బౌద్ధమతంలోకి మారిన అంబేద్కర్ :

1950 వ సంవత్సరంలో అంబేద్కర్ దృష్టి బౌద్ధ మతం వైపు మళ్లింది. 1955 వ సంవత్సరంలో " భారతీయ బుద్ధ మహా సభ "ను ఏర్పాటు చేసారు. 1956 వ సంవత్సరంలో " బుద్ధుడు, ఆయన దర్మం " అనే పుస్తకాన్ని రాయడం పూర్తి చేసాడు.

డిసెంబర్ 6, 1956 వ సంవత్సరంలో నిద్రిస్తున్న సమయంలో అంబేద్కర్ మరణించారు. 1990 వ సంవత్సరంలో అతని మరణానంతరం, ఆయనకు భారత రత్న ఇవ్వడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఢిల్లీ లోని 26 అల్లీపూర్ రోడ్ లో ఒక స్మారకాన్ని ఏర్పాటు చేసారు.

ఈయన జాతికి ఒక ఆస్తిగా మారిపోయాడు. అంటరాని వాళ్ళు ఈయనను ఒక మహా పురుషుడిగా భావించారు. ఈ మార్పే గనుక లేకుండా ఉండి ఉంటే, పాఠశాలలో చదువుతున్న ఎంతోమంది చిన్నారుల అమాయక జీవితాలు అంటరానితనం, కులం పేరుతొ ఎంతలా నాశనం అయ్యేవో ఊహకు కూడా అందదు.

English summary

Ambedkar Jayanti - 14th April 2018

In the decade of 1890s, a poor school boy, belonging to the Mahar caste, was made to sit outside the class. He was not allowed to sit with the others. He would carry his gunny sack used for sitting, from home to school every day. Not only this, if he wanted to have water, the peon would pour the water from a height in his cupped hands.
Desktop Bottom Promotion