For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనార్క‌లిని ప్రేమించిన సలీం నిజంగా భగ్న ప్రేమికుడా? జహంగీర్ గా కంటికి నచ్చిన అమ్మాయిని అనుభవించాడు

సలీం, అనార్క‌లిల ప్రేమ క‌థ గురించి అంద‌రికీ తెలిసిందే క‌దా. మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల సంస్థానంలో అనార్క‌లి ఓ చెలిక‌త్తె. బానిస జీవితాన్ని గ‌డుపుతూ ఉండేది. సలీం అనార్కలి,నూర్ జ‌హాన్‌,నూర్జహాన్, నూర్జాహాన్

|

సలీం, అనార్క‌లిల ప్రేమ క‌థ గురించి అంద‌రికీ తెలిసిందే క‌దా. మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల సంస్థానంలో అనార్క‌లి ఓ చెలిక‌త్తె. బానిస జీవితాన్ని గ‌డుపుతూ ఉండేది. ఈ క్ర‌మంలోనే స‌లీంతో ప్రేమ‌లో ప‌డుతుంది. వీరిద్ద‌రి గురించి తెలిసిన అక్బ‌ర్ అనార్క‌లిని నాలుగు గోడ‌ల మ‌ధ్య స‌మాధి చేస్తాడు.

మహాసామ్రాట్‌ అక్బర్‌ కుమారుడైన సలీం అనారు పూల తోటలో కనిపించిన సామాన్య యువతిని ప్రేమిస్తాడు. ఆమె అసలు పేరు నదీరా. అప్పుడాయన కూడా సామాన్య సైనికుడి వేషంలోనే వుంటాడు. యువరాజునని చెప్పకుండా అసలు సంగతి దాచిపెడతాడు. ఆ సమయంలోనే అక్బర్‌ అటుగా రావడంతో తప్పుకుంటాడు. అక్బర్‌ కూడా ఆమె గాన నాట్యాలకు ముగ్దుడై ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు.

తోటలో కనిపించింది గనుక అనార్కలి

తోటలో కనిపించింది గనుక అనార్కలి

ఆ తోటలో కనిపించింది గనుక అనార్కలి బిరుదునిస్తాడు. సలీం మేనమామ సైన్యాధిపతి మాన్‌సింగ్‌ ఈ ప్రేమ విషయం తెలుసుకుని అనార్కలిని మరచిపొమ్మని హెచ్చరిస్తాడు. పైగా సలీంను తనతో యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడితే సలీం తనను తెచ్చుకుంటాడు. తర్వాత అతను యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలతో చేసి కాపాడుకుంటుంది. అయితే అతను మామూలు సైనికుడు కాదని అక్బర్ కొడుకని తెలుసుకుంటుంది.

అనార్కలికి శిక్ష పడుతుంది

అనార్కలికి శిక్ష పడుతుంది

దాంతో అనార్కలి అతనిని ప్రేమించడానికి సంకోచిస్తుంది. దీంతో నాట్యంతో మెప్పించి ప్రేమ వరం పొందవచ్చని సలీం నచ్చజెబుతాడు. సలీంపై ఎప్పటినుంచో ఆశలు పెంచుకున్న గుల్నాం ఆమె నాట్య ప్రదర్శన రోజున మత్తు కలిపిన పానీయం ఇచ్చి మోసం చేస్తుంది. దాంతో అనార్కలికి శిక్ష పడుతుంది. ఆ సమయంలో సలీం తన ప్రేమ సంగతి తల్లి జోదాభాయికు చెప్పి గట్టిగా వాదిస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది. తండ్రిపై వేటు వేయబోయి తల్లిని చూసి ఆగిపోతాడు సలీం.

మరణ శిక్ష విధిస్తాడు

మరణ శిక్ష విధిస్తాడు

అక్బర్‌ పాదుషా వారిద్దరికీ మరణ శిక్ష విధిస్తాడు. అయితే కుమారుడికి అమలు చేయడు. అతను వచ్చే సరికి అనార్కలికి మాత్రం సజీవ సమాధి కట్టేస్తారు. క‌థ అంత‌టితో ముగుస్తుంది. అయితే నిజానికి ఈ అనార్క‌లి క‌థ వ‌ట్టిదే అని కొంద‌రు చ‌రిత్ర‌కారులు చెబుతారు. అనార్క‌లి నిజంగా ఉంద‌న‌డానికి సాక్ష్యాలు ఏమీ లేవ‌ని, ఆమె స‌మాధిగా చెప్ప‌బ‌డుతున్న నిర్మాణం కూడా వ‌ట్టిదే అని అంటారు.

సలీంకు ఇంకో పేరు.. జ‌హంగీర్‌ (నూరుద్దీన్ సలీం జహాంగీర్)

సలీంకు ఇంకో పేరు.. జ‌హంగీర్‌ (నూరుద్దీన్ సలీం జహాంగీర్)

అయితే ఆ విష‌యం పక్క‌న పెడితే నిజానికి స‌లీం గొప్ప ప్రేమికుడు మాత్రం కాదు, మ‌హిళ‌ల‌ను వేధించే ఓ క‌సాయి అని చెప్ప‌వ‌చ్చు. అవును, స‌లీం గురించిన ప‌లు షాకింగ్ విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అక్బ‌ర్ పెద్ద కుమారుడు సలీంకు ఇంకో పేరు కూడా ఉంది. అదే జ‌హంగీర్‌ (నూరుద్దీన్ సలీం జహాంగీర్). అదే పేరిట అత‌న్ని పిలుస్తారు. అయితే జ‌హంగీర్ ఓ కామ‌లాల‌సుడ‌ట‌. అత‌నికి ఉన్న భార్యలు స‌రిపోర‌ని చెప్పి 300 మందితో సంబంధాల‌ను అత‌ను క‌లిగి ఉండేవాడ‌ట‌.

మొద‌టి భార్య పేరు మన్‌భ‌వ‌తి బాయి

మొద‌టి భార్య పేరు మన్‌భ‌వ‌తి బాయి

ఇత‌ని మొద‌టి భార్య పేరు మన్‌భ‌వ‌తి బాయి. ఈమెకు ఓ కుమారుడు జ‌న్మించాడు. అత‌ని పేరు ఖుస్రూ మిర్జా. ఇత‌నే జ‌హంగీర్ మొద‌టి కుమారుడు. అనంత‌రం మ‌న్‌భ‌వ‌తి బాయి పేరు షా బేగంగా మారింది. అనంతరం ధ‌మేరి (ప్ర‌స్తుత హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌)కి చెందిన ఫుల్ బేగం అనే యువ‌తిని రెండో వివాహం చేసుకున్నాడు జ‌హంగీర్‌. ఇక ఇత‌ని మూడో భార్య జోద్ బాయి. జ‌గ‌త్ గొసెయిన్ అనే పేరు కూడా ఈమెకు ఉంది. ఈమె జ‌హంగీర్ రెండో కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అత‌ని పేరు ఖుర్రం.

6వ వివాహం

6వ వివాహం

1586 జూలైలో బిక‌నీర్ మ‌హారాజు కుమార్తెను 4వ వివాహం చేసుకున్నాడు. అదే నెల‌లో క‌ష్గ‌ర్ సుల్తాన్ కుమార్తె మ‌లికా షిక‌ర్ బేగంను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె 1592లో చ‌నిపోయింది. త‌రువాత షాహిబ్ ఇ జ‌మాల్ అనే మ‌రో మ‌హిళ‌ను 6వ వివాహం చేసుకున్నాడు. ఈమెకు కూడా ఓ కుమారుడు జ‌న్మించాడు. అత‌ని పేరు ప‌ర్వీజ్ మిర్జా.

తృప్తి చెంద‌లేదు

తృప్తి చెంద‌లేదు

అయితే ఈమె కూడా చ‌నిపోయింది. వీరే కాకుండా మ‌లికా ఇ జ‌హాన్ బేగం సాహిబా అనే మ‌హిళ‌ను, రాజా ద‌ర్యా మ‌ల్భాస్ కుమార్తెను, అబియా కాశ్మీరి అనే మ‌హిళ సోద‌రిని, క‌న్వాల్ రాణి అనే మ‌హిళ‌ను, స‌య్యిద్ ముబార‌క్ ఖాన్ అనే వ్య‌క్తి కుమార్తెను, హుస్సేన్ చాక్ అనే రాజు కుమార్తెను, సాలిహా బాను బేగం అనే మ‌హిళ‌ను, కోకా కుమారి సాహిబా అనే మ‌హిళ‌ను కూడా జ‌హంగీర్ వ‌రుస‌గా వివాహం చేసుకున్నాడు. అంత మందిని వివాహం చేసుకున్నా, ఎంతో మంది మ‌హిళ‌ల‌ను బానిస‌లుగా చేసుకున్నా అత‌ను తృప్తి చెంద‌లేదు.

నూర్ జ‌హాన్‌పై జ‌హంగీర్ క‌న్ను ప‌డింది

నూర్ జ‌హాన్‌పై జ‌హంగీర్ క‌న్ను ప‌డింది

అదే క్ర‌మంలో మెహ‌ర్‌-ఉన్‌-నిస్సా (నూర్ జ‌హాన్‌) అనే మ‌హిళ‌పై జ‌హంగీర్ క‌న్ను ప‌డింది. అక్బర్ వీరి వివావానికి అంగీకరించలేదు. పైగా అక్బర్ షేర్ ఖాన్‌ తో నూర్జహాన్ వివాహం జరిపించాడు. 1605లో అక్బర్ మరణించిన తరువాత ఆయన పెద్దకుమారుడు జహంగీర్ రాజ్యాధికారం చేపట్టాడు. నూర్జహాన్ మొదటి భర్త షేర్ ఆఫ్ఘన్ 1607 లో మరణించాడు.

సభకు పిలిపించుకున్నాడు

సభకు పిలిపించుకున్నాడు

తరువాత నూర్జహాన్ ఆమె కుమార్తె లాడీ బేగంలను జహంగీర్ తన సభకు పిలిపించుకున్నాడు. తరువాత జహంగీర్ నూర్జహాన్‌ను ఆయన సవతితల్లి రుకయా సుల్తాన్ బేగానికి సేవకురాలిగా నియమించుకున్నాడు. రుకయా సుల్తాన్ బేగం అక్బర్ మొదటి భార్య. నూర్జహాన్ తన కుమార్తె లాడీ బేగంతో కలిసి రుకయా సుల్తాన్ బేగంకు 4 సంవత్సరాలు సేవలు చేసింది.

లొంగ‌దీసుకోవాల‌నుకున్నాడు

లొంగ‌దీసుకోవాల‌నుకున్నాడు

నూర్జహాన్ ను జ‌హంగీర్ లొంగ‌దీసుకోవాల‌నుకున్నాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె మీద కోపాన్ని త‌న అంతఃపురంలోని స్త్రీల‌పై చూపించేవాడ‌ట‌. వారిని బాగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేసేవాడ‌ట‌. అయితే అలా 4ఏళ్లు గ‌డిచాక చివ‌ర‌కు నూర్ జ‌హాన్‌ను అత‌ను పెళ్లి చేసుకున్నాడు.

నూర్ జ‌హాన్ అంటేనే ఎక్కువ మ‌క్కువ

నూర్ జ‌హాన్ అంటేనే ఎక్కువ మ‌క్కువ

ఆ సమయంలో నూర్జహాన్ వయసు 34. నూర్జహాన్ జహంగీర్ 20వ భార్య. వారి వివాహం తరువాత వారికి ఇద్దరు సంతానం కలిగారు. అయినప్పటికీ జహంగీరుకు అనేకమంది సంతానం ఉన్నందున నూర్జహాన్ సంతానం ప్రస్తావన ఎక్కడ లేదు.ఈ క్ర‌మంలో మిగిలిన అంద‌రు భార్య‌ల క‌న్నా నూర్ జ‌హాన్ అంటేనే జ‌హంగీర్ ఎక్కువ మ‌క్కువ చూపించేవాడ‌ట‌. అయితే ఆమె త‌రువాత కూడా అత‌ను చాలా మందిని వివాహం చేసుకున్న‌ట్టు చ‌రిత్ర చెబుతోంది.

తాగుడుకు బానిస

తాగుడుకు బానిస

కానీ జహంగీర్ చరిత్రలో అనార్క‌లిని ప్రేమించిన భగ్న ప్రేమికుడు సలీంగా మాత్రం నిలిచిపోయాడు. వాస్తవానికి అదంతా కట్టు కథని నిజమైన సలీం (జహంగీర్) వందలాది మంది అమ్మాయిలను అనుభవించాడని చరిత్ర చెబుతుంది. జహాంగీర్ తాగుడుకు బానిస. ఈ దురలవాటుతోనే మరణించాడు. మంచి న్యాయ పరిపాలకుడిగా పేరున్నా తాగుడు చక్రవర్తి గా చెడ్డపేరు తెచ్చుకొని, అదే పేరుతో మరణించాడు.

English summary

anarkali and salim a mughal love story

anarkali and salim a mughal love story
Desktop Bottom Promotion