For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రానా కన్ను వెనకున్న కథ.. ఆ కంటికే ఆపరేషన్.. ఇక నుంచి రెండు కళ్లతో చూసే అవకాశం

టాలీవుడ్ హ్యండ్ సమ్ హీరో, ఆరున్నర అడుగుల అందగాడు, బహుబలి భల్లాలదేవ తన గురించిన ఆ మధ్య ఒక రహస్యం చెప్పాడు. తనకు చిన్నప్పుడు కుడి కన్ను ఉండేది కాదట. రానా కుడి కన్ను, రానా కంటి ఆపరేషన్, దగ్గుపాటి రానా

|

టాలీవుడ్ హ్యండ్ సమ్ హీరో, ఆరున్నర అడుగుల అందగాడు, బహుబలి భల్లాలదేవ తన గురించిన ఆ మధ్య ఒక రహస్యం చెప్పాడు. తనకు చిన్నప్పుడు కుడి కన్ను ఉండేది కాదని.. ఎవరో ఓ దాత ఇచ్చిన కన్నుతో లోకాన్ని చూడగల్గుతున్నానంటూ తన గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని ఆ మధ్య బయటపెట్టాడు రానా దగ్గుబాటి . మంచులక్ష్మీ చేపట్టిన మేము సైతం అనే కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లిన రానా ఈ విషయం చెప్పాడు.

భావోద్వేగానికి గురైన రానా

భావోద్వేగానికి గురైన రానా

ఆ కార్యక్రమంలో భాగంగా బాధితురాలితో మాట్లాడుతున్న సందర్భంలో..ఆమె ఇద్దరు కొడుక్కుల్లో పెద్దవాడు ఏడుస్తున్న సందర్భంలో..భావోద్వేగానికి గురైన రానా ఆ పిల్లాడిని ఓదారుస్తూ..ఈ నిజాన్ని చెప్పాడు.

ఈ వీడియో చూశాక రానా మీద చాలా మందికి గౌరవం పెరిగింది.

దర్పాన్ని ప్రదర్శించడు

దర్పాన్ని ప్రదర్శించడు

ఓ సెలెబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ రానా ఎక్కడా దర్పాన్ని ప్రదర్శించడు. కలుపుగోలుగా ఉంటాడు. సామాజిక సేవలో చురుక్కా పాల్గొంటుంటాడు. పాత్ర ఇమేజ్ ను పట్టించుకుకోకుండా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయాలని తపిస్తుంటాడు.

డోనర్ ఇచ్చిందే

డోనర్ ఇచ్చిందే

తన కుడి కన్ను కూడా డోనర్ ఇచ్చిందేనని రానా అప్పట్లో స్వయంగా చెప్పాడు. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో తన కంటికి ఆపరేషన్ చేసి డోనర్ ఇచ్చిన కన్నును అమర్చాడని కూడా రానా చెప్పాడు.

క్రేజీ ప్రాజెక్ట్స్

క్రేజీ ప్రాజెక్ట్స్

ఇక బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా ద‌గ్గుబాటికి ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రానా ప్రస్తుతం త‌న తన క‌న్ను ఆప‌రేష‌న్ చేయించుకోనున్నాడ‌ట‌.

విదేశాల్లో ఆపరేషన్

విదేశాల్లో ఆపరేషన్

ఒక కంటితో మాత్రమే చూడగలుగుతానన్న రానా.. సమస్య ఉన్న ఆ రెండో కంటికి ఇప్పుడు విదేశాల్లో ఆపరేషన్ చేయించుకోబోతున్నట్టు తెలుస్తోంది. రెండో కన్ను నొప్పితో తీవ్రంగా వేధిస్తోందని, అందుకే ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

సతీశ్ గుప్తా

సతీశ్ గుప్తా

ఇక ఈ విషయాన్ని రానా తండ్రి నిర్మాత సురేశ్ బాబు.. విదేశాల్లోనే రానాకు ఆపరేషన్ జరుగుతుందని మీడియాకు వెల్లడించారు. ఇటీవలే మాక్సివిజన్‌కు చెందిన సతీశ్ గుప్తా అనే వైద్యుడు రానాకు కంటి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు విదేశాల్లో చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

హై బీపీ వ‌ల్ల వాయిదా

హై బీపీ వ‌ల్ల వాయిదా

రానాకు కుడి క‌న్ను క‌నిపించ‌దనే విషయం మొదట రానా స‌న్నిహితులు, స్నేహితులు స‌హా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కొంద‌రికి మాత్ర‌మే తెలుసు. వాస్త‌వానికి ఈపాటికే కంటి ఆప‌రేష‌న్ జ‌ర‌గాల్సింది. రానాకి ఉన్న హై బీపీ వ‌ల్ల వాయిదా వేశార‌ట‌. అయితే శ‌స్త్ర‌చికిత్స ద్వారా శాశ్వ‌త ప‌రిష్కారం వెతుకుతున్నార‌ట. రాణాకు జరబోయే సర్జరీ ఇది రెండోది. ఇక రాణాకు ఉన్న బీపీ అనేది వారసత్వంగా వస్తోందని చెప్పారు సురేష్ బాబు.

1945

1945

రానా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపధ్యంలో ‘1945' అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయ‌నున్నాడు . ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు . ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది.

హథీ మేరీ సాథీ

హథీ మేరీ సాథీ

1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఇవే కాక గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశ్యప అనే చిత్రం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. బాల డైరెక్షన్లోను రానా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో

తేజ ద‌ర్శ‌క‌త్వంలో

వీటి త‌ర్వాత నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు రానా. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాలో రానా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. రానా కంటికి ఆపరేషన్ జరిగి సక్సెస్ అయితే ఇక నుంచి రానా రెండు కళ్లతో చూసే అవకాశం ఉంటుంది.

English summary

baahubali star rana daggubati to undergo eye surgery

baahubali star rana daggubati to undergo eye surgery
Story first published:Tuesday, June 5, 2018, 17:33 [IST]
Desktop Bottom Promotion